అనుపమ పరమేశ్వరన్ నటించిన లాక్‌డౌన్ సినిమా థియేటర్లలో రిలీజైన రెండు నెలల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఓటీటీలో లాక్‌డౌన్
సౌత్ స్టార్ హీరోయిన్ ಅనుపమా పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన 'లాక్‌డౌన్' సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. కొత్త దర్శకుడు ఏ.ఆర్. జీవా డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఒక ఎమోషనల్ కథ. జనవరి 30న థియేటర్లలో రిలీజైంది. ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. భయం, ధైర్యం, బతుకు పోరాటం వంటి అంశాలతో.. ఉత్కంటభరితంగా ఉంటుందీ సినిమా.
ఎక్కడ చూడవచ్చంటే?
తాజాగా 'లాక్‌డౌన్' సినిమా ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ మొదలైంది. ఈ సినిమాకు కే.ఏ. శక్తివేల్ కెమెరామెన్‌గా పనిచేశారు. ఎన్.ఆర్. రఘునాథన్, సిద్ధార్థ్ విపిన్ సంగీతం అందించారు. అనుపమతో పాటు చార్లీ, నిరోషా, ప్రియా వెంకట్, లివింగ్‌స్టన్, ఇందుమతి, రాజ్‌కుమార్, షాంజీ, లొల్లు సభా మారన్, వినాయక్ రాజ్, విధు, అభిరామి, రేవతి, సంజీవ్, ప్రియా గణేష్, ఆశ వంటి పెద్ద తారాగణమే ఉంది.
ఇక సినిమా ఇతర టెక్నికల్ టీమ్ విషయానికొస్తే... వీజే సాజు జోసెఫ్ ఎడిటింగ్, ఏ. జయకుమార్ ఆర్ట్ డైరెక్షన్, షరీఫ్, శ్రీ గిరీష్ కొరియోగ్రఫీ, ఓం శివప్రకాశ్ స్టంట్స్ చూసుకున్నారు. మీనాక్షి శ్రీధరన్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా, ఎం. రామకృష్ణన్ వస్త్రాలు, పీ.ఎస్. చంద్రు మేకప్, అరుణ్ ఎం. ఎస్‌ఎఫ్‌ఎక్స్ బాధ్యతలు తీసుకున్నారు. టి. ఉదయ కుమార్ సౌండ్ మిక్సింగ్ చేయగా, పిక్సెల్ లైట్ స్టూడియోలో డీఐ పనులు జరిగాయి. లైకా మ్యూజిక్ ద్వారా ఆడియో రిలీజైంది.
అనుపమ పరమేశ్వరన్ సినిమాలు
అనుపమ పరమేశ్వరన్ కెరీర్ విషయానికొస్తే... ఈమె మలయాళ సూపర్ హిట్ 'ప్రేమమ్' సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అందులో 'మేరీ' పాత్రలో కనిపించి మెప్పించింది. ఆ తర్వాత మలయాళం కంటే ఇతర భాషల్లోనే ఎక్కువగా యాక్టివ్‌గా మారింది. ముఖ్యంగా తెలుగు, తమిళ చిత్రాల్లో ఆమె నటనకు మంచి ప్రశంసలు దక్కాయి.


