- Home
- Entertainment
- Chiranjeevi First Salary: చిరంజీవి ఫస్ట్ సినిమాకి ఎంత తీసుకున్నాడో తెలుసా? మెగాస్టార్ అవ్వడమంటే ఈజీనా?
Chiranjeevi First Salary: చిరంజీవి ఫస్ట్ సినిమాకి ఎంత తీసుకున్నాడో తెలుసా? మెగాస్టార్ అవ్వడమంటే ఈజీనా?
Chiranjeevi First Salary: చిరంజీవి ప్రాణం ఖరీదు సినిమాతో టాలీవుడ్‌కి నటుడిగా పరిచయం అయ్యాడు మరి ఈ సినిమాకిగానూ ఆయన ఎంత పారితోషికం తీసుకున్నారనేది తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.

చిరంజీవి ఫస్ట్ సినిమా పారితోషికం
మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఒక్క సినిమాకి సుమారు రూ. 60కోట్లకుపైగానే పారితోషికం తీసుకుంటున్నారు. సీనియర్లలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోగా నిలిచారు. అంతేకాదు ఫస్ట్ టైమ్ తెలుగులో కోటి పారితోషికం తీసుకున్న హీరో చిరంజీవి కావడం విశేషం. అప్పట్లో ఇదొక సంచలనం. ఇండియా వైడ్‌గా హాట్ టాపిక్‌గా మారింది. పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. మరి చిరంజీవి నటుడిగా పరిచయం అయిన తొలి సినిమాకి ఎంత పారితోషికం తీసుకున్నారనే వివరాలు బయటకు వచ్చాయి. చిరంజీవినే ఈ విషయాన్ని వెల్లడించారు.
చిరంజీవి ఫస్ట్ మూవీ ప్రాణం ఖరీదు
చిరంజీవి నటుడిగా వెండితెరకు పరిచయం అయిన సినిమా `ప్రాణం ఖరీదు`. కానీ ఆయనకు మొదటగా వచ్చిన ఆఫర్ `పునాది రాళ్లు`. ఈ సినిమా షూటింగ్, రిలీజ్ డిలే కావడంతో `ప్రాణం ఖరీదు` సినిమా ఫస్ట్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకి కే వాసు దర్శకత్వం వహించారు. రావు గోపాలరావు, చంద్రమోహన్ వంటి వారు నటించారు. అందులో ఒక కీలక పాత్రలో చిరంజీవి కనిపించారు. క్రాంతికుమార్ నిర్మించారు. ఈ సినిమా 1978 సెప్టెంబర్ 22న విడుదలైంది. ఇది మంచి ఆదరణ పొందింది.
ప్రాణం ఖరీదు మూవీకి చిరంజీవి తీసుకున్న పారితోషికం
ఈ మూవీ చేసేలోపే ఆయనకు వరుసగా ఆఫర్లు వచ్చాయి. బిజీ అయిపోయాడు. అయితే `ప్రాణం ఖరీదు` మూవీకి చిరంజీవి అందుకు పారితోషికం ఎంత అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ మూవీకి ఆయన ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఫ్రీగా చేశాడట. ఆ సమయంలో సినిమా ఆఫర్లు రావడమే గొప్పగా భావించేవాళ్లు. పైగా మొదటి అవకాశం. అందుకే ఎలాంటి పారితోషికం తీసుకోకుండానే నటించాడట. ఇదే కాదు తాను మొదట కమిట్ అయిన `పునాది రాళ్లు` చిత్రానికి కూడా ఆయన డబ్బులు తీసుకోకుండానే నటించాడట.
మూడో సినిమాకి తొలి పారితోషికం
ఆ తర్వాత మూడో సినిమాగా ఒప్పుకున్న `మనవూరి పాండవులు` చిత్రానికి మాత్రం నిర్మాతలు 1116 రూపాయలు ఇచ్చారట. అదే తన తొలి పారితోషికం అని తెలిపారు చిరంజీవి. ఆ సమయంలో తాను డిమాండ్ చేసే పరిస్థితిల్లో లేనని వెల్లడించారు. జయప్రద నిర్వహించిన టాక్ షోలో చిరంజీవి ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే మరో సందర్భంలో నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ, చిరంజీవికి తాను కూడా పారితోషికం ఇవ్వలేదని చెప్పారు. తన బ్యానర్‌లో `కోతల రాయుడు`, `మొగుడు కావాలి` చిత్రాలు చేశారు. వాటికి కూడా పారితోషికం ఇవ్వలేదు. అయితే చిరంజీవి పెళ్లి సమయంలో పదివేలు ఇచ్చాడట తమ్మారెడ్డి. ఆ తర్వాత మరో సందర్భంలో యూరప్ వెళ్తున్నప్పుడు డబ్బులు కావాలంటే మరో పదివేలు ఇచ్చాడట. అలాగే ఇళ్లు కొంటున్నానని చెబితే రూ.15వేలు ఇచ్చాడట తమ్మారెడ్డి. ప్రారంభంలో చిరంజీవి అందుకున్న పారితోషికాలు ఇవే అని చెప్పొచ్చు.
ఖైదీతో లెక్క మారింది, కాకా మూవీకి చిరు పారితోషికం
`ఖైదీ` సినిమా వరకు స్ట్రగుల్స్ తప్పలేదని, ఆ తర్వాత ఇక లక్షల్లో పారితోషికం దక్కిందని సమాచారం. ఇలా ప్రారంభంలో డబ్బుకి ప్రయారిటీ ఇవ్వలేదు, నటుడిగా తానేంటో నిరూపించుకున్నారు. ఆడియెన్స్ ని అలరించాలని భావించారు. అందుకే ఆయన మెగాస్టార్ అయ్యారు. ప్రస్తుతం చిరంజీవి `కాకా` చిత్రంలో నటిస్తున్నారు. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. కేవీఎన్ ప్రొడక్షన్ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అనురాగ్ కశ్యప్ నెగటివ్ రోల్ చేస్తున్నట్టు సమాచారం. ఇటీవలే ఆయన షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతుంది. ఈ మూవీకి చిరంజీవికి సుమారు రూ.60-70కోట్ల వరకు పారితోషికం ఇస్తున్నారనే ప్రచారం జరుగుతుంది.

