బాలకృష్ణకు తల్లిగా, భార్యగా నటించిన ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకే హీరోయిన్ తో తండ్రి కొడుకులు నటించిన సంఘటనలు చాలా ఉన్నాయి. కాని ఒకే హీరోయిన్ హీరోకు తల్లిగా, భార్యగా నటించిన సినిమా గురించి మీకు తెలుసా?

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ 2 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. వరుసగా హిట్ సినిమాలతో దూసుకుపోతు ఫ్యాన్స్ ను అలరిస్తున్నాడు బాలయ్య బాబు. హ్యాట్రిక్ విజయం సాధించిన ఆయన డబుల్ హ్యాట్రిక్ కోసం జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. మాస్ ఆడియన్స్ కు కావల్సిన స్టఫ్ ను అందిస్తూ, నందమూరి ఫ్యాన్స్ ను ఊర్రూతలూగిస్తున్నాడు.
రీసెంట్ గా బాలకృష్ణ నటించిన సినిమాలు వరుసగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి టాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్స్ గా నిలుస్తున్నాయి. ఇక బాలయ్య బాబు తెలుగు సినీ పరిశ్రమలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ పురస్కారం కూడా అందించింది.
ఇక ప్రస్తుతం ఫ్యాన్స్ అంతా బాలయ్య బాబు అఖండా 2 కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా నుంచి అప్ డేట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానుల కోసం అఖండ 2 నుంచి స్పెషల్ వీడియో గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయిన ఈ వీడియోలో బాలకృష్ణ శివ తాండవం చూసిన అభిమానులు పూనకాలతో ఊగిపోయారు.
ఇక ఇదిలా ఉండగా, బాలకృష్ణ కెరీర్‌లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో అనేకమంది హీరోయిన్స్‌తో కలిసి పనిచేశారు. బాలయ్య బాబుతో నటించి స్టార్లు గా మారినవారు చాలామంది ఉన్నారు. నటసింహం సరసన నటించాలని ఎదురుచూసిన హీరోయిన్లు కూడా లేకపోలేదు. ఎంత మంది హీరోయిన్లతో నటించినా కాని.. బాలయ్యకు మాత్రం ఓ ఇద్దరు హీరోయిన్లు స్పెషల్ గా నిలిచారు. వారు బాలయ్యకు తల్లి పాత్రలోనూ, భార్య పాత్రలోనూ నటించి ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు.
అలాంటి పాత్రలో ఆకట్టుకున్న హీరోయిన్లలో ఒకరు హనీ రోజ్. హనీ రోజ్, మలయాళ సినీ పరిశ్రమ నుంచి వచ్చిన నటి. తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఆమె ఒక్కే ఒక్క సినిమాలో కనిపించి మంచి గుర్తింపు పొందారు. బాలకృష్ణ హీరోగా నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ వీర సింహారెడ్డి లో హనీరోజ్ కీలక పాత్ర పోషించారు.
ఈ సినిమాలో ఆమె రెండు భిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించారు – ఒకటిగా బాలకృష్ణ భార్యగా, మరొకటిగా ఆయన తల్లిగా నటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. 2023 లో రిలీజ్ అయిన ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
సినిమాలు చేయకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్‌గా ఉంటూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటుంది హనీరోజ్. ఇన్‌స్టాగ్రామ్ లో హనీరోజ్ కు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. ఆమె పెట్టే ఫోస్ట్ లకు భారీగా లైక్ లు వస్తుంటాయి. ఇక హనీరోజ్ మరల తెలుగులో కనిపిస్తారా? అనే ప్రశ్నకు స్పష్టత రాలేదు. కానీ ఆమె నటనకు విశేషమైన గుర్తింపు లభించిన నేపథ్యంలో, మళ్లీ తెలుగు సినిమాలో నటించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
సినిమాలు చేయకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్‌గా ఉంటూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటుంది హనీరోజ్. ఇన్‌స్టాగ్రామ్ లో హనీరోజ్ కు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. ఆమె పెట్టే ఫోస్ట్ లకు భారీగా లైక్ లు వస్తుంటాయి. ఇక హనీరోజ్ మరల తెలుగులో కనిపిస్తారా? అనే ప్రశ్నకు స్పష్టత రాలేదు. కానీ ఆమె నటనకు విశేషమైన గుర్తింపు లభించిన నేపథ్యంలో, మళ్లీ తెలుగు సినిమాలో నటించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ఇక బాలకృష్ణకు భార్యగా తల్లిగా నటించిన మరో హీరోయిన్ కూడా ఉంది. ఆమె ఎవరో కాదు ఒకప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని ఊపేసిన తార టబు. ఈ స్టార్ హీరోయిన్ చెన్నకేశవరెడ్డి సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ చేశారు. ఈసినిమాలో సీనియర్ బాలకృష్ణకు భార్యగా నటించిన టబు, జూనియర్ బాలయ్యకు తల్లి పాత్రలో కనిపించారు. ఇలా హనీరోజ్, టబు బాలకృష్ణ సరసన హీరోయిన్ గా, తల్లిగా నటించారు.