MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • TV
  • Gunde Ninda Gudi Gantalu:ప్రభావతితో పూలు అమ్మించిన మీనా,బొమ్మల కొలువులో రోహిణీ నెత్తిన మరో బాంబు

Gunde Ninda Gudi Gantalu:ప్రభావతితో పూలు అమ్మించిన మీనా,బొమ్మల కొలువులో రోహిణీ నెత్తిన మరో బాంబు

Gunde Ninda Gudi Gantalu: ప్రభావతితో ఛాలెంజ్ చేసి మరీ.. మౌనిక పుట్టింటికి రావడానికి సంజూ ఒప్పుకునేలా చేస్తుంది మీనా. మరి, ఛాలెంజ్ లో ఓడిపోయినందుకు ప్రభావతికి ఎలాంటి శిక్ష వేస్తారో నేటి ఎపిసోడ్ లో చూద్దాం.. 

4 Min read
Author : ramya Sridhar
Published : Feb 26 2026, 09:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Gunde Ninda Gudi Gantalu
Image Credit : Jio Hotstar

Gunde Ninda Gudi Gantalu

ఇంట్లో బొమ్మల కొలువు పెట్టాలని మీనా కోరుకుంటుంది. కాబట్టి..దాని కోసం ఊరు నుంచి సుశీలమ్మ వస్తుంది. ఇంటికి వచ్చిన సుశీలమ్మను.. బాలు, మీనా దగ్గరుండి మరీ లోపలికి తీసుకువెళతారు. వాళ్లు వెళ్లగానే.. ‘ ఏమండీ నిజంగానే నాతో పూలు అమ్మిస్తారా?’ అని ప్రభావతి అడుగుతుంది. ‘ ఓడిపోతే ఏదైనా చేస్తాను అని నువ్వేగా అన్నావ్.. మీనా ఓడిపోయి ఉంటే పూలు అమ్మనిచ్చేదానివా? నువ్వు ఓడిపోయావ్ కాబట్టి.. వాళ్లు ఏది చెబితే అది చేయ్యాలి’ అని సత్యం అంటాడు. ‘ నాకు ఎన్ని కష్టాలు వచ్చాయో.. ’ అంటూ ప్రభావతి ఫీలౌతూ తన గదిలోకి వెళ్లిపోతుంది.

ఇక.. తన గదిలో రవి ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. అప్పుడే శ్రుతి అక్కడికి వస్తుంది. రవిని ఇరిటేట్ చేస్తుంది. తర్వాత... ఉదయం తమ ఇద్దరి మధ్య నీతూ కూర్చుందనే కోపం రవిపై చూపిస్తుంది. ఇద్దరి మధ్యలో బొమ్మను పెట్టేస్తుంది. ఆ బొమ్మ పేరు నీతూ అని.. ఆ బొమ్మను ఇష్టం వచ్చినట్లు కొడుతుంది. శ్రుతి కోపం పోగొట్టడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు.శ్రుతి పట్టించుకోవడం లేదని.. ఆ బొమ్మతో ప్రేమగా మాట్లాడతాడు. అంతే.. శ్రుతికి కోపం వచ్చి.. ఆ బొమ్మ విసిరికొడుతుంది. వెంటనే రవి సారీ చెబుతాడు. ఇద్దరూ కలిసిపోతారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సంజూ తో కలిసిపొమ్మని మీనా రిక్వెస్ట్..
Image Credit : Jio Hotstar

సంజూ తో కలిసిపొమ్మని మీనా రిక్వెస్ట్..

ఇక.. సుశీలమ్మతో బాలు, మీనా ముచ్చట్లు పెడతారు. శ్రుతి, మీనా ఇద్దరూ కలిసి గొడవపడుతున్నట్లు నాటకం ఆడుతున్నామని చెబుతారు. అది విని సుశీలమ్మ మురిసిపోతుంది. ఎంత తెలివైనదో అని మీనాని మెచ్చుకుంటుంది. తర్వాత సంజూని ఎలా ఒప్పించావ్ అని బాలు అడుగుతాడు. ‘ వామ్మో.. ఇప్పుడు అక్కడ జరిగిన గొడవ గురించి చెబితే ఈయనకు కోపం వస్తుంది.. ( మనసులో అనుకొని.. బయటకు మాత్రం.. ) మనకు ఏ పని కావాలన్నా.. అడిగే విధంగా అడిగితే జరుగుతుంది.. సంజూని కూడా అలానే అడిగాను. మౌనిక వాళ్ల అత్తమామలు అర్థం చేసుకున్నారు.. పంపిస్తాను అన్నారు’ అని చెబుతుంది. ‘అంతేనా?’ అని బాలు అంటే.. ‘ అంతేనండి.. మీరు కూడా ఒకసారి ఆలోచించండి.. ప్రతిసారీ అతనితో గొడవ పడుతుంటే.. మౌనిక ఎలా సంతోషంగా ఉండగలదు..?’ అని అంటుంది. ‘ మీనా.. నా గురించి తెలిసి కూడా నువ్వు నాకు చెబుతున్నావా? నాతో ఎవరైనా మంచిగా ఉంటే నేను చంద్రుడిలా వెన్నెల కురిపిస్తా.. తేడాగా ఉంటే.. నాకు మండుతుంది.. సూర్యుడిలా కాల్చేస్తా’ అని బాలు అంటాడు. ‘ అక్కడ మీ చెల్లెలు ఉందండి.. అతను ఎలా ఉన్నా మీరు చంద్రుడిలా చల్లని వెన్నెల కురిపించాల్సిందే.. రేపు వాళ్లు వస్తున్నారు కదా.. మీరు అతనితో చక్కగా కలిసిపోయి.. అతను కలిసినా కలవకపోయినా.. బుద్ధిగా అతనిని మీరే బాగా చూసుకోవాలి. అతనికి మిమ్మల్ని చూస్తే కోపం.. మీకు అతన్ని చూస్తే కోపం.. ఇదిలాగే ఉంటే.. ఎప్పటికీ తెగదు. రేపు అతను వచ్చినప్పుడు ప్రేమగా మాట్లాడండి.. మిమ్మల్ని అర్థం చేసుకుంటే.. అతను కూడా మారతాడు’ అని మీనా చెబుతుంది. బాలు వినకపోవడంతో.. సుశీలమ్మ కూడా సర్ది చెబుతుంది. ‘ నీ చెల్లెలు సుఖంగా ఉండాలంటే.. మీనా చెప్పినట్లు విను. అతని దగ్గరకు వెళ్లి క్షమించమని అడుగు’ అని సుశీలమ్మ చెబుతుంది. మీ చెల్లి కోసం ఈ ఒక్క మొట్టు దిగలేరా అని మీనా కూడా అడగడంతో.. బాలు సరే అని ఒప్పుకుంటాడు.

35
పూలు అమ్మిన ప్రభావతి...
Image Credit : Jio Hotstar

పూలు అమ్మిన ప్రభావతి...

ఇక.. తెల్లారేసరికి.. ప్రభావతిని కారులో బాలు, సత్యం బయటకు తీసుకువెళతారు. ప్రభావతి పూల కొట్టు అని పెట్టి.. బలవంతంగా పూలు అమ్మిస్తారు. పూలు అమ్మడం ఇష్టంలేక.. ప్రభావతి మారం చేస్తూ ఉంటుంది. బాలు, సత్యం మాత్రం వినరు. వీళ్లు కావాలని ఏడిపిస్తూ ఉంటే.. బాలు ఏడిపించడం చాలా ఫన్నీగా ఉంటుంది. ఇక.. తప్పక... పూలమ్మా పూలు అని ప్రభావతి అరుస్తుంది.ఎలా అరవాలో మీనా అరిసి చూపిస్తుంది. ప్రభావతి అలానే చేస్తుంది. కొందరు పూలు కొనుక్కోవడానికి వస్తారు.వాళ్లు వచ్చి.. ప్రభావతిని పూలమ్మా అని పిలవడం ఫన్నీగా ఉంటుంది. ఇక తప్పక.. వాళ్లకి పూలు కొలిచి మరీ ఇస్తుంది. అది చూసి బాలు, మీనా, సత్యం బాగా నవ్వుకుంటారు. అయితే.. ఇదంతా ప్రభావతి కల కావడం గమనార్హం. నిజంగానే నాతో పూలు అమ్మిస్తారా అని భయపడుతూనే మళ్లీ పడుకుంటుంది.

45
బొమ్మల కొలువుకు బాలు ఫ్యామిలీ..
Image Credit : Jio Hotstar

బొమ్మల కొలువుకు బాలు ఫ్యామిలీ..

తెల్లారేసరికి.. బొమ్మల కొలువు దగ్గరకు వెళ్లడానికి అందరూ రెడీ అవుతారు.మీనా పూల గంప తీసుకొని వస్తుంది.. ఎందుకు ఈ పూలు అని ప్రభావతి అంటే... ఆ పూలు నువ్వే అమ్మాలి అని అందరూ ప్రభావతికి చెబుతారు. బలవంతంగా ప్రభావతి తలమీద పూల బుట్ట పెడతారు. దానిని రవి, శ్రుతి వీడియోలు కూడా తీస్తారు. ఇంకోసారి మీనాని పూలు అమ్ముకునేదానివి అని అనను అన్నా ప్రభావతిని వదిలిపెట్టరు. తర్వాత.. ప్రభావతి తల మీద పూల బుట్ట దింపేస్తుంది. అత్తయ్యను ఏడిపించింది చాలు అని.. ఆ పూలు బొమ్మల కొలువు కోసం అని మీనా చెబుతుంది. ఆ మాట విన్నాక ప్రభావతి సంతోషిస్తుంది. మొదటిసారి.. మీనాని దేవత అని పొగుడుతుంది. ఇక.. అందరూ కలిసి బొమ్మల కొలువు పెట్టే ఇంటి దగ్గరకు వెళతారు. అక్కడ వీరి కోసం కామాక్షి అన్ని ఏర్పాట్లు చేస్తుంది.

55
రోహిణీ నెత్తిన మరో బాంబు... డాక్టర్ తో పరీక్ష
Image Credit : Jio Hotstar

రోహిణీ నెత్తిన మరో బాంబు... డాక్టర్ తో పరీక్ష

లోపలికి వెళ్లిన తర్వాత.. మీనా.. బొమ్మలను అందంగా సర్దుతూ ఉంటుంది. మీనా అడిగి మరీ.. తన తోడికోడళ్లతో ఫోటో దిగుతుంది. తర్వాత ప్రభావతి పూలు పట్టుకున్న ప్రతిసారీ బాలు ఏడిపిస్తూనే ఉంటాడు. అప్పుడే అక్కడికి మీనా తల్లి, చెల్లి కూడా వస్తారు. తర్వాత కాసేపటికే.. శ్రుతి వాళ్ల అమ్మ కూడా వస్తుంది. ఆమెను మాత్రం.. ప్రభావతి ప్రేమగా పలకరిస్తుంది. మీనా తల్లిని మాత్రం పట్టించుకోదు. ఈ బొమ్మల కొలువుకు ప్రభావతి డ్యాన్స్ స్కూల్ పిల్లలు కూడా వస్తారు. వీళ్లు ఇక్కడ ఉన్నారని తెలుసుకొని.. గుణ కూడా అదే బొమ్మల కొలువు దగ్గరకు వస్తాడు. వాళ్లతో పాటు విద్య కూడా వస్తుంది. గుణ కి ఫోన్ చేయమని విద్య చెబుతుంది. బాలు ఫోన్ లో ఉన్న వీడియో ఈ రోజు ఎలాగైనా తనకు పంపించమని గుణ అడుగుతాడు. అందుకు రోహిణీ కూడా సరే అని ఒప్పుకుంటుంది.

