- Home
- Entertainment
- Sankranti Movies 2026: సంక్రాంతి బరిలో 10 మంది హీరోయిన్లు, అందులో ఏడుగురు ఫ్లాపుల్లో ఉన్నవాళ్లే..
Sankranti Movies 2026: సంక్రాంతి బరిలో 10 మంది హీరోయిన్లు, అందులో ఏడుగురు ఫ్లాపుల్లో ఉన్నవాళ్లే..
సంక్రాంతి బరిలో టాలీవుడ్ నుంచి 10 మంది హీరోయిన్లు ఉన్నారు. వారిలో ఏడుగురికి తప్పనిసరిగా హిట్ అవసరం. ఆ హీరోయిన్లు ఎవరు అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.

సంక్రాంతి హీరోయిన్లు
ఈ సంక్రాంతికి టాలీవుడ్ లో నుంచి పోటీ పడుతున్నది ఐదుగురు హీరోలే. ప్రభాస్, చిరంజీవి, రవితేజ, నవీన్ పోలిశెట్టి, శర్వానంద్ సంక్రాంతి బరిలో ఉన్నారు. రాజాసాబ్, మన శంకర వరప్రసాద్ గారు, భర్త మహాశయులకు విజ్ఞప్తి, అనగనగా ఒక రాజు,నారీ నారీ నడుమ మురారి చిత్రాలు విడుదల అవుతున్నాయి. కానీ ఈ చిత్రాల్లో నటిస్తున్న హీరోయిన్లు మాత్రం ఏకంగా 10 మంది ఉన్నారు. వారిలో చాలామంది హీరోయిన్లు ఫ్లాపుల్లో ఉన్నవారే. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
నయనతార
నయనతార మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో చిరంజీవికి జోడిగా నటిస్తున్నారు. ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా నయనతార క్రేజ్ లో ఎలాంటి మార్పు ఉండదు. కానీ ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.
కేథరిన్
గ్లామర్ ఉన్నప్పటికీ కేథరిన్ కి సరైన విజయాలు లేవు. వస్తున్న అరకొర అవకాశాలు కూడా ఫుల్ లెన్త్ హీరోయిన్ గా రావడం లేదు. మన శంకర వరప్రసాద్ గారు లో కేథరిన్ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ చిత్ర విజయం ఆమెకి చాలా అవసరం.
మాళవిక మోహనన్
మాళవిక మోహన్ తమిళ, మలయాళీ చిత్రాలతో ఫ్లాప్ అయింది. తెలుగులో ఆమె నటిస్తున్న తొలి చిత్రం రాజా సాబ్. ఫస్ట్ మూవీ తోనే ప్రభాస్ కి జోడీగా నటించే జాక్ పాట్ కొట్టేసింది. ఆల్రెడీ గ్లామర్ పరంగా మాళవికకి విపరీతమైన క్రేజ్ ఉంది. రాజా సాబ్ హిట్ అయితే పాన్ ఇండియా గుర్తింపు లభించినట్లే.
నిధి అగర్వాల్
నిధి కూడా రాజాసాబ్ లో నటిస్తోంది. ఈ చిత్ర విజయం నిధి అగర్వాల్ కి చాలా ఇంపార్టెంట్. నిధి అగర్వాల్ కెరీర్ లో పెద్దగా హిట్లు లేవు. చివరగా నటించిన హరిహర వీరమల్లు కూడా ఫ్లాప్ అయింది. సో రాజా సాబ్ పై నిధి అగర్వాల్ బోలెడన్ని ఆశలు పెట్టుకుని ఉంది.
రిద్ధి కుమార్
రాజాసాబ్ లో ఛాన్స్ రావడం యంగ్ బ్యూటీ రిద్ధి కుమార్ అదృష్టమే అని చెప్పొచ్చు. రిద్ధి కుమార్ గతంలో చిన్న సినిమాల్లో నటించింది. రాధే శ్యామ్ లో కూడా చిన్న రోల్ లో మెరిసింది. ఆ మూవీ ఫ్లాప్. రాజా సాబ్ హిట్ అయితే ఆమె ఇమేజ్ పెరగడం ఖాయం.
డింపుల్ హయతి
డింపుల్ హయతికి సరైన హిట్ ఒక్కటి కూడా లేదు. చివరగా నటించిన రామబాణం లాంటి సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. గ్లామర్, డ్యాన్స్ పరంగా డింపుల్ కి తిరుగులేదు. డస్కీ బ్యూటీగా యువతలో గుర్తింపు ఉంది. రవితేజతో భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా రిజల్ట్ పైనే డింపుల్ కెరీర్ ఆధారపడి ఉంది.
ఆషిక రంగనాథ్
ఆషిక రంగనాథ్ కి కూడా తెలుగులో చెప్పుకోదగ్గ విజయాలు లేవు. అమిగోస్, నా సామిరంగ లాంటి సినిమాల్లో నటించింది. ఆమె కూడా భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రంలో నటిస్తోంది.
మీనాక్షి చౌదరి
ఇటీవల కాలంలో బాగా వినిపిస్తున్న పేరు మీనాక్షి చౌదరి. ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. మళ్ళీ 2026 సంక్రాంతికి ఆమె నటించిన అనగనగా ఒక రాజు చిత్రం రిలీజ్ అవుతోంది. ఈ మూవీలో నవీన్ పోలిశెట్టి హీరో. ఈసారి మీనాక్షి ఎంత పెద్ద విజయం అందుకుంటుందో చూడాలి.
సంయుక్త మీనన్
సంయుక్త మీనన్ టాలీవుడ్ లోకి భీమ్లా నాయక్, బింబిసార లాంటి సూపర్ హిట్ చిత్రాలతో ఎంట్రీ ఇచ్చింది. అయితే చివరగా ఆమెకి డెవిల్, అఖండ 2 లాంటి ఫ్లాపులు ఎదురయ్యాయి. శర్వానంద్ కి జోడీగా సంయుక్త నటించిన నారీనారీ నడుమ మురారి సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతోంది.
సాక్షి వైద్య
యంగ్ బ్యూటీ సాక్షి వైద్యకి టాలీవుడ్ లో మంచి అవకాశాలు వస్తున్నాయి. కానీ ఆమె నటించిన సినిమాలు డిజాస్టర్ అవుతున్నాయి. ఏజెంట్, గాండీవ దారి అర్జున లాంటి భారీ చిత్రాల్లో నటించినప్పటికీ అవి ఫ్లాప్ అయ్యాయి. ఆమె కూడా నారీ నారీ నడుమ మురారిలో ఒక హీరోయిన్.

