MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • OG Singer: ఓజీ ఫైర్‌ స్ట్రోమ్‌ సింగర్‌ కొత్త పాట చూశారా?.. ఊపేస్తున్న `ఓఎంజీ` సాంగ్‌

OG Singer: ఓజీ ఫైర్‌ స్ట్రోమ్‌ సింగర్‌ కొత్త పాట చూశారా?.. ఊపేస్తున్న `ఓఎంజీ` సాంగ్‌

OG Singer: పవన్‌ కళ్యాణ్‌ ఓజీ మూవీలో ఫైర్‌ స్ట్రోమ్‌ పాట ఎంత పాపులర్‌ అయ్యిందో తెలిసిందే. ఆ పాటని పాడిన రాజకుమారి ఇప్పుడు మ్యూజిక్‌ డైరెక్టర్‌గా మారారు. ఆమె పాడిన పాట ట్రెండ్‌ అవుతోంది.

2 Min read
Author : Aithagoni Raju
Published : Sep 28 2026, 04:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
12
మ్యూజిక్‌ డైరెక్టర్‌గా మారిన ఓజీ సింగర్‌
Image Credit : Asianet News

మ్యూజిక్‌ డైరెక్టర్‌గా మారిన ఓజీ సింగర్‌

పవన్‌ కళ్యాణ్‌ హీరోగా వచ్చిన బ్లాక్‌ బస్టర్‌ మూవీ `ఓజీ`లో `ఫైర్‌ స్ట్రోమ్‌` పాట విశేష ఆదరణ పొందింది. మూవీని ఆడియెన్స్ లోకి తీసుకెళ్లడంలో ముఖ్య పాత్ర పోషించింది. ఈ పాటతోనే మూవీకి భారీ హైజ్‌ కూడా వచ్చింది. ఇందులో పవన్‌ కళ్యాణ్‌ రేంజ్‌ని ఆవిష్కరించిందని చెప్పొచ్చు. ఈ పాటతో పాపులర్‌ అయ్యింది. అమెరికన్‌ ర్యాపర్‌, సింగర్‌ రాజకుమారి. ఆమె తెలుగు మూలాలు ఉన్న అమెరికన్‌ ర్యాపర్‌ కావడం విశేషం. ఇప్పుడు మరో పాట పడింది. `ఇంప్యూర్‌` సినిమాలో ఆమె పాడిన పాట ఇప్పుడు ఊపేస్తోంది. ఆ వివరాలు చూస్తే,

ఇంప్యూర్‌ మూవీతో నటిగా, నిర్మాతగా తెలుగమ్మాయి 

అమెరికాలో స్థిరపడిన తెలుగు అమ్మాయి వారాహి మల్లిపాముల విదేశాలు వెళ్ళినా సరే మనసంతా ఇండియాపై, సినిమాపై ఉంది. సినిమాలపై ఇష్టంతో రచయితగా, నటిగా, నిర్మాతగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెడుతున్నారు. తల్లి శ్రీదేవి మల్లిపాములతో కలిసి వారాహి నిర్మించిన ఇండియన్ ఇంటర్నేషనల్ సినిమా 'ఇంప్యూర్'. ఈ చిత్రానికి ఆమె కథ అందించడంతో పాటు ఓ ప్రధాన పాత్రలో నటించారు. నిశాంతి ఇవని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో యష్న, వారాహి, సాయి కృష్ణ ప్రధాన తారాగణం. ఇటీవల జరిగిన 'ఇంప్యూర్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ నందినీ రెడ్డి అటెండ్ అయ్యారు. అక్టోబర్ 2న థియేటర్లలో సినిమా విడుదల అవుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
22
ఓజీ సింగర్‌ పాడిన ఓఎంజీ పాట రచ్చ
Image Credit : Asianet News

ఓజీ సింగర్‌ పాడిన ఓఎంజీ పాట రచ్చ

ఇటీవల విడుదలైన 'ఇంప్యూర్' ట్రైలర్, 'ఓఎంజీ' (ఓ మై గాడ్) పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. 'ఓఎంజీ' సాంగ్ ప్రత్యేకత ఏమిటంటే... తెలుగు మూలాలు ఉన్న అమెరికన్ ర్యాపర్, సింగర్ రాజ కుమారి పాడటం. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ 'జవాన్' టైటిల్ ట్రాక్ పాడినది ఆవిడే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' సినిమాలోని 'ధోప్ ' కూడా పాడారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఓజీ'లో 'ఫైర్ స్ట్రోమ్' అయితే ఛార్ట్ బస్టర్ అయ్యింది. 'ఓజీ' సాంగ్ తర్వాత తెలుగులో రాజ కుమారి పాడిన పాట 'ఇంప్యూర్'లో 'ఓఎంజీ' కావడం విశేషం. ఈ పాటకు తెలుగు లిరిక్స్ కడలి సత్యనారాయణ అందించారు. ఈ సినిమాతో రాజ కుమారి సంగీత దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. ఈ పాటతో పాటు మరొక పాటను పాడటమే కాదు, సినిమాలో ప్రత్యేక అతిథి పాత్రలో ఆమె నటించారని నిర్మాత శ్రీదేవి మల్లిపాముల తెలిపారు.

మోడ్రన్‌ రిలేషన్స్ పై `ఇంప్యూర్‌`

'ఇంప్యూర్' సినిమా గురించి నిర్మాత శ్రీదేవి మల్లిపాముల మాట్లాడుతూ, `కాలంతో పాటు సమాజంలో మార్పులు వస్తున్నాయి. ఆ మార్పులను చూపిస్తూ మోడ్రన్ రిలేషన్షిప్స్ మీద తీసిన చిత్రమిది. మహిళలను సమాజం చూసే కోణాన్ని సున్నితంగా ప్రశ్నిస్తుంది. మానవ సంబంధాల నేపథ్యంలో, మోడ్రన్ జనరేషన్, అంతకు ముందు తరం మధ్య ఎటువంటి అనుబంధం ఉండాలనేది చెబుతూ తీసిన చిత్రమిది. జెన్ జి మాత్రమే కాదు... అన్ని వయసుల వాళ్ళను, అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే చిత్రమిది` అని చెప్పారు.

యష్న, వారాహి, సాయి కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన 'ఇంప్యూర్' సినిమాలో రాజకుమారి ప్రత్యేక పాత్రలో నటించారు. అభిజీత్, కిరీటి దామరాజు, ఆర్జే కాజల్, శ్రీవాణి ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి స్టోరీ: వారాహి మల్లిపాముల, ఎడిటర్స్: అశుతోష్ మతేల, రామకృష్ణ ఆరమ్, ఒరిజినల్ స్కోర్: కరణ్ పాండవ్ & నిర్వాణ్ ఆత్రేయ, సినిమాటోగ్రాఫర్: జ్ఞానశేఖర్ వీఎస్, మ్యూజిక్ డైరెక్టర్: రాజ కుమారి & కరణ్ పాండవ్, ప్రొడ్యూసర్స్: వారాహి మల్లిపాముల & శ్రీదేవి మల్లిపాముల, డైరెక్టర్: నిశాంతి ఇవని.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Thudakkam: సైకోని ఒక ఆట ఆడుకున్న మోహన్ లాల్ కూతురు, ప్లాన్ చేసి మరీ కొట్టింది.. ఓటీటీలో దుమ్ములేపుతున్న మూవీ
Recommended image2
Venkatesh Remuneration: ఆదర్శ కుటుంబం మూవీకి వెంకటేష్‌ ఊహించని రెమ్యూనరేషన్‌.. ఏకంగా 3 రెట్లు ఎక్కువ
Recommended image3
Sreeleela: దళపతి విజయ్, సల్మాన్ ఖాన్‌లను సైడ్ చేసిన శ్రీలీల, ఇన్స్టాగ్రామ్ లో న్యూ రికార్డ్
Related Stories
Recommended image1
Uday Kiran: చిరంజీవి అడ్డుపడుతున్నాడంటూ ఉదయ్‌ కిరణ్‌ ఆవేదన.. లవర్‌ బాయ్‌ నిజస్వరూపం బయటపెట్టిన నిర్మాత
Recommended image2
Venkatesh Remuneration: ఆదర్శ కుటుంబం మూవీకి వెంకటేష్‌ ఊహించని రెమ్యూనరేషన్‌.. ఏకంగా 3 రెట్లు ఎక్కువ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved