MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Thudakkam: సైకోని ఒక ఆట ఆడుకున్న మోహన్ లాల్ కూతురు, ప్లాన్ చేసి మరీ కొట్టింది.. ఓటీటీలో దుమ్ములేపుతున్న మూవీ

Thudakkam: సైకోని ఒక ఆట ఆడుకున్న మోహన్ లాల్ కూతురు, ప్లాన్ చేసి మరీ కొట్టింది.. ఓటీటీలో దుమ్ములేపుతున్న మూవీ

సూపర్ స్టార్ మోహన్ లాల్ కుమార్తె విస్మయ మోహన్ లాల్ నటించిన తొలి చిత్రం ఓటీటీలో దుమ్ములేపుతోంది. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన తుడక్కం సినిమాని ఓటీటీలో ఎక్కడ చూడాలి, సినిమా విశేషాలు లాంటి వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.

2 Min read
Author : Tirumala Dornala
Published : Sep 28 2026, 04:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Thudakkam
Image Credit : Asianet News

Thudakkam

మలయాళీ సినిమాలకు ఓటీటీలో ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. మలయాళీ ఇండస్ట్రీ నుంచి థ్రిల్లర్ మూవీ రిలీజ్ అయితే చాలు.. ఆడియన్స్ మొత్తం ఎగబడి చూస్తున్నారు. దీనితో మలయాళీ సినిమాలు ఓటీటీలో ఎక్కువగా డబ్బింగ్ అవుతున్నాయి. ప్రస్తుతం ఓటీటీలో ఒక క్రేజీ మూవీ దుమ్ము దులుపుతోంది. ఆ సినిమా పేరు 'తుడక్కం'. ఇది సూపర్ స్టార్ మోహన్ లాల్ కుమార్తె విస్మయ మోహన్ లాల్ నటించిన తొలి చిత్రం. జుడే అంథోని జోసెఫ్ ఈ చిత్రానికి దర్శకుడు. మలయాళీ నటుడు సాయి కుమార్, బాబీ కురియన్, మనోజ్ జయన్ కీలక పాత్రల్లో నటించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మోహన్ లాల్ కూతురి తొలి సినిమా
Image Credit : instagram

మోహన్ లాల్ కూతురి తొలి సినిమా

ఈ మూవీలో సైకోగా, కాంట్రాక్ట్ కిల్లర్ గా యువ నటుడు ఆశిష్ జో ఆంటోని నటించారు. సైకో పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. థియేటర్స్ లో ఈ చిత్రం మంచి విజయం సాధించింది. తొలి చిత్రం అయినప్పటికీ ప్రధాన పాత్రలో మోహన్ లాల్ కూతురు విస్మయ అద్భుతంగా నటించింది. తొలి సినిమా అయినప్పటికీ ఎక్కడా తడబాటు కనిపించలేదు. ఓటీటీలో ఈ మూవీకి జనాలు నీరాజనాలు పడుతున్నారు.

35
కథ ఏంటంటే
Image Credit : Aashirvad Cinemas

కథ ఏంటంటే

కథ విషయానికి వస్తే.. మీనూ( విస్మయ మోహన్ లాల్) అందరికీ సాయం చేయాలనుకునే మహిళ. సాటివారు ఆపదలో ఉంటే వెంటనే చేతనైన సాయం చేస్తుంది. వాళ్లకు అండగా నిలబడడం కోసం రిస్క్ కూడా చేస్తుంది. ఆమె తండ్రి బాల చంద్రన్( సాయి కుమార్) విఆర్వోగా పనిచేస్తుంటారు. మీనూ తల్లి చిన్నతనంలోనే చనిపోయినా అన్నీ తానై బాల చంద్రన్ కూతుర్ని పెంచుతాడు. తండ్రీ కూతుళ్ళ మధ్య ఎంతో ప్రేమ ఉంటుంది. అతడు విఆర్వో కావడంతో ఓ స్థలానికి సంబంధించిన అనుమతులు ఇవ్వలేదని అతడికి శత్రువులు ఏర్పడతారు.

45
కూతురి మిస్సింగ్, ఇన్వెస్టిగేషన్
Image Credit : Aashirvad Cinemas

కూతురి మిస్సింగ్, ఇన్వెస్టిగేషన్

ఇంతలో మీనూ ఒక ఎగ్జాన్ రాసి టౌన్ నుంచి ఇంటికి బయలుదేరుతుంది. మధ్యలో చిన్న సమస్య వచ్చిందని ఇంటికి ఆలస్యంగా వస్తానని తండ్రికి చెబుతుంది. కానీ ఎంత సమయం అయినా మీనూ ఇంటికి రాదు. ఆమె ఫోన్ కి కూడా అందుబాటులో ఉండదు. దీనితో బాల చంద్రన్ పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. పోలీసులు ఎంక్వైరీ ప్రారంభించి ఆమె మిస్ అయింది అని నిర్ధారణకు వస్తారు. మీనూ ఆచూకీ కోసం పోలీసులు లోతుగా ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తారు. కొన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి. ఆ తర్వాత ఏం జరిగింది ? మీనూ ఆచూకీ దొరికిందా ? సైకో కిల్లర్ కి మీనూకి మధ్య ఏం జరిగింది ? అనే విషయాలు సినిమా చూసే తెలుసుకోవాలి.

55
చక్కటి సందేశం
Image Credit : X

చక్కటి సందేశం

అమ్మాయిలు ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోగలగాలి అనే సందేశంతో ఈ చిత్రం రూపొందించబడింది. దర్శకుడు ఈ అంశానికి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, సైకో విలన్ పాత్ర జోడించి ఆసక్తి పెంచేశారు. మీనూ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ గా అదరగొట్టింది. ఆమెకి, సైకో విలన్ కి మధ్య శత్రుత్వం ఏర్పడి సన్నివేశాలు చాలా బావుంటాయి. సైకోని రెచ్చగొట్టి ప్లాన్ చేసి మరీ దెబ్బ కొట్టడం సినిమాకే హైలైట్. మోహన్ లాల్ కామియో రోల్ ఆకట్టుకునే విధంగా ఉంది. జియో హాట్ స్టార్ లో ఈ మూవీ తెలుగులో అందుబాటులో ఉంది. ఫ్యామిలీ మొత్తం ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడొచ్చు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Venkatesh Remuneration: ఆదర్శ కుటుంబం మూవీకి వెంకటేష్‌ ఊహించని రెమ్యూనరేషన్‌.. ఏకంగా 3 రెట్లు ఎక్కువ
Recommended image2
Sreeleela: దళపతి విజయ్, సల్మాన్ ఖాన్‌లను సైడ్ చేసిన శ్రీలీల, ఇన్స్టాగ్రామ్ లో న్యూ రికార్డ్
Recommended image3
StarHero Childhood Photo: 3 బ్లాక్‌బస్టర్లు, 6 సూపర్ హిట్లు, 4వేల కోట్ల సినిమా చేస్తోన్న ఈ బుడ్డోడు ఎవరో తెలుసా?
Related Stories
Recommended image1
Roja: 11 ఏళ్ళు తెలుగు నటిని ప్రేమించిన డైరెక్టర్ కి జయలలిత, వాణిశ్రీ వార్నింగ్.. ఏంటి ఈ బెదిరింపులు అంటూ
Recommended image2
Chiranjeevi: 'బాస్ తొక్కేశాడు' చిరంజీవి వరకు వెళ్లిందా..చేతికి మట్టంటకుండా సోషల్ మీడియాని కుదిపేసిన బాస్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved