MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Kalyan Padala: తెరపైకి కళ్యాణ్‌ పడాల.. తన లవ్‌ స్టోరీనే బహిర్గతం చేయబోతున్న బిగ్‌ బాస్‌ విన్నర్‌

Kalyan Padala: తెరపైకి కళ్యాణ్‌ పడాల.. తన లవ్‌ స్టోరీనే బహిర్గతం చేయబోతున్న బిగ్‌ బాస్‌ విన్నర్‌

బిగ్‌ బాస్‌ తెలుగు 9 విన్నర్‌ కళ్యాణ్‌ పడాల తన లవ్‌ స్టోరీని బహిర్గతం చేయబోతున్నాడు. తెరపై పాట రూపంలో తన బ్రేకప్‌ లవ్‌ స్టోరీని చెప్పబోతున్నాడు. తన మనసులో బాధని వెల్లడించనున్నాడు. 

2 Min read
Author : Aithagoni Raju
Published : May 16 2026, 06:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బిగ్‌ బాస్‌ షోతో పాపులర్‌ అయిన కళ్యాణ్‌ పడాల
Image Credit : youtube/@iDreamCineStars

బిగ్‌ బాస్‌ షోతో పాపులర్‌ అయిన కళ్యాణ్‌ పడాల

కళ్యాణ్‌ పడాల గత సీజన్‌ బిగ్‌ బాస్‌ తెలుగు 9 విన్నర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. దీంతో ఒక్కసారిగా పాపులర్‌ అయిపోయాడు. బిగ్‌ బాస్‌ కోసం ఆయన ఏకంగా తన ఆర్మీ జాబ్‌నే వదులుకున్నాడు. సినిమాల్లోకి రావాలని, హీరోగా రాణించాలని చెప్పి  బిగ్‌ బాస్ షోకి వచ్చాడు. విన్నర్‌గా నిలిచాడు. అయితే షో అయిపోగానే ఆయనకు సినిమా ఆఫర్లు రాలేదు. దీంతో ఇప్పుడు నెమ్మదిగా తనని తాను నిరూపించుకునే పనిలో పడ్డాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
తెరపైకి కళ్యాణ్‌ పడాల
Image Credit : youtube/‎⁨@tharatheatre

తెరపైకి కళ్యాణ్‌ పడాల

తాజాగా కళ్యాణ్‌ పడాల తెరపై కనిపించేందుకు రెడీ అయ్యాడు. డిజిటల్‌ స్క్రీన్‌పై ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకున్నాడు. అయితే సినిమాతో కాదు, వెబ్‌ సిరీస్‌తో కాదు, పాటతో ఆయన ఎంట్రీ ఇవ్వబోతుండటం విశేషం. కళ్యాణ్‌ పడాల పాట ద్వారా స్క్రీన్‌పై కనిపించబోతున్నాడు. `నిజమే రుజువైనది` పేరుతో ఈ పాటని రూపొందించారు. ఇందులో ఆయనకు జోడీగా వియానా నటించింది. బ్రేకప్‌ లవ్‌ స్టోరీని చెప్పేలా ఈ పాట సాగుతుందని తాజాగా విడుదల చేసిన ప్రోమో తెలియజేస్తుంది.

35
కళ్యాణ్‌ పడాల రియల్‌ లవ్‌ స్టోరీ పాట రూపంలో
Image Credit : youtube/‎⁨@tharatheatre

కళ్యాణ్‌ పడాల రియల్‌ లవ్‌ స్టోరీ పాట రూపంలో

`తన కోసం ఎదురుచూసే ఆ కళ్లు.. తను నవ్వితే మురిసిపోయే ఆ మనసు, ఎన్నో మాటలు, ఎన్నో జ్ఞాపకాలు, తను తిరిగి వస్తుందనే చిన్న ఆశతో ఇంకా బ్రతికేస్తున్న క్షణాలు ప్రేమని మర్చిపోవడం కష్టం కాదు, ప్రేమతో కలిసిన అలవాట్లని మర్చిపోవడం కష్టం. అలా ఒక సైలెంట్‌ పెయిన్‌ ని మెలోడీగా మార్చి, బిగ్‌ బాస్‌ స్టేజ్‌ నుంచి ప్రతి ఇంటికి చేరిన కళ్యాణ్‌ పడాల, ఆ ఫీలింగ్స్ కి ప్రాణం పోసిన నా బ్రదర్‌, రైటర్‌, డైరెక్టర్‌ ప్రకాష్‌ రెడ్డికి, టీమ్‌ కి ధన్యవాదాలు` అని తెలిపారు నటుడు శశి కదిరి. అయితే ఈ పాటలో కళ్యాణ్‌ పడాల నిజమైన ప్రేమ ఉందా అనే అనుమానం కలుగుతుంది. ఆయన లవ్‌ స్టోరీ కూడా బ్రేకప్‌ అయ్యింది. ఆ పెయిన్‌ని ఇంకా అనుభవిస్తున్నాడు కళ్యాణ్‌. మరి దాన్నే ఇలా పాట రూపంలోకి తీసుకొచ్చాడా అనేది తెలియాల్సి ఉంది.

45
కళ్యాణ్‌ పడాల లవ్‌ స్టోరీ
Image Credit : youtube/‎⁨@tharatheatre

కళ్యాణ్‌ పడాల లవ్‌ స్టోరీ

మరి కళ్యాణ్‌ పడాల లవ్‌ స్టోరీ చూస్తే, ఆయన తన క్లాస్‌మేట్‌ని ప్రేమించాడు. తను కాదు ఆమెనే ప్రేమించింది. మొదట పెద్దగా పట్టించుకోలేదు, ఆ తర్వాత రెగ్యూలర్‌గా మాట్లాడటం వల్ల ఆ మాటలు మనసులోకి వెళ్లిపోయాయి. మొదట ఆమె ప్రపోజ్‌ చేస్తే, రిజెక్ట్ చేశాడట. తర్వాత యాక్సెప్ట్ చేశాడట. అంతలోనే ఆర్మీకి సెలక్ట్ అయ్యాడు. ట్రైనింగ్‌ కి వెళ్లాడు. కొన్ని రోజులు బాగానే లవ్ ట్రాక్‌ నడిచింది. ఆ తర్వాత ఆమె నుంచి కాల్స్ లేవట. ఏమైందో ఏమో అని ఇంటికెళ్లాడు, కాలేజీకి వెళ్లాడు, నెంబర్‌ తీసుకొని మాట్లాడాడు, కొన్ని రోజులకు కన్విన్స్ అయ్యిందట.

55
మరోకరితో వెళ్లిపోయిన కళ్యాణ్‌ లవర్‌
Image Credit : youtube/@JioHotstarTelugu

మరోకరితో వెళ్లిపోయిన కళ్యాణ్‌ లవర్‌

పేరెంట్స్ తో కూడా మాట్లాడట. మళ్లీ కొన్నాళ్లు బాగానే ఉంది. సడెన్‌గా మళ్లీ కట్‌. ఫోన్‌ నెంబర్‌ బ్లాక్‌ లిస్ట్ లో పెట్టిందట. ఏమైందని ఆరా తీస్తే మరోకరికి కమిట్‌ అయ్యిందట. తనకంటే వాడు బెటర్‌గా ఉన్నాడని చెప్పి కళ్యాణ్‌ని లైట్‌ తీసుకుందట. ఈ విషయం తెలిసి తన హార్ట్ బ్రేక్‌ అయ్యిందని చెప్పాడు కళ్యాణ్‌. అయితే ఆమెని ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాడు కళ్యాణ్‌. ఆ బాధలో ఉన్నట్టు బిగ్‌ బాస్‌ షోలో తెలిపాడు. ఇదిలా ఉంటే కళ్యాణ్‌ వెండితెరపై నటుడిగా ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నారు. దానికి ఈ పాట ఒక విజిటింగ్‌ కార్డ్ లా పనిచేస్తుందని చెప్పొచ్చు. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
బిగ్ బాస్ తెలుగు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Balakrishna: బాలకృష్ణ నుంచి శర్వానంద్ వరకు, అతి కొద్దిమందికి మాత్రమే దక్కిన అవకాశం..ఈ 5 సినిమాల్లో ఇరగదీశారు
Recommended image2
Bigg Boss Telugu 10: ఆరో వారం ఓటింగ్‌ రిజల్ట్.. ఎలిమినేట్‌ అయ్యేది ఆమెనే?
Recommended image3
Anirudh Ravichander Net Worth: కావ్య మారన్‌తో పెళ్లి వార్తల వేళ.. అనిరుధ్ ఆస్తుల విలువెంతో తెలుసా?
Related Stories
Recommended image1
Balakrishna దృష్టిలో పడితే చాలు మీ లైఫ్‌ మారిపోయినట్టే.. క్యారెక్టర్స్ చేసిన హీరో విషయంలో జరిగింది ఇదే
Recommended image2
KD Movie Review: కేడీ మూవీ రివ్యూ.. ధృవ సర్జా, సంజయ్‌ దత్‌ మూవీ ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved