- Home
- Entertainment
- TV
- Gunde Ninda Gudi Gantalu : రోహిణీని అసహ్యించుకున్న మనోజ్, ప్రభావతికి ప్రేమ జంట చిక్కులు..
Gunde Ninda Gudi Gantalu : రోహిణీని అసహ్యించుకున్న మనోజ్, ప్రభావతికి ప్రేమ జంట చిక్కులు..
Gunde Ninda Gudi Gantalu: చింటూ తల్లి గురించి నిజం తెలుసుకున్న బాలు, మీనా.. ఆ బాబుని దత్తత తీసుకోవాలని అనుకుంటారు. అదే విషయంలో దేవుడి నిర్ణయం ఏంటో తెలుసుకోవడానికి గుడికి వెళతారు. మరి నేటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో టీవీ కంటే ముందుగా మీకోసం...

గుండె నిండా గుడి గంటలు..
బాలు, మీనా ఆ బాబుని దత్తత తీసుకోవాలో వద్దో.. చీటీల మీద రాసి.. గుడిలో అమ్మవారి పాదాల దగ్గర ఉంచుతారు. అయితే.. ‘ మా నాన్న ఏదైనా మంచి నిర్ణయం తీసుకునేటప్పుడు దేని గురించీ ఆలోచించకూడదు తెలుసా?’ అని బాలు అంటే.. ‘ ఇది మన జీవితంలో తీసుకునే అతి పెద్ద నిర్ణయం.. అత్తయ్య కన్న కొడుకునే ప్రేమగా చూడలేదు. ఆ కొడుకు పెంచుకున్న వాడిని ప్రేమగా చూస్తారు అనేది కల్ల. పైగా ఇది చింటూ భవిష్యత్తుకి సంబంధించిన విషయం తేలికగా తీసుకోకూడదు. ఆ దేవుడి సంకల్పం ఎలా ఉందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. మనస్ఫూర్తిగా దండం పెట్టుకుందాం’ అని మీనా చెబుతుంది. తర్వాత చీటీలు తీస్తారు. కానీ, అందులో వద్దు అని వస్తుంది. అది చూసి మీనా షాక్ అవుతుంది. ‘ మనం చింటూని దత్తత తీసుకోవడం ఆ దేవుడికి ఇష్టం లేదు’ అని మీనా చెబుతుంది. ‘ మనం చేసే మంచి పనిని ఆ దేవుడు ఎందుకు వద్దు అంటాడు?’ అని బాలు అంటే.. ‘ మనం చేసే మంచి పని, మనకు మంచిదో కాదో దేవుడు కూడా లెక్క వేస్తాడు కదా.. దాని వల్ల రాబోయే కష్ట నష్టాలు దేవుడు ఆపాలని వద్దు అంటున్నాడేమో’ అని మీనా అంటే.. ‘ దేవుడు దిగి వచ్చి నీకు చెప్పాడా?’ అని వాదిస్తాడు. మీనా చెప్పిన విషయాన్ని బాలు పట్టించుకోకుండా.. చింటూని కచ్చితంగా దత్తత తీసుకోవాల్సిందే అని పట్టుపడతాడు. ఇద్దరూ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ఇంటికి వెళ్లిపోతారు.
ప్రభావతి కొంప ముంచనున్న ప్రేమ జంట..
ఇక.. ప్రభావతి డ్యాన్స్ క్లాస్ కి పిల్లలు రావడం మొదలుపెడతారు. ఫ్రీ క్లాసులు అనే సరికి పిల్లలు రావడంతో ప్రభావతి సంబరపడుతుంది. తన స్నేహితురాలు కామాక్షితో తన సంతోషాన్ని పంచుకుంటుంది. ఇద్దరూ కలిసి కాసేపు వాదించుకుంటారు. ఆ డ్యాన్స్ క్లాస్ కి ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయిని అబ్బాయిలకు దూరంగా ఉండమని వాళ్ల నాన్న వార్నింగ్ ఇచ్చి వెళతాడు. ఆ అమ్మాయి వెనకే ఓ అబ్బాయి కూడా అదే క్లాస్ కి వస్తాడు. వాళ్లిద్దరూ కలిసి ప్రభావతి కొంప ముంచేలా కనపడుతున్నారు. ఇక.. ప్రభావతి డ్యాన్స్ నేర్పించడం మొదలుపెడుతుంది. కాసేపు డ్యాన్స్ చెప్పి ప్రభావతి అలసిపోతుంది. ఇక.. డ్యాన్స్ క్లాస్ కి వచ్చిన అమ్మాయి, అబ్బాయి.. ఆల్రెడీ ప్రేమలో ఉన్నవారే. వారిద్దరూ కలిసి రొమాన్స్ మొదలుపెడతారు. ఇది బయటపడితే.. ప్రభావతి డ్యాన్స్ క్లాస్ మూత పడే అవకాశం క్లియర్ గా కనపడుతోంది.
రవి, శ్రుతి ప్యాచప్...
ఇక ఇంట్లో రవి.. శ్రుతిని డిన్నర్ కి బయటకు తీసుకువెళతాను అంటాడు. అయితే.. ఇద్దరి మధ్య గొడవ జరిగినందుకు బయటకు తీసుకొని వెళ్తాను అంటున్నావా అని శ్రుతి అడుగుతుంది. తాను చేసిన పనికి రవి క్షమాపణలు చెప్పి.. మనం బయటకు వెళ్లి చాలా రోజులు అయ్యింది కదా.. నీతో టైమ్ గడపాలని ఉంది అని రవి చెబుతాడు. కానీ.. శ్రుతి మాత్రం బయటకు రాను అని.. నువ్వు పలిస్తే రావాలా అని అంటుంది. రవి ఎక్కువ సేపు బ్రతిమిలాడితే అప్పుడు ఒప్పుకుంటుంది. ముందు షాపింగ్ తర్వాత సినిమా, ఆ తర్వాత డిన్నర్ చేద్దాం అని చెబుతుంది. ఖర్చు ఎక్కువ అవుతుంది అని రవి టెన్షన్ పడితే.. ఆ ఖర్ఛంతా తానే పెట్టుకుంటాను అని శ్రుతి అంటుంది.చివరకు ఇద్దరూ కాంప్రమైజ్ అయ్యి.. బయటకు వెళ్లడానికి రెడీ అవుతారు.
రోహిణీ ని అసహ్యించుకున్న మనోజ్, మీనా..
ఇక.. బాలు ఇంట్లో టెన్షన్ గా అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. ఎందుకు అలా తిరుగుతున్నారు అని మీనా అడిగితే... ఇంట్లో దత్తత విషయం చెప్పేద్దాం అనుకుంటున్నాను అని బాలు అంటాడు. ‘ దేవుడే వద్దు అన్నాడు. ఇక అత్తయ్య అయితే.. అస్సలు ఊరుకోదు’ అని మీనా అంటుంది. అప్పుడే వీరి దగ్గరికి మనోజ్, రోహిణీ వస్తారు. రోహిణీ డల్ గా ఉండటం చూసి‘ ఏమైంది రోహిణీ..క్లైంట్ ఇంట్లో పని ఉందని వెళ్లావ్ కదా.. వచ్చిన దగ్గర నుంచి అలా ఎందుకు ఉన్నావ్’ అని మనోజ్ అడుగుతాడు. ‘ ఏమీ లేదు’ అని రోహిణీ చెబుతుంది. అప్పుడే బాలు.. ‘ మేం కూడా ఈ రోజు ఓ ఫంక్షన్ కి వెళ్లాం’ అంటే.. ‘ మిమ్మల్ని ఎవర్రా పిలిచేది? మీ తోటి ట్యాక్సీ డ్రైవరా?’ అని హేళన చేస్తాడు. దానికి బాలు‘ నిన్ను అయితే దారినపోయే కుక్క కూడా పిలవదు రా, నీ గురించి తెలిసిన వాళ్లు నువ్వు ఇంటికి వస్తే ఏం మింగి చస్తావా అని భయపడుతున్నారు’ అని కౌంటర్ వేస్తాడు.
వెంటనే మీనా కూడా అందుకుంటుంది. ‘ అంతేనా అండీ.. మొన్న రామలక్ష్మి వాళ్ల ఇంటికి పూలు ఇవ్వడానికి వెళితే.. వాళ్లు వంద రూపాయలు ఇచ్చారని నేను చిల్లర ఇస్తే.. ఇది మీ మనోజ్ గుడి ముందు అడుక్కున్న చిల్లరా? అని అడిగారండి. నాకు అయితే తల తీసేసినట్లు అయ్యింది’ అని మీనా కూడా కౌంటర్ వేస్తుంది. ఆ మాటలకు రోహిణీ, మనోజ్ షాకౌతారు. అప్పుడే అక్కడికి సత్యం వస్తాడు. రాగానే.. ఎక్కడికి వెళ్లి వచ్చారు? అని సత్యం అడుగుతాడు. ‘ చింటూ పుట్టిన రోజు నాన్న.. అక్కడికి వెళ్లి వచ్చాం’ అని బాలు చెబుతాడు. ‘ ఈ రోజైనా వాళ్ల అత్తయ్య వచ్చిందా?’ అని సత్యం అడిగితే... అక్కడ తాము తెలుసుకున్న నిజం మొత్తం బాలు, మీనా చెప్పేస్తారు. ఆ మాటలు రోహిణీని మరింత బాధ పెడతాయి.
‘ అలాంటి ఆడవాళ్లను మంచి నీళ్లు దొరకని ఎడారిలో వదిలేయాలి’ అని మనోజ్ అంటే.. ‘ నాకు ఆమె దొరకాలి.. వీధిలో నిలపెట్టి.. మా బస్తీ వాళ్లను అప్పజెప్పేదాన్ని’ అని మీనా అంటుంది. ‘ పాపం.. ఆ బాబు ని అలా చేసినందుకు అలాంటి వాడిని ఊరికే వదలకూడదు నాన్న’ అని మనోజ్ కూడా అంటాడు.చాలా దారుణంగా రోహిణీని అసహ్యించుకుంటాడు. తన భార్య అని తెలీకుండానే ద్వేషం వెల్లగక్కుతాడు. మనకు సంబంధం లేని వాళ్ల గురించి మనకు ఎందుకు అని సత్యం అక్కడితో ఆపేస్తాడు.
ఇల్లంతా ఖాళీగా ఉంది శబ్ధావతి రాలేదా అని బాలు అంటే.. డ్యాన్స్ క్లాస్ కి వెళ్లారు అని మీనా చెబుతుంది. మన నాట్యావతి అక్కడ ఉందా అని అంటుంది. ఆ లోగా ప్రభావతి వచ్చేస్తుంది. ఆమెను ఆ క్లాస్ లో చేరిన కుర్రాడు దగ్గర ఉండి మరీ దింపుతాడు. ఇక.. తన క్లాస్ లో ఆరుగురు చేరారు అని ప్రభావతి గర్వంగా చెబుతాడు. ఆ కుర్రాడు కావాలని ప్రభావతిని పొగిడేస్తూ ఉంటాడు. తర్వాత తన డ్యాన్స్ క్లాస్ గురించి ప్రభావతి గొప్పలు చెప్పుకుంటూ ఉంటుంది. బాలు మాత్రం వాళ్ల అమ్మ మీద కౌంటర్లు వేస్తూ ఉంటాడు. మనోజ్ కి కోపం వచ్చి.. బాలుని తిట్టేస్తే.. రవి, శ్రుతి కి కోపం వస్తుంది. రివర్స్ లో మనోజ్ ని తిట్టేస్తారు. ఇక.. మీనా కూడా కౌంటర్లు వేయడం మొదలుపెడుతుంది. మనోజ్ చేసిన దిక్కుమాలిన పనులన్నీ ఎత్తి చూపించి మరీ తిడుతుంది. రవి, శ్రుతి.. మీనా ని మెచ్చుకుంటారు. ప్రభావతి మాత్రం బాలుని తక్కువ చేసేలా మాట్లాడుతుంది. సత్యం సర్ది చెప్పడంతో అందరూ ఇంట్లోకి వెళ్లిపోతారు.అయితే, ఈ గొడవలో పడి.. దత్తత విషయం మర్చిపోయామని, తర్వాత మాట్లాడాలని బాలు, మీనా అనుకుంటారు.