అదే సమయానికి బాలు తన ఫోన్ కి ఛార్జింగ్ పెడతాడు. అది చూసిన రోహిణీ, విద్య.. తెలివిగా బాలు ఫోన్ అక్కడి నుంచి తీసేస్తారు. ఆ ఫోన్ లో వీడియో వెతికి.. వాళ్ల ఫోన్ కి పంపించేలోగా... మనోజ్ వచ్చి రోహిణీని పిలుస్తాడు.యాగంలో మనమే కూర్చోవాలని రోహిణీని తీసుకొని వెళతాడు. అయితే.. రోహిణీ.. బాలు ఫోన్ తనతోనే తీసుకొని వెళ్తుంది. అప్పుడే మాటలో మాటగా.. రోహిణీని ముందు నీకు ఒకసారి కడుపు పోయింది అంటగా అని సుశీలమ్మ అడుగుతుంది. ఆ మాటకు రోహిణీ బాధపడుతుంది. అయితే.. ఈ విషయం మీనానే చెప్పిందని ప్రభావతి తిట్టడం మొదలుపెడుతుంది. అయితే.. మీనా కాదని.. ఆ విషయం చెప్పింది నేను అని సత్యం అంటాడు. దీంతో.. దెబ్బకు అందరూ నోరు మూస్తారు.‘ మొదటిసారి ఇలా జరిగింది అంటే.. రెండోసారి గర్భం నిలవడం కూడా కష్టం.. ఇలాంటి ఆలస్యం చేయకూడదు. డాక్టర్ కి చూపించాలి. నాకు తెలిసిన డాక్టర్ ఇక్కడికి వస్తోంది.. ఆమె నిన్ను చెక్ చేసి.. సమస్య ఏంటో చెబుతుంది’ అని సుశీలమ్మ అంటుంది. ఆ మాటలు విని రోహిణీ భయపడుతుంది. డాక్టర్ వచ్చి చెక్ చేస్తే.. డెలివరీ అయిన విషయం బయటపడుతుందని, ఆ డాక్టర్ కి దొరకకుండా తప్పించుకోవాలని.. రోహిణీ, విద్య మాట్లాడుకుంటూ ఉంటారు. అందరూ నన్నే టార్గెట్ చేశారు అని రోహిణీ టెన్షన్ పడుతూ ఉంటుంది.

ఈలోగా.. బాలు.. మీనాని పొగుడుతూ ఉంటాడు. తర్వాత.. తనకు ఫోన్ గుర్తుకు వచ్చి.. ఫోన్ కోసం వెతుకుతాడు. ఆ ఫోన్ కనిపించదు. మీనా ఫోన్ నుంచి కాల్ చేస్తుంది. అది చూసి రోహిణీ కట్ చేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sudheer: ఫ్రీడమ్ వచ్చేసింది అంటూ కేకలు వేసిన సుధీర్.. గుద్దితే పళ్ళు రాలిపోతాయ్, సృష్టి వైల్డ్ రియాక్షన్
Recommended image2
Krishnudu Remueration: రెండు వారాలకు కృష్ణుడు పారితోషికం ఎంతో తెలుసా? కూర్చొని లక్షలు సంపాదించాడు
Related Stories
Recommended image1
Gunde Ninda Gudi Gantalu: రోహిణీ పని ఔట్, బాలుని ట్రాప్ చేసిన వింధ్య, అత్తను వణికించేసిన మీనా
Recommended image2
Gunde Ninda Gudi Gantalu: ప్రభావతితో మీనా ఛాలెంజ్, సంజూని వణికించిన పూలగంప
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved