చిరంజీవి కూతురు హీరోయిన్ గా నటించిన ఏకైక సినిమా ఏదో తెలుసా?
చిరంజీవి కుటుంబం నుంచి ఇప్పటికే చాలామంది హీరోలు టాలీవుడ్ లో ఉన్నారు. మూగ్గురు హీరోలు పాన్ ఇండియాను ఏలుతున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి నిహారిక హీరోయిన్ గా రాణించింది, అయితే మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరోయిన్ కూడా ఇండస్ట్రీకి వచ్చిందని మీకు తెలుసా?

మెగా ఫ్యామిలీలో హీరోలు, నిర్మాతలు ఉన్నారు. రకరకాల బిజినెస్ లు కూడా చేస్తున్నారు. ఇక అరడజనుకు పైగా స్టార్ హీరోలు టాలీవుడ్ లో కొనసాగుతున్నారు. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే.. మెగా డాటర్ నిహారిక కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో నిహారిక కంటే ముందు మెగా ఫ్యామిలీ నుంచి ఓ హీరోయిన్ ఇండస్ట్రీలో ఉందని మీకు తెలుసా?
తెలుగు సీనిమా పరిశ్రమలో.. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి, స్వయం కృషితో ఎదిగిన హీరో మెగాస్టార్ చిరంజీవి. సినిమా నేపథ్యం లేకుండా వచ్చి.. టాలీవుడ్ నే ఏలేస్తున్నాడు మెగాస్టార్. ప్రస్తుతం టాలీవుడ్ కు పెద్దన్నలా వ్యవహరిస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి. తన కుటుంబం నుంచి ఎంతోమంది ఇండస్ట్రీలో ఉన్నారు. సౌత్ ఇండియన్ కపూర్స్ ఫ్యామిలీగా మెగా ఫ్యామిలీకి పేరు పడిపోయింది.
ప్రస్తుతం చిరంజీవి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒంటరివాడు కాదు, తెలుగు సినిమాపరిశ్రమలో ఆయన మెగా సామ్రాజ్యాన్నే స్థాపించాడు. చిన్న హీరోగా కెరీర్ ను స్టార్ట్ చేసి.. అంచలంచెలుగా ఎదుగుతూ హీరోగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి నిర్మాతలు కూడా ఉన్నారు.
ఇక హీరోయిన్ల విషయానికి వస్తే..మెగా డాటర్ నిహారిక మాత్రమే కనిపిస్తుంటుంది. మెగాఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా చేసింది నిహారిక మాత్రమే. కాని ఆమె కూడా పెద్దగా రాణించలేకపోయింది. యాంకర్ గా, హీరోయిన్ గా, నిర్మాతగా.. మల్టీ టాలెంట్ చూపించింది నిహారిక.
అయితే పెళ్ళి తరువాత అన్నింటికి దూరంగా ఉన్న ఈ బ్యూటీ.. రీసెంట్ గా విడాకులు తీసుకుని... మళ్ళీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. నిర్మాతగా వెబ్ సిరీస్ లు, చిన్న సినిమాలు నిర్మిస్తోంది నిహారిక. అయితే మెగా ప్యామిలీ నుంచి నిహారిక మాత్రమే కాదు.. గతంలో మరోకరు కూడా హీరోయిన్ గా మారాలనిప్రయత్నాలు చేశారని మీకు తెలుసా.
అవును.. మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కూడా ఇండస్ట్రీలోనే ఉన్నారు. కాస్ట్యూమ్ డిజైనర్ గా టాలీవుడ్ లో చాలా సినిమాలకు ఆమె పనిచేశారు. ఆతరువాత రీసెంట్ గానే కొన్ని సినిమాలు నిర్మించి ప్రొడ్యూసర్ గా ఆమె సెటిల్ అయ్యారు. అయితే సుస్మిత నిర్మాతగా మాత్రమే కాదు హీరోయిన్ గా కూడా రాణించాలని అనుకుంది. ఆ ప్రయత్నం కూడా చేసిందని మీకుతెలుసా?
చిరంజీవికి ఇద్దరు కుమార్తెలు ఇండస్ట్రీలో హీరోయిన్లుగా ఎందుకుఎంట్రీ ఇ్వలేదు అని అందరికి డౌట్ రావచ్చు. మెగాస్టార్ కూడా తన పెద్ద కూతురు సుస్మితాను హీరోయిన్ గా చూడాలని ఎంతో ఆశపడ్డారట. అలా ప్రయత్నాలు కూడా చేశారట. కాని అలా ప్రయత్నం చేసిన ప్రతీ సారి ఏదో ఒక విధంగా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వచ్చేదని తెలుస్తోంది.
అంతే కాదు సుస్మిత ఓ మూవీలో హీరోయిన్ గా నటించిందట కూడా. ఆ సినిమా ను పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేయగా.. ఉదయ్ కిరణ్ హీరోగా నటించాడట. ఫస్ట్ హాఫ్ మూవీ మొత్త షూటింగ్ అయిపోయిందట కూడా. కాని సెకండ్ హాఫ్ షూటింగ్ కు కొన్ని ఆటంకాలు వచ్చి సినిమా కంప్లీట్ అవ్వలేదట. దాంతో ఆమెను హీరోయిన్ గా చేయాలన్న ప్రయత్నం మానేశారట.
ఈ న్యూస్ లో నిజం ఎంతో తెలియదు కాని.. సోషల్ మీడియాలో మాత్రం తెగ వైరల్ అవుతోంది. ఇక మెగాస్టార్ చిరంజీవి మాత్రం 70 ఏళ్ళకు అడుగు దూరంలో ఉన్నాడు. వరుస సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్ లో కామెడీ ఎంటర్టైనర్ మూవీ చేస్తున్న మెగాస్టార్, యంగ్ డైరెక్టర్ వశిష్ట్ కాంబినేషన్ లో విశ్వంభర సినిమాను కంప్లీట్ చేశారు. త్వరలో ఈసినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది.