MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • Folk Song : ప్రేయసి మాటలే పాటగా మారితే.. మనసుదోచే ఈ మాస్ ఫోక్ వింటే ఫిదా అవ్వాల్సిందే..!

Folk Song : ప్రేయసి మాటలే పాటగా మారితే.. మనసుదోచే ఈ మాస్ ఫోక్ వింటే ఫిదా అవ్వాల్సిందే..!

Trending Folk Song : అమ్మాయి, అబ్బాయి మధ్య ప్రేమను వివరిస్తూ వందలు కాదు వేలాది సినిమా పాటలు వచ్చాయి… కానీ వాటిని తలదన్నేలా కొన్ని జానపదాలు యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి. అలాంటిదే ఈ వస్తవ పిలగా ఓ రాములయ్య సాంగ్. 

2 Min read
Author : Arun Kumar P
Published : May 14 2026, 12:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
యూట్యూబ్ లో అదరగొడుతున్న మరో ఫోక్ సాంగ్...
Image Credit : Screenshot to LS Hearts

యూట్యూబ్ లో అదరగొడుతున్న మరో ఫోక్ సాంగ్...

Folk Song : ప్రస్తుతం జానపదాలు (ఫోక్ సాంగ్స్) ట్రెండ్ నడుస్తోంది. సినిమా పాటల కంటే వీటికే ప్రజల్లో ఆదరణ పెరుగుతోంది... యూట్యూబ్ లో కోట్లాది వ్యూస్, లక్షల్లో లైక్స్, వేలల్లో కామెంట్స్ సాధిస్తున్న పాటలు అనేకం ఉన్నాయి. కొన్ని ఫోక్ సాంగ్స్ పెళ్ళిలు, శుభకార్యాలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో తప్పకుండా వినిపిస్తుంటాయి. 

అయితే ఇప్పుడు ప్రేమజంటల హృదయాలను హత్తుకునే ఓ అచ్చతెలుగు జానపదం యూట్యూబ్ ను షేక్ చేసేందుకు సిద్దమయ్యింది. ఆ పాట ఏది..? ఆ లిరిక్స్ కు అర్థమేంటి..? ఈ పాటను ఇంత అద్భుతంగా తీర్చిదిద్దింది ఎవరు..? ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
''వస్తవ పిలగా ఓ రాములయ్య'' ఫోక్ సాంగ్...
Image Credit : Screenshot to LS Hearts

''వస్తవ పిలగా ఓ రాములయ్య'' ఫోక్ సాంగ్...

జానపదాలు అంటే పల్లె ప్రజల పాటలు... కానీ ఇప్పుడు ఇవే పట్టణాల్లోనూ మారుమోగుతున్నాయి. పంక్షన్ల నుండి పబ్బుల వరకు ప్రతిచోట ఫోక్ సాంగ్స్ వినిపిస్తున్నాయి. యూట్యూబ్ లో అయితే ఫోక్ సాంగ్స్ హవా నడుస్తోంది... ఇప్పుడు 'వస్తవ పిలగా ఓ రాములయ్య'' అంటూ మరో జానపదం యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది.

ప్రేయసీ ప్రియుల మధ్య సాగే మాటలను పాటగా మలిచారు... ఓ యువతి తన ప్రియుడి కోసం ఎంతలా తపిస్తుందో రాములయ్య సాంగ్ లో చూపించారు. ‘’వస్తవ పిలగా ఓ రాములయ్య నాకు ఏమి తెస్తవో పిలగో ఓ రాములయ్య'' అంటూ సాగుతుంది. ఇలా పాటరూపంలో తన ప్రియుడి నుండి ఓ ప్రేయసి ఏం కోరుకుంటుందో చూపించారు. ఈ మాటల్లో ఎమోషన్ తో పాటు విలేజ్ వైబ్ స్పష్టంగా కనిపిస్తుంది.

హోటల్లో బాతకాని పెడుతూ ఇంటికి రాకపాయే అంటూ ఆమె బాధపడుతుంది... గుడి వెనకాలకు పోయి గుసగుస మాటలాడి అంటూ తమ సరసాలను గుర్తుచేసుకుంటుంది... అంతేకాదు మావోళ్లను ఒప్పించి మాట వినక చేసుకుంటిని అంటూ కసురుకుంటుంది... ''ఏగలేనయ్యా ఓ రాములయ్య నీ మాటలు.. వినలేనయ్యో ఓ రాములయ్య నీ మాటలు... ఉండలెనయ్యా ఓ రాములయ్య నీతోని.. వెళ్లిపోతయ్యో ఓ రాములయ్య మా ఇంటికి'' అంటుంటే ప్రియుడు ఆమెను బతిమాలుకుంటున్నట్లు ఉంటుంది. ఇలా ప్రేయసీ ప్రియుడి మధ్య అనుబంధాన్ని ఈ పాటలో అద్భుతంగా చూపించారు.

Related Articles

Related image1
srikakulam folk : మారుమూల పల్లెలో పుట్టి న్యూయార్క్ టైం స్వేర్ కు చేరిన తెలుగు జానపదం.. ఏదో తెలుసా..?
Related image2
Folk Song : 'బాయిలోనే బల్లి పలికే' సాంగ్ కి కోట్ల వ్యూస్.. మంగ్లీతోనే మాస్ స్టెప్పులు వేయించిన ఈ సింగర్ నాగవ్వ ఎవరు..?
33
రాములయ్య సాంగ్ టీమ్ ఇదే..
Image Credit : Screenshot to LS Hearts

రాములయ్య సాంగ్ టీమ్ ఇదే..

వస్తవ పిలగా ఓ రాములయ్య అంటూ సాగే ఫోక్ సాంగ్ కు మంచి ఆదరణ లభిస్తోంది... వినసొంపైన మ్యూజిక్, అమ్మాయి ప్రేమను చాటే లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి... అందుకే యూట్యూబ్ లో అప్ లోడ్ చేసిన ఏడు రోజుల్లోనే 30 వేలకు పైగా వ్యూస్ సాధించింది. ఇక లైక్, కామెంట్స్ కూడా బాగానే వస్తున్నాయి.

ఈ ఫోక్ సాంగ్ LS Hearts యూట్యూబ్ ఛానల్ లో ఉంది. దీనికి రేలారే శ్యామల లిరిక్స్ అందించారు... ఆమే పాడారు. మోహన్ మిక్కి మ్యూజిక్ అందించారు. ప్రశాంత్ కొరియోగ్రఫీలో మౌనిక డింపుల్, అజ్జు అదిరిపోయే స్టెప్పులు వేశారు. శ్రవణ్ రెడ్డి ప్రొడక్షన్ లో ఈ పాట రూపుదిద్దుకుంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వినోదం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Reshma Rathore: సినిమాలకు గుడ్‌ బై చెప్పి కోర్ట్ మెట్లు ఎక్కుతున్న టాలీవుడ్‌ హీరోయిన్‌.. డేరింగ్‌ స్టెప్‌
Recommended image2
Vijay Deverakonda: మందు, అమ్మాయి, బ్రేకప్‌ ఇప్పుడు పెళ్లి.. తన లైఫ్ సీక్రెట్స్ అన్నీ చెప్పేసిన రౌడీ బాయ్
Recommended image3
Raviteja Remuneration: ఇరుముడి మూవీకి రవితేజ పారితోషికం ఎంతో తెలుసా? చిరంజీవిని మించి.. టీమ్‌ ఫీజు వివరాలు
Related Stories
Recommended image1
srikakulam folk : మారుమూల పల్లెలో పుట్టి న్యూయార్క్ టైం స్వేర్ కు చేరిన తెలుగు జానపదం.. ఏదో తెలుసా..?
Recommended image2
Folk Song : 'బాయిలోనే బల్లి పలికే' సాంగ్ కి కోట్ల వ్యూస్.. మంగ్లీతోనే మాస్ స్టెప్పులు వేయించిన ఈ సింగర్ నాగవ్వ ఎవరు..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved