MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Tripuraneni Chittibabu: తీవ్ర విషాదం.. ప్రముఖ నిర్మాత చిట్టిబాబు మృతి, సౌందర్య జాతకం మారింది ఆయన వల్లే

Tripuraneni Chittibabu: తీవ్ర విషాదం.. ప్రముఖ నిర్మాత చిట్టిబాబు మృతి, సౌందర్య జాతకం మారింది ఆయన వల్లే

దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా రాణించిన త్రిపురనేని చిట్టిబాబు మరణించారు. గుండెపోటు కారణంగా హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చిట్టిబాబు తుదిశ్వాస విడిచారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Apr 22 2026, 07:33 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Tripuraneni Chittibabu
Image Credit : Asianet News

Tripuraneni Chittibabu

తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు (71) కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. గుండెపోటు కారణంగా ఆయన మరణించారు. దీనితో ఆయన మరణ వార్తతో టాలీవుడ్ లో దిగ్భ్రాంతి నెలకొంది. త్రిపురనేని చిట్టిబాబు తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతగా, దర్శకుడిగా, నటుడిగా రాణించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
గుండెపోటు కారణంగా మృతి
Image Credit : Asianet News

గుండెపోటు కారణంగా మృతి

బుధవారం రాత్రి ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని సింధు హాస్పిటల్ కి తరలించారు. కానీ పరిస్థితి విషమించడంతో చిట్టిబాబు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. చిట్టిబాబు ఫిల్మీ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చారు. చిట్టిబాబు అసలు పేరు వరప్రసాద్. ఆయన 1955లో కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో జన్మించారు.

Related Articles

Related image1
Venkatesh: ఫస్ట్ మూవీలోనే బికినీలో చూపించింది అందుకే.. ఓపెన్ గా చెప్పేసిన డైరెక్టర్, వెంకటేష్ కష్టాలు
Related image2
Allu Arjun Fees: దేశంలోనే అత్యంత ఖరీదైన స్టార్‌గా అల్లు అర్జున్.. ఒక్క దెబ్బతో రజినీ, షారుఖ్ రేంజ్
35
 సౌందర్యని ఇండస్ట్రీకి పరిచయం చేసిన క్రెడిట్
Image Credit : Asianet News

సౌందర్యని ఇండస్ట్రీకి పరిచయం చేసిన క్రెడిట్

సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ లో మెమొరబుల్ గా నిలిచిపోయిన చిత్రం అల్లూరి సీతారామరాజు. ఈ చిత్రానికి రచయిత ఎవరో కాదు చిట్టిబాబు తండ్రి త్రిపురనేని మహారథి. తండ్రి బాటలోనే సినిమారంగంలోకి వచ్చారు చిట్టిబాబు. సౌందర్య లాంటి అగ్ర హీరోయిన్ ని ఇండస్ట్రీకి పరిచయం చేసిన క్రెడిట్ చిట్టిబాబుకే దక్కుతుంది. సౌందర్య తొలిసారి నటించిన రైతు భారతం అనే చిత్రాన్ని చిట్టిబాబు తెరకెక్కించారు. కానీ ఈ సినిమా రిలీజ్ ఆలస్యం కావడంతో ఆ తర్వాత ఆమె నటించిన మనవరాలి పెళ్లి ముందుగా రిలీజ్ అయింది.

45
30 చిత్రాల్లో నటుడిగా
Image Credit : Asianet News

30 చిత్రాల్లో నటుడిగా

దీనితో సౌందర్య డెబ్యూ మూవీగా మనవరాలి పెళ్లి నిలిచింది. కానీ ఆమె తొలిసారి కెమెరా ఫేస్ చేసింది మాత్రం చిట్టిబాబు దర్శకత్వంలోనే. ఎమ్మెస్ నారాయణని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేసింది చిట్టిబాబే. చిట్టిబాబు సినీ, రాజకీయ విశ్లేషకుడిగా టీవీ డిబేట్స్ లో సైతం పాల్గొంటూ ఉండేవారు. నిర్మాతగా, దర్శకుడిగా మాత్రమే కాకుండా చిట్టిబాబు దాదాపు 30 చిత్రాల్లో నటుడిగా నటించారు. జాతిరత్నాలు, జిన్నా లాంటి సినిమాల్లో నటించారు. ఇప్పుడు ఆయన మృతి కుటుంబ సభ్యులు శోకసంద్రం లో మునిగిపోయారు. చిట్టిబాబు మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు, సన్నిహితులు సంతాపం తెలుపుతున్నారు.

55
 రాజకీయ రంగంలో కూడా కీలక పాత్ర
Image Credit : Asianet News

రాజకీయ రంగంలో కూడా కీలక పాత్ర

సినీ రంగంతో పాటు, చిట్టిబాబు గారు రాజకీయ రంగంలో కూడా కీలక పాత్ర పోషించారు. ఆయన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) స్థాపన నుంచే ఒక ముందడుగు వేసిన నాయకుడిగా, సీనియర్ నాయకుడిగా పార్టీ బలోపేతానికి విశేషంగా కృషి చేశారు. ప్రజాసేవ పట్ల ఆయనకు ఉన్న నిబద్ధతకు అన్ని వర్గాల నుంచి గౌరవం లభించింది. చిట్టిబాబు గారికి భార్య ఉషా లత గారు, ముగ్గురు సంతానం.. నరోత్తం త్రిపురనేని, భాస్వంత్ త్రిపురనేని, మోనిషా త్రిపురనేని ఉన్నారు. చిట్టిబాబు గారి మరణం సినీ రంగానికి, రాజకీయ వర్గాలకు తీరని లోటు. ఆయన ఒక ప్రతిభావంతుడైన కళాకారుడు, మార్గదర్శి, నిబద్ధత కలిగిన ప్రజా సేవకుడిగా ఎప్పటికీ గుర్తుండిపోతారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10 Mukesh Gowda: రిషిగా బుల్లితెరని ఊపేశాడు, ఇప్పుడు బిగ్‌ బాస్‌ హౌజ్‌ షేక్‌.. ముఖేష్‌ గౌడ గ్రాండ్‌ ఎంట్రీ
Recommended image2
OTT Movies: బాడీగార్డ్ తో వ్యాపారవేత్త కూతురు రొమాన్స్.. ఈ వారం ఓటీటీలో రొమాంటిక్, థ్రిల్లర్ సినిమాల జోరు
Recommended image3
Bigg Boss 10 Varshini: ఆ ఘటనతో పెళ్లికి దూరం, క్యాస్టింగ్‌ కౌచ్ కామెంట్‌తో దుమారం.. వర్షిణి గ్రాండ్‌ ఎంట్రీ
Related Stories
Recommended image1
Venkatesh: ఫస్ట్ మూవీలోనే బికినీలో చూపించింది అందుకే.. ఓపెన్ గా చెప్పేసిన డైరెక్టర్, వెంకటేష్ కష్టాలు
Recommended image2
Allu Arjun Fees: దేశంలోనే అత్యంత ఖరీదైన స్టార్‌గా అల్లు అర్జున్.. ఒక్క దెబ్బతో రజినీ, షారుఖ్ రేంజ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved