భయం అంటూ తెలియని వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. ఎన్నో వివాదాలకు, వివాదాస్పద సినిమాలకు, వివాదాస్పద కామెంట్లకు కేంద్ర బిందువుగా ఉన్న వర్మకు ఫస్ట్ టైమ్ భయంపట్టుకున్నట్టుంది. ఆయన కోర్టు నుఆశ్రించారు. కారణం ఏంటంటే?
రామ్ గోపాల్ వర్మ.. సినిమాలో హీరో డైలాగ్ చెప్పినట్టు.. భయమంటే ఏంటో తెలియని బ్లడ్. నచ్చింది చేస్తాడు, తోచింది సినిమాగా తీస్తాడు. నిజా నిజాలతో పనిలేదు తనకు రాంగ్ అనిపిస్తేు రాంగ్, రైట్ అనిపిస్తే రైట్. అలానే చాలామంది స్టార్స్ కు సబంధించి ఆయన చేసిన సినిమాలు భారీ కాంట్రవర్సీలకు దారి తీశాయి. అయితే ఎప్పుడు ఏ సినిమా గురించి కాని.. ఏ రాజకీయ నాయకుడి గురించి కాని.. ఏ విషయంలో కాని భయపడని వర్మ.. తాజాగా కాస్త వెనకడుకు వేస్తున్నట్టు తెలుస్తోంది. రీసెంట్ గా ఆయన కోర్టు లో పిటీషన్ వేశారు. తాను చేసిన ఓ సినిమాకు సబంధించిన ఆయన కోర్డును ఆశ్రయించారు. అసలు విషయం ఏంటంటే..?
రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా
రామ్ గోపాల్ వర్మ 2019లో 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' పేరుతో సినిమా తెరకెక్కించారు. అది కాస్త రిలీజ్ కు ముందే వివాదం అవ్వడంతో దాని టైటిల్ ను మార్చిన ఆర్జీవీ అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' పేరుతో సినిమాను రిలీజ్ చేశారు. అప్పటి వైసీపీ ప్రభుత్వంలో వర్మకు సపోర్ట్ ఉండటంతో.. ఈ విషయంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా వర్మపై ఎటువంటి కేసులు నామోదు కాలేదు. ఇక ఆ సినిమాను థియేటర్ లోటైటిల్ మార్చి రిలీజ్ చేసినా.. యూట్యూబ్‌లో మాత్రం 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' పేరుతోనే రిలీజ్ చేశారు.
ఈ విషయంలో మంగళగిరి సమీపంలోని ఆత్మకూరుకు చెందిన బండారు వంశీకృష్ణ సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సినిమాలోని అభ్యంతరకర సన్నివేశాలు చాలా ఉన్నాయని. వాటిని కూడా ఆయన తొలగించలేదని, వాటి వల్ల తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ.. ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో మంగళగిరిలోని సీఐడీ పోలీస్ స్టేషన్‌లో గతేడాది నవంబర్ 29న కేసు నమోదైంది. ఈ క్రమంలో ఆర్జీవీకి సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చారు.
హైకోర్టును ఆశ్రయించిన రామ్ గోపాల్ వర్మ
అప్పుడు చాలా రోజులువిచారణ నుంచి తప్పకున్న వర్మ.. ఆతరువాత రాంగోపాల్ వర్మ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనపై సీఐడీ నమోదు చేసిన కేసును వెంటనే కొట్టివేసే చర్యలు తీసుకోవాలని హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై వస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమని, రాజకీయ దురుద్దేశంతోనే ఈ కేసు నమోదు చేశారని పిటిషన్‌లో వర్మ పేర్కొన్నారు. సీబీఎఫ్‌సీ ధ్రువపత్రం జారీ చేసిన తర్వాత 2019లో ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమా విడుదల చేశామని, 2024లో తనపై కేసు నమోదు చేయడంలో అర్థం లేదని పేర్కొన్నారు. ఈ కేసులో సీఐడీ నమోదు చేసిన సెక్షన్లు చెల్లవని ఆయన కోర్డు ముందు వాదించారు.
రామ్ గోపాల్ వర్మకు ఊరట
దాంతో ఈరోజు వారి వాదనలు విన్న హైకోర్డు.. విచారణ తరువారుత తీర్పు ఇచ్చింది. 2019 లో రిలీజ్ అయిన సినిమాపై ఇప్పుడు కేసులేంటి అన్నారు న్యాయమూర్తి. ఈసకేసుపై స్టే విధిస్తూ.. ఆరువారాల వరకూ అరెస్ట్ చేయకూడదంటూ తీర్పనిచ్చారు. దాంతో రామ్ గోపాల్ వర్మకు ఈ కేసు నుంచి కాస్త రిలీఫ్ దొరికినట్టు అయ్యింది. అంతకు ముందు ఐదేళ్లు..వర్మ చాలా సినిమాలు చేశారు. అందులో చంద్రబాబు, పవన్, లాంటి పెద్దలీడర్స్ ను కూడా వదలకుండా వర్మ విమర్శించారు. సినిమాలో రాంగ్ గా చూపించారు. ఇక ఇప్పుడు తనను ముందు ముందు ఇలానే వేదిస్తారన్న భయం వర్మలో కనిపిస్తుంది అని అంటున్నారు సినిమా జనాలు.
