- Home
- Entertainment
- అల్లు అర్జున్, రాంచరణ్ సినిమాలు సూపర్ హిట్.. కానీ మహేష్ బాబు మంచి మూవీ కూడా ఫ్లాప్, ఎందుకంటే
అల్లు అర్జున్, రాంచరణ్ సినిమాలు సూపర్ హిట్.. కానీ మహేష్ బాబు మంచి మూవీ కూడా ఫ్లాప్, ఎందుకంటే
రాంచరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు బ్రదర్ సెంటిమెంట్ ఉన్న సినిమాల్లో నటించారు. రంగస్థలం, రేసుగుర్రం, అర్జున్ సినిమాల గురించి ఆసక్తికర వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

టాలీవుడ్ లో బ్రదర్, సిస్టర్ సెంటిమెంట్ సినిమాలు
టాలీవుడ్ లో ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న సినిమాలకు ఆదరణ ఎక్కువగా ఉంటుంది. ఫాదర్ సెంటిమెంట్, బ్రదర్ సెంటిమెంట్, సిస్టర్ సెంటిమెంట్, మదర్ సెంటిమెంట్ ఇలాంటి ఎమోషనల్ మూవీస్ గతంలో అద్భుతమైన ఫలితాలు ఇచ్చాయి. ఎక్కువగా రిపీట్ అయ్యే సినిమాలు బ్రదర్, సిస్టర్ సెంటిమెంట్ తో ఉంటాయి.
చరణ్, బన్నీ, మహేష్ సినిమాల మధ్య పోలిక
టాలీవుడ్ అగ్ర హీరోలు చిరంజీవి, వెంకటేష్ , మహేష్ బాబు, అల్లు అర్జున్, రాంచరణ్, ఎన్టీఆర్ లాంటి వారంతా బ్రదర్, సిస్టర్ సెంటిమెంట్ చిత్రాల్లో నటించారు. ఆల్మోస్ట్ ఎక్కువ శాతం విజయాలు సాధించారు. అయితే రాంచరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు నటించిన బ్రదర్, సిస్టర్ సెంటిమెంట్ సినిమాల మధ్య ఒక పోలిక ఉంది. రంగస్థలం, రేసుగుర్రం, అర్జున్ సినిమాల మధ్య ఉండే పోలిక గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రేసు గుర్రం
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అల్లు అర్జున్ (లక్కీ), శ్యామ్( ఏసీపీ రామ్) బ్రదర్స్ గా నటించారు. లక్కీకి అన్నయ్య అంటే అసలు పడదు. ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటాడు. కానీ తన అన్నకి కష్టం వచ్చినప్పుడు మాత్రం ఎంతటి వారైనా లెక్క చేయడు. అడ్డంగా నిలబడిపోతాడు. ఈ మూవీ సంచలన విజయం అందుకుంది.
రంగస్థలం
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం టాలీవుడ్ క్లాసిక్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది. రాంచరణ్ చిట్టిబాబు పాత్రలో నటించాడు. రాంచరణ్ కి అన్నగా కుమార్ బాబు పాత్రలో ఆది పినిశెట్టి నటించాడు. చిట్టిబాబు కూడా తన అన్నపై చీటికీ మాటికీ అలుగుతూనే ఉంటాడు. కానీ తన అన్నకి ఆపద వచ్చినప్పుడు మాత్రం ప్రాణాలకు తెగిస్తాడు. తన అన్నని చంపిన వారిపై పగ తీర్చుకునేందుకు తన లైఫ్ నే రిస్క్ లో పెడతాడు.
అర్జున్
గుణశేఖర్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన అర్జున్ చిత్రం బ్రదర్, సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందింది. ఈ మూవీలో అర్జున్ తన అక్కతో సరదాగా గొడవ పడుతుంటాడు. కానీ తన అక్కని రక్షించేందుకు పెద్ద సాహసమే చేస్తాడు. అవమానాలు సైతం ఎదుర్కొంటాడు. అయితే స్క్రీన్ ప్లే లోపాలు, ఓవర్ డోస్ సెంటిమెంట్ వల్ల మంచి సినిమా అయినప్పటికీ అర్జున్ మూవీ కమర్షియల్ గా ఫెయిల్ అయింది.
తోబుట్టువులతో గొడవ పడుతూ అవసరమైనప్పుడు తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా, తమ ప్రపంచాన్ని మార్చుకుని పోరాడే బ్రదర్స్ మెంటాలిటీని సైకాలజీలో కిన్షిప్ డ్రివెన్ సెల్ఫ్ శాక్రిఫైజ్ అని అంటారు.

