MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రాజమౌళి ఇచ్చిన ఆఫర్ ను రెండుసార్లు రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్, కారణం ఏంటో తెలుసా?

రాజమౌళి ఇచ్చిన ఆఫర్ ను రెండుసార్లు రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్, కారణం ఏంటో తెలుసా?

ప్రపంచం మెచ్చిన దర్శకుడు రాజమౌళి. ఆయన ఆఫర్ ఇస్తే చాలు అని స్టార్లు కూడా ఎదరుచూస్తుంటారు. అటువంటిది రాజమౌళి సినిమాలో ఆఫర్ వస్తే, స్వయంగా రాజమౌళి అడిగినా కూడా రెండు సార్లు రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా? దానికి కారణం ఏంటి?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 04 2025, 02:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Image Credit : Asianet News

దర్శక శిఖరం ఎస్.ఎస్. రాజమౌళి తో సినిమా అంటే ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా ఎగిరి గంతేయ్యాల్సిందే. ఆయన సినిమాలో చిన్న వేశం వచ్చినా చాలు అనుకునేవారు ఎందరో ఉన్నారు. ఇక రాజమౌళి సినిమా అంటే ఆదరించని ఆడియన్స్ ఉంటారా? పాన్ ఇండియా స్థాయిలో ఉన్న స్టార్ డైరెక్టరుగా ఆయనను వేలాది మంది అభిమానిస్తారు. ఆర్టిస్ట్ లు రాజమౌళి సినిమాలో నటించడానికి అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎదరుచూస్తూ ఉంటారు. కాని ఓ స్టార్ హీరోయిన్ మాత్రం జక్కన్న సినిమా ఆఫర్ ను రెండు సార్లు రిజెక్ట్ చేసింది. ఇంతకీ ఎవరా హీరోయిన్?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Image Credit : x/trisha fans page

ఆ హీరోయిన్ ఎవరో కాదు త్రిష. అవును చెన్నై చిన్నది త్రిష. తెలుగులో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన త్రిషకు రాజమౌళి గురించి తెలిసి కూడా ఎందుకు ఆయన సినిమాను రెండు సార్లు రిజెక్ట్ చేసిందబ్బా అని అందరికి అనుమానం కలిగి ఉండవచ్చు. దానికి ఓ పెద్ద రీజన్ కూడా ఉందట. త్రిషను రాజమౌళి హీరోయిన్ గా ఆఫర్ చేసింది స్టార్ హీరో సరసన హీరోయిన్ గా నటించడానికి కాదు. స్టార్ కమెడియన్ గా కొనసాగున్న సునిల్ హీరోగా వచ్చిన మర్యాదరామన్న సినిమాలో హీరోయిన్ గా తీసుకోవడం కోసం జక్కన్న త్రిషన్ సంప్రదించాడట.

36
Image Credit : our own

అయితే త్రిష అప్పటికే స్టార్ హీరోయిన్. అవ్వడం.. ఎంత రాజమౌళి సినిమా అయినా సరే..కామెడియన్ గా తన సినిమాల్లోనే నటించిన సునిల్ పక్కన హీరోయిన్ గా నటించడానికి త్రిష మనసు ఒప్పుకోలేదట అంతే కాదు ఆతరువాత తన కెరీర్ కు ఏమైనా ఇబ్బందులు వస్తాయేమో అని త్రిష ఆలోచించి ఈ ఆఫర్ ను ఆమె రిజెక్ట్ చేసిందని సమాచారం. ఇక త్రిష రిజెక్ట్ చేసిన తరువాత రాజమౌళి కూడా స్టార్ హీరోయిన్‌ లు అయితే ఒప్పుకోరు అని అర్ధం చేసుకున్నాడు. దాంతో కొత్త అమ్మాయిని తీసుకోవాలి అనుకున్నాడట. ఆ రకంగా సలోనీ రంగంలోకి వచ్చింది.

46
Image Credit : our own

ఈ సినిమా రావడం సలోనికి జాక్ పాట్ అని చెప్పాలి. ఈమూవ తరువాత సలోనీ కెరీర్ పరుగులు పెడుతుంది అని అనుకున్నారు జనాలు. కాని నిజానికి మర్యాదరామన్న తరువాత సలోనీకి రెండు మూడు చిన్న సినిమాలు తప్పించి పెద్దగా ఆఫర్లు లేవు. అసలు ఇప్పుడు ఎక్కడుందో కూడా తెలియదు. ఇక మరో సారి కూడా త్రిష రాజమౌళి సినిమాను రిజెక్ట్ చేయాల్సి వచ్చిందట. ఇక సరిగ్గా 14ఏళ్ల కిందట రిలీజై ‘మర్యాద రామన్నా’ ఊహించని రేంజ్‌లో హిట్టయింది.

56
Image Credit : social Media

అప్పటికే ‘సింహాద్రి’, ‘ఛత్రపతి’, ‘విక్రమార్కుడు’, ‘మగధీరా’ ఇలా ఇండస్ట్రీ హిట్ సినిమాలు తీసిన రాజమౌళి.. అనూహ్యంగా సునీల్ తో మర్యాద రామన్నా చేస్తున్నట్లు ప్రకటించి అందరకీ షాక్ ఇచ్చాడు. రాజమౌళికి ప్లాప్ రికార్డ్ లేదు. సునిల్ తో సినిమా అనేసరికి చాలామంది వద్దు అని సలహా ఇచ్చారట. ఇప్పటి వరకూ ఉన్న రికార్డ్ చెడగొట్టుకోవద్దు అని అన్నారట. కాని హిట్ కొట్టి తీరతాను అని చెప్పిన జక్కన్న చేసి చూపించాడు.

66
Image Credit : Instagram

సునిల్ ఈసినిమాతో హీరోగా ఫిక్స్ అయ్యాడు.. బంపర్ హిట్ కొట్టాడు. కేవలం 12 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఫైనల్ రన్ లో ఏకంగా .40 కోట్లకు పైగా కొల్లగొట్టి డిస్ట్రిబ్యూటర్ లకు కళ్లు చెదిరే లాభాలు తెచ్చిపెట్టింది. కానీ సునిల్ ఆతరువాత తన కెరీర్ ను నిలబెట్టుకోలేకపోయాడు. రాజమౌళి మాత్రం పాన్ వరల్డ్ డైరెక్టర్ గా ఆస్కార్ రేంజ్ కు వెళ్లాడు. ఇక ప్రస్తుతం మహేష్ బాబుతో 1000 కోట్ల భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నాడు జక్కన్న.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ఎస్.ఎస్. రాజమౌళి
త్రిష
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 
3rd TEST • SA vs AUS
Stumps
SASA
329 & 387
AUSAUS
429
Day 4
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నీకీ గతికి ఆ దేవుడే కారణం, ముఖేష్‌పై వంశీ ఫైర్‌.. ఎలిమినేషన్‌ నుంచి జస్ట్ మిస్‌ ఎవరంటే?
Recommended image2
Jason Sanjay: `సిగ్మా` డిజాస్టర్‌ ఎఫెక్ట్.. హీరోగా విజయ్‌ కొడుకు జాసన్‌ సంజయ్‌, డైరెక్టర్‌ ఎవరంటే?
Recommended image3
Bigg Boss 10: ఎనిమిదో వారం ఓటింగ్‌.. ఈ వారం బిగ్‌ బాస్‌ తెలుగు 10 నుంచి ఎలిమినేషన్‌ అయ్యేది ఎవరు?
Related Stories
Recommended image1
బాలకృష్ణకు తల్లిగా, భార్యగా నటించిన ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?
Recommended image2
చిరంజీవి కూతురు హీరోయిన్ గా నటించిన ఏకైక సినిమా ఏదో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved