- Home
- Entertainment
- Prabhas Movies: ప్రభాస్ తొలి 5 సినిమాల రిజల్ట్ ఇదే.. ఇంత పెద్ద డిజాస్టర్లు పెట్టుకుని అంత క్రేజ్ ఎలా సాధ్యం ?
Prabhas Movies: ప్రభాస్ తొలి 5 సినిమాల రిజల్ట్ ఇదే.. ఇంత పెద్ద డిజాస్టర్లు పెట్టుకుని అంత క్రేజ్ ఎలా సాధ్యం ?
ప్రభాస్ ఈశ్వర్ మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. ప్రభాస్ నటించిన తొలి 5 సినిమాల్లో ఎక్కువ చిత్రాన్ని నిరాశనే మిగిల్చాయి. అయినప్పటికీ ప్రభాస్ క్రేజీ హీరోగానే కొనసాగారు. అదెలాగో ఈ కథనంలో తెలుసుకుందాం.

Prabhas
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఇండియాలో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అంటూ ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రభాస్ నటిస్తున్న సినిమాలు ఆ రేంజ్ లోనే ఉంటున్నాయి. బాహుబలి సినిమా ప్రభాస్ కెరీర్ ని, తెలుగు సినిమా ముఖ చిత్రాన్ని మార్చేసింది. ఆ తర్వాత ప్రభాస్ కి కొన్ని ఫ్లాపులు పడ్డప్పటికీ సలార్, కల్కి చిత్రాలు ప్రభాస్ బాక్సాఫీస్ స్టామినాకి నిదర్శనంగా నిలిచాయి. అయితే ప్రభాస్ తన కెరీర్ బిగినింగ్ లో నటించిన తొలి 5 సినిమాల గురించి తెలుసా ? అందులో ఎక్కువగా డిజాస్టర్లు ఉన్నప్పటికీ ప్రభాస్ క్రేజ్ ఎలా కంటిన్యూ అయింది అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఈశ్వర్
కృష్ణంరాజు నట వారసుడిగా ప్రభాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిత్రం ఇదే. జయంత్ సి పరాన్జీ దర్శకుడు. ఈ చిత్రం ప్రేక్షకులని ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. కృష్ణంరాజు ఫ్యామిలీ నుంచి ఓ యువ హీరో వచ్చాడని మాత్రం అందరికీ ఈ చిత్రంతో తెలిసింది.
రాఘవేంద్ర
ప్రభాస్ నటించిన రెండవ సినిమా రాఘవేంద్ర కూడా డిజాస్టర్ గా నిలిచింది. సురేష్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు. ప్రభాస్ లాంటి యువ హీరో అవుట్ డేటెడ్ కథాంశంతో రావడం ఆడియన్స్ కి నచ్చలేదు. ఇందులో ప్రభాస్ ని కొంత మాస్ ఆడియన్స్ కి నచ్చేలా చూపించడానికి ప్రయత్నించారు. కానీ వర్కౌట్ కాలేదు.
వర్షం
ప్రభాస్ తొలిసారి తన ఏజ్ కి తగ్గ లవ్ స్టోరీ, కటౌట్ కి తగ్గ మాస్ అంశాలు ఉండే చిత్రాన్ని ఎంచుకున్నారు. ఆ చిత్రమే వర్షం. ఈ మూవీలో త్రిష, ప్రభాస్ మధ్య కెమిస్ట్రీ అదుర్స్ అనే చెప్పాలి. శోభన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో గోపీచంద్ విలన్ గా నటించారు. గోపీచంద్ పాత్ర కూడా ఈ మూవీలో హైలైట్ అనే చెప్పాలి. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ప్రభంజనం సృష్టించింది. ఒక్కసారిగా ప్రభాస్ క్రేజీ హీరో అయిపోయాడు.
అడవి రాముడు
వర్షం సినిమా ప్రభాస్ పై అంచనాలు పెంచేసింది. ఆ తర్వాత ప్రభాస్ నటించిన సినిమా భారీ స్థాయిలో నిర్మాణం జరిగింది. మాస్ చిత్రాల దర్శకుడు బి గోపాల్ దర్శకత్వంలో అడవి రాముడు అనే చిత్రం లో ప్రభాస్ నటించారు. ఇందులో మాస్ అంశాలు బలంగానే ఉంటాయి. కానీ కథ ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ కి సెట్ కాలేదు. దీనితో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం నిరాశ పరిచింది.
చక్రం
ఆ తర్వాత ప్రభాస్ కృష్ణవంశీ దర్శకత్వంలో చక్రం మూవీలో నటించారు. వైవిధ్యమైన కథలో నటించాలనే ఉద్దేశంతో ప్రభాస్ కంప్లీట్ గా రాంగ్ స్టెప్ వేశారు. ఈ సినిమాలో ఎమోషనల్ డోస్ ఎక్కువైంది. అసలు ప్రభాస్ నుంచి ఇలాంటి సినిమా ఆడియన్స్ ఊహించలేదు. ఫలితంగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది.
తొలి 5 సినిమాల్లో ప్రభాస్ కి వర్షం చిత్రంతో మాత్రమే విజయం దక్కింది. మిగిలిన నాలుగు చిత్రాలు డిజాస్టర్స్ అయ్యాయి. అయినప్పటికీ ఆడియన్స్ లో ప్రభాస్ పై అంచనాలు పడిపోలేదు. వర్షం లాంటి సూపర్ హిట్, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్, అతడి కటౌట్, బాడీ లాంగ్వేజ్ ప్రభాస్ ఇమేజ్ ని కాపాడాయి.















