MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • TV
  • Gunde Ninda Gudi Gantalu: ప్రభావతితో మీనా ఛాలెంజ్, సంజూని వణికించిన పూలగంప

Gunde Ninda Gudi Gantalu: ప్రభావతితో మీనా ఛాలెంజ్, సంజూని వణికించిన పూలగంప

Gunde Ninda Gudi Gantalu: బాలు ఫోన్ కొట్టేయడానికి వింధ్య చాలా ప్రయత్నిస్తుంది. ఫోన్ కూడా తీసుకుంటుంది. కానీ, మీనా ఫోన్ చేయడంతో మిస్ అవుతుంది మరి, నేటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో మీ కోసం ముందుగా... 

5 Min read
Author : ramya Sridhar
Published : Feb 25 2026, 10:24 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
నారీ నారీ మధ్యలో రవి...
Image Credit : Jio Hotstar

నారీ నారీ మధ్యలో రవి...

రవి, శ్రుతి సరదాగా బండి మీద వెళ్తుంటే.. మధ్యలో నీతూ వచ్చి దూరుతుంది. చివర కూర్చోవాలంటే భయం అని చెప్పి.. రవి, శ్రుతికి మధ్యలో దూరి కూర్చొంటుంది. అది చూసి శ్రుతికి విపరీతంగా కోపం వస్తుంది. కానీ.. రవి ఏం చేయలేక ఊరుకుంటాడు. మధ్యలో నీతూ రవిని పట్టుకున్న ప్రతిసారీ.. శ్రుతికి విపరీతమైన కోపం వస్తుంది.సందు దొరికినప్పుడల్లా గిచ్చుతుంది. ఇక.. వీరు వెళ్తూ ఉండగా.. ట్రాఫిక్ పోలీసులు మధ్యలో ఉంటారు. ట్రిపుల్ రైడింగ్ అని బండి ఆపేస్తారు. అంతేకాదు రూ.500 ఫైన్ కట్టమని అంటారు. అయితే.. తన దగ్గర క్యాష్ లేదు అని రవి, నీతూ తప్పించుకుంటే.. శ్రుతి కట్టక తప్పదు. రవితో కలిసి వెళ్లాంటే.. మళ్లీ ట్రిపుల్ రైడింగ్ వెళ్లాలని.. నీతూ వెళ్లి ఏకంగా ట్రాఫిక్ పోలీసు బైక్ ఎక్కుతుంది. శ్రుతి మాత్రం... ఇంటికి వెళ్లాక నీ సంగతి చెబుతాను అని రవికి వార్నింగ్ ఇస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
అత్తా- కోడళ్ల ఛాలెంజ్...
Image Credit : Jio Hotstar

అత్తా- కోడళ్ల ఛాలెంజ్...

సీన్ కట్ చేస్తే ప్రభావతి ఇంట్లో కూర్చొని ఆపసోపాలు పడుతూ ఉంటుంది. ఏమైంది? అని సత్యం అడిగితే.. ఇంట్లో ముగ్గురు కొడుకులు ఉన్నారు.. ఒక్కరైనా నన్ను డ్యాన్స్ క్లాస్ దగ్గర దింపుతున్నారా? ఒక్కరైనా తిరిగి ఇంటికి తీసుకువస్తున్నారా? నేనే నడుచుకుంటూ వెళ్లి వస్తున్నాను.. అందుకే అలసిపోయాను అని చెబుతుంది. అప్పుడే బాలు, మీనా వచ్చి.. ఏమైందని అడుగుతారు. కాళ్లు నొప్పులు అని ప్రభావతి అంటే.. నొక్కనా అత్తయ్య అని మీనా ప్రేమగా మాట్లాడుతుంది. అయితే..పీక నొక్కుతావా అని ప్రభావతి వెటకారంగా మాట్లాడుతుంది. అంతే.. ఇక బాలు రెచ్చిపోతాడు. అయితే... ప్రభావతి తిక్క కుదర్చడానికి మా అమ్మ వస్తుందని సత్యం చెబుతాడు. ఆవిడ ఎందుకు అని ప్రభావతి అనగానే.. సత్యం కోపంతో ఊగిపోతాడు. దీంతో.. దెబ్బకు ప్రభావతి నోరు మూస్తుంది. అంతేకాదు.. సుశీలమ్మ ఇంట్లో..సంతాన హోమం చేయించాలని అనుకుంటుందని చెబుతాడు.

అప్పుడే మనోజ్, రోహిణీ వస్తే.. ఈ హోమం గురించి సత్యం వాళ్లకు కూడా చెబుతాడు. మనోజ్, రోహిణీలకు ముందు పిల్లలు పుట్టాలని.. వాళ్లే హోమంలో కూర్చోవాలని ప్రభావతి పట్టుపడుతుంది. అది విన్న సత్యం కోప్పడతాడు. వాడు ఒక్కడే నీ కొడుకా? వీళ్లు నీ పిల్లలు కాదా? అని సీరియస్ అయితే.. దానిని కూడా బాలు కామెడీ చేస్తాడు. ‘ మా నాన్నకు సెకండ్ సెటప్ ఉందా? మేం నీ పిల్లలం కాదా? సవతి పిల్లలమా? చెప్పమ్మా చెప్పు. ఒరిజినల్ అమ్మ ఎక్కడుందో చెబితే.. అక్కడికి వెళ్లి మా అమ్మను తెచ్చుకొని మనోజ్, ప్రభావతిని వెళ్లగొడతాను ’ అని అంటాడు. ‘ఇదంతా ఏమీ వద్దు.. అందరు జంటలు కూర్చొందురు ’ అని ప్రభావతి ఒప్పుకుంటుంది. తర్వాత.. మౌనికను ఇంటికి ఎవరు పిలవాలి అనే చర్చ మొదలౌతుంది. ప్రభావతి తాను పిలిస్తే.. అల్లుడు గారు ఒప్పుకుంటారు అని బిల్డప్ ఇస్తుంది. ఫోన్ చేస్తే.. సంజూ పక్కనే ఉన్నాడు అని మౌనిక లిఫ్ట్ చేయదు. దీంతో... మళ్లీ ఫోన్ చేస్తుంది. కానీ.. సంజూ ప్రభావతి పరువు తీసేలా మాట్లాడతాడు.అది విని.. బాలు, మీనా నవ్వుకుంటారు. తర్వాత.. ఇంట్లో బొమ్మల కొలువు పెడుతున్నామని, హోమం చేయిస్తున్నామని మౌనికని తీసుకొని రమ్మని పిలుస్తుంది. కానీ, సంజూ నేను రాను అంటాడు. ‘ మీ ఇంటికి వస్తే ఎలాంటి మర్యాద చేస్తారో నాకు బాగా తెలుసు. మీ కొడుకు ఏం చేస్తాడో నాకు తెలుసు.. మేం రాము’ అని ఫోన్ పెట్టేస్తాడు.

బాలు కారణంగానే అల్లుడుగారు రాను అంటున్నారు అని.. ప్రభావతి ఫీల్ అవుతుంది. అయితే.. మౌనిక, సంజూలు ఈ హోమానికి తీసుకువచ్చే బాధ్యత నాది అంటూ.. మీనా ముందుకు వస్తుంది. నేను వెళ్లి పిలుస్తాను అని చెబుతుంది. దమ్ముంటే.. వాళ్లను తీసుకువస్తే.. మీనా ఏది చెబితే అది చేస్తాను అని ప్రభావతి బెట్టు కడుతుంది. ఇద్దరూ ఒకరికొరు ఛాలెంజ్ చేసుకుంటారు.

Related Articles

Related image1
Gunde Ninda Gudi Gantalu: రోహిణీ పని ఔట్, బాలుని ట్రాప్ చేసిన వింధ్య, అత్తను వణికించేసిన మీనా
Related image2
Gunde Ninda Gudi Gantalu: దినేష్ వేసిన వలలో చిక్కుకున్న మనోజ్.. బాలు,మీనాలను ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మన్న ప్రభావతి
34
సంజూ ని రఫ్పాడించిన మీనా...
Image Credit : Jio Hotstar

సంజూ ని రఫ్పాడించిన మీనా...

సీన్ కట్ చేస్తే.. మౌనికతో వాళ్ల అత్త చాలా ప్రేమగా మాట్లాడుతుంది. నీకు పిల్లలు పుడితేనే నీ కాపురం బాగుంటుంది అని సర్ది చెబుతుంది. అప్పుడే అక్కడికి మీనా వస్తుంది. మీనాని చూసి.. మౌనిక ఆనందంతో వెళ్లి కౌగిలించుకుంటుంది. ఇంట్లోకి రమ్మని పిలుస్తుంది. ఇక మౌనిక, వాళ్ల అత్తకు బొట్టు పెట్టి.. ఇంట్లో హోమానికి రమ్మని పిలుస్తుంది. అప్పుడే సంజూ కిందకు వస్తూ.. మౌనిక రాదు అని అంటాడు. ‘ ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి.. ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి ఎలాంటి రాయభారాలు జరగడానికి వీళ్లేదు’ అని గట్టిగా చెబుతాడు. ‘ ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి మా ఇంటి మహాలక్ష్మీని పంపించాం.. అంతే తప్ప.. మా ఇంటి ఆడపిల్లను ఈ ఇంటికి అమ్మేయలేదు’ అని మీనా చెబుతుంది. ‘ మీ ఆడపిల్ల మెడలో నేను తాళి కట్టాను అంటే.. నాకు సర్వ అధికారాలు వచ్చాయి. నా అనుమతి లేకుండా.. ఎక్కడికి వెళ్లకూడదు.. అడిగే అర్హత మీకు లేదు’ అని సంజూ అంటాడు. సంజూ మాటలకు మీనా గట్టిగానే సమాధానం చెబుతుంది. అంతేకాదు.. బాలు పేరు చెప్పి భయపెడుతుంది. సంజూని ఒప్పించడానికి వాళ్ల అమ్మ కూడా చాలా ప్రయత్నిస్తుంది. కానీ సంజూ వినడు. మౌనికను లోపలికి వెళ్లమని నెడతాడు. అది చూసి మీనాకి విపరీతంగా కోపం వస్తుంది. పూలు అల్లిన చేతితోనే తరిమి కొడతాడు అని అంటుంది. ఒక్క ఫోన్ చేసి.. టీవీ వాళ్ల ముందు.. భార్యకు నరకం చూపిస్తున్న రాజకీయ నాయకుడి కొడుకు అని న్యూస్ వచ్చేలా చేస్తాను. మౌనికను ఏదైనా అంటే.. గృహ హింస కేసు పెడతాను అని భయపెడుతుంది. దీంతో.. మౌనికను పర్మినెంట్ గా పుట్టింట్లో పెట్టుకోమని చెబుతాడు.

‘ ఏ తప్పు చేసిందని.. పుట్టింట్లో పెట్టుకోవాలి?’ అని మీనా అడుగుతుంది. అప్పుడే.. సంజూ తండ్రి కనకరత్నం కూడా ఎంట్రీ ఇస్తాడు. మీనా ముందు కావాలని మంచి వాడిలా నటిస్తాడు. తొందరపడి వదిలేస్తే.. కేసులు చుట్టూ తిరగాల్సి వస్తుంది.. అందుకే.. కొడుకు, కోడలిని హోమానికి పంపిస్తాను అని అంటాడు. సంతోషం అని చెప్పి.. మౌనిక విషయంలో ఏదైనా తేడా జరిగితే మాత్రం.. మా ఆయన మీకు సమాధి కడతాడు అని వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్తుంది.

44
ఛాలెంజ్ గెలిచిన మీనా...
Image Credit : Jio Hotstar

ఛాలెంజ్ గెలిచిన మీనా...

ఇక.. తనతో ఛాలెంజ్ ఎలాగూ మీనా ఓడిపోతుందని.. తనతో చేయించడానికి పాత సామాన్లు, ఉతకడానికి చీరలు అన్నీ సిద్ధం చేస్తుంది. ఎలాగూ ఓడిపోతుంది కాబట్టి.. ఇంట్లో కుక్కిన పేనులా పడి ఉండాలి అని ప్రభావతి అంటుంది.‘ ఎవరిని ఎక్కడ ఉంచాలో నీకు బాగా తెలుసు అమ్మా’ అంటూ మనోజ్ ఓవర్ చేస్తాడు. దీంతో.. మనోజ్ ని లాక్కెళ్లి.. ఇంటి బయట అడుక్కోమని.. ఎవరిని ఎక్కడ ఉంచాలో నాకు కూడా తెలుసు అని బాలు అంటాడు. కాసేపటికి మీనా ఇంటికి వస్తుంది. ‘ తిట్టారా? కొట్టారా? గెంటేశారా? ఏం జరిగిందో చెప్పు’ అని ప్రభావతి అడుగుతుంది. ‘ ఈ ప్రభావతినే పూచిక పుల్లలా తీసేసిన వాళ్లు.. ఈ పూలు అమ్మే దాని మాట వింటారా? ఇక నుంచి పూలు అమ్మడం పక్కన పెట్టేసి.. ఈ పనులన్నీ చేయాలి’ అని ప్రభావతి ఆర్డర్ వేస్తుంది. ఆ మాటలు పట్టించుకోకుండా మీనా.. ‘ వ్రతంలో మీనా, సంజూ కూర్చొంటే వాళ్లకు బట్టలు పెట్టాలేమో అడగండి మామయ్య ’ అని అంటుంది. అది విని.. మౌనిక వస్తుందని సత్యం, బాలు సంతోషిస్తారు. ఇక... మీనా ఛాలెంజ్ గెలవడంతో మనోజ్, రోహిణీలు అక్కడి నుంచి జారుకుంటారు. మీనా చెప్పినట్లు వినాలి అని.. సత్యం, బాలు పట్టుపడతారు. మీకు నచ్చినట్లు.. నచ్చిన పని చెప్పమని సత్యం చెబుతాడు. ‘ నువ్వు పూలు కట్టు మీనా.. మా అమ్మ పూలు అమ్ముతుంది’ అని బాలు అంటాడు. ‘ నేను ఎలా కనపడుతున్నాను’ అని ప్రభావతి అంటే.. ‘ మరి నా భార్య ఎలా కనపడుతుంది? ఊరికే పూలు అమ్ముకునేది అని పిలుస్తున్నావ్ కదా’ అని బాలు అంటాడు.

ఇక...మీనా రేపటి కోసం లిస్ట్ రాసుకుంటూ ఉంటే.. శ్రుతి వచ్చి.. ప్రేమగా మాట్లాడుతుంది. అది కాస్త రోహిణీ కంట పడుతుంది. మీ ఇద్దరికీ గొడవ జరిగింది కదా.. మళ్లీ ఎప్పుడు రాజీ పడ్డారు? అని అడుగుతుంది. మీనా, శ్రుతి కవర్ చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ, రోహిణీ నమ్మదు. దీంతో.. శ్రుతి, మీనా రెచ్చిపోతారు. నిజంగా గొడవ పడుతున్నట్లు నటిస్తారు. దెబ్బకు రోహిణీకి భయం వేస్తుంది. వీళ్లిద్దరూ గొడవ పడుతున్నట్లు నాటకం ఆడి.. మధ్యలో మనోజ్ ని తిడతారు. మీరిద్దరూ గొడవపడి మధ్యలో మా ఆయన్ని ఎందుకు లాగుతున్నారు అని రోహిణీ సీరియస్ అవుతుంది. అప్పుడే సుశీలమ్మ వచ్చి.. ఇలా గొడవ పడుతున్నారేంటి? అని అడుగుతుంది. అది తర్వాత చెబుతాను అని బాలు అంటాడు. ఇంతలో సత్యం, ప్రభావతి వస్తారు. వాళ్ల మీద కూడా సుశీలమ్మ సీరియస్ అవుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu: నవదీప్‌కు కౌశల్ మందా కౌంటర్.. 'సభ్య సమాజానికి ఏమివ్వాలో చెప్పు' అంటూ షాకింగ్ కామెంట్స్
Recommended image2
Bigg Boss Agnipariksha 2: సృష్టితో డీమాన్ పవన్ రొమాన్స్, డేంజర్ కార్డ్ బయటకు తీసిన అభిజిత్
Recommended image3
Express Hari Marriage: హీరోయిన్‌ను పెళ్లాడబోతున్న ఎక్స్‌ప్రెస్ హరి! వైరల్ అవుతున్న వీడియోలో నిజమెంత?
Related Stories
Recommended image1
Gunde Ninda Gudi Gantalu: రోహిణీ పని ఔట్, బాలుని ట్రాప్ చేసిన వింధ్య, అత్తను వణికించేసిన మీనా
Recommended image2
Gunde Ninda Gudi Gantalu: దినేష్ వేసిన వలలో చిక్కుకున్న మనోజ్.. బాలు,మీనాలను ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మన్న ప్రభావతి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved