- Home
- Entertainment
- Trivikram: త్రివిక్రమ్ ఫస్ట్ డైలాగ్ వెంకికే..కానీ టైటిల్స్ లో మాత్రం ఆయన పేరు లేదు..మరి క్రెడిట్స్ ఎవరికిచ్చారు?
Trivikram: త్రివిక్రమ్ ఫస్ట్ డైలాగ్ వెంకికే..కానీ టైటిల్స్ లో మాత్రం ఆయన పేరు లేదు..మరి క్రెడిట్స్ ఎవరికిచ్చారు?
Trivikram: వెంకటేష్, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ఫస్ట్ సినిమా ఆదర్శ కుటుంబం. ఆ సినిమాలోని నారాయణమ్మ సాంగ్ లాంచ్ చేశారు. అయితే ఈ ఇవెంట్ లో త్రివిక్రమ్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సోషల్ మీడియాలో ఆ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

త్రివిక్రమ్ ఫస్ట్ డైలాగ్ వెంకికే
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, వెంకటేష్ కాంబినేషన్ లో వస్తున్న తొలి చిత్రం ఆదర్శ కుటుంబం. ఈ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి నారాయణమ్మ సాంగ్ ను లాంచ్ చేశారు. లాంచింగ్ ఈవెంట్ లో త్రివిక్రమ్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
త్రివిక్రమ్ రచయితగా ఎంట్రీ ఇచ్చిన సినిమా ‘స్వయంవరం’ అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ కాదట.తాను రాసిన తొలి డైలాగ్ వెంకటేశ్ నటించిన ‘పవిత్ర బంధం’ సినిమా కోసం అని చెప్పారు.
వెంకటేష్ తో మొదలైన సినీ ప్రయాణం
ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో తనకు ఎంతో ఇష్టమైన హీరో వెంకటేశ్ అని చెప్పిన త్రివిక్రమ్.. ఆయన కోసం ‘పవిత్ర బంధం’ చిత్రంలో తన తొలి డైలాగ్ రాశానని గుర్తు చేసుకున్నారు. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 1996లో విడుదలైంది. ఆ సమయంలో వెంకటేశ్‌కు త్రివిక్రమ్ ఎవరో తెలియకపోయినా.. ఆయన రాసిన డైలాగ్స్ నచ్చి దర్శకుడు ముత్యాల సుబ్బయ్య దగ్గర త్రివిక్రమ్ గురించి ఆరా తీశారని ఆయన చెప్పారు.
ఆ తర్వాత వెంకటేశ్‌తోనే ‘పెళ్లి చేసుకుందాం’ సినిమాకు కూడా త్రివిక్రమ్ పనిచేశారు. ఈ సినిమా కూడా ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలోనే 1997లో విడుదలైంది. ఈ సందర్భంగా తన సినీ ప్రయాణం వెంకటేశ్‌తోనే మొదలైందని త్రివిక్రమ్ చెప్పుకొచ్చారు.
మరి టైటిల్స్‌లో త్రివిక్రమ్ పేరు ఎందుకు లేదు?
ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం. త్రివిక్రమ్ స్వయంగా ఈ రెండు సినిమాలకు తాను డైలాగ్స్ రాసినట్లు చెప్పినప్పటికీ.. అందుబాటులో ఉన్న సినిమా క్రెడిట్స్‌లో ‘పవిత్ర బంధం’, ‘పెళ్లి చేసుకుందాం’ రెండు సినిమాల డైలాగ్ రైటర్‌గా పోసాని కృష్ణమురళి పేరు కనిపిస్తోంది. ‘పవిత్ర బంధం’ క్రెడిట్స్‌లో డైలాగ్స్‌ను పోసాని కృష్ణమురళి రాసినట్లు ఉంది.
మరి పోసాని పేరు ఎందుకు?
అలాగే 1997లో వచ్చిన ‘పెళ్లి చేసుకుందాం’ చిత్రానికి కూడా డైలాగ్ రైటర్‌గా పోసాని కృష్ణమురళి పేరే IMDb, ఇతర సినిమా డేటాబేస్‌లలో ఉంది. కథ భూపతి రాజా, స్క్రీన్‌ప్లే ముత్యాల సుబ్బయ్య, డైలాగ్స్ పోసాని కృష్ణమురళిగా క్రెడిట్స్ నమోదయ్యాయి. అయితే తాజాగా త్రివిక్రమ్ చెప్పిన వివరాలు ఆయన తొలి డైలాగ్ రైటింగ్ అనుభవం గురించి. అధికారిక టైటిల్ క్రెడిట్ ఎవరికి దక్కిందనే విషయం మాత్రం అందుబాటులో ఉన్న క్రెడిట్స్‌లో వేరుగా కనిపిస్తోంది. అందుకే ‘పవిత్ర బంధం’, ‘పెళ్లి చేసుకుందాం’ సినిమాల విషయంలో త్రివిక్రమ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.
త్రివిక్రమ్ రచయితగా తెరంగేట్రం చేసిన సినిమాగా ‘స్వయంవరం’నే పేర్కొంటారు. 1999లో వచ్చిన ఈ సినిమా ఆయనకు అధికారికంగా స్క్రీన్‌రైటర్‌గా గుర్తింపు తెచ్చిన తొలి చిత్రంగా చెబుతారు.

