MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • Tollywood: అక్క‌డ కూడా మేక‌ప్ వేసుకోమ‌నే వారు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

Tollywood: అక్క‌డ కూడా మేక‌ప్ వేసుకోమ‌నే వారు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

Tollywood: సినిమా రంగంలో ప్రతిభకంటే అందానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తార‌ని ఇప్ప‌టికే చాలా మంది న‌టీమ‌ణులు బ‌హిరంగానే చెప్పారు. కాగా ఆజాగా మ‌రో హీరోయిన్ కూడా ఇలాంటి సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఇంత‌కీ ఎవ‌రా హీరోయిన్, ఏమ‌న్నారంటే.? 

2 Min read
Author : Narender Vaitla
Published : Mar 13 2026, 12:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తెల్లగా కనిపించాలని ఒత్తిడి
Image Credit : reddysameera/Instagram

తెల్లగా కనిపించాలని ఒత్తిడి

ఒకప్పుడు తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్న అందాల తార స‌మీరా రెడ్డి త‌న కెరీర్‌లో ఎదురైన అనుభవాలను తాజాగా పంచుకున్నారు. ఇండస్ట్రీలో ఎదురైన ఒత్తిడులు, బాడీ షేమింగ్, కలర్ డిస్క్రిమినేషన్ వంటి విషయాలను బహిరంగంగా వెల్ల‌డించారు. ఈ విష‌య‌మై ఆమె మాట్లాడుతూ.. సినిమా పరిశ్రమలో “ఫెయిర్ స్కిన్” పట్ల ఉన్న మోజు తనను చాలా ఇబ్బంది పెట్టింద‌ని అన్నారు. సహజంగా ఉన్న రంగు సరిపోదని, ఇంకా తెల్లగా కనిపించాలని మేకప్ ఆర్టిస్టులు ఒత్తిడి చేసేవారన్నారు. ముఖానికి మాత్రమే కాకుండా కెమెరాలో కనిపించే శరీర భాగాలన్నింటికీ మేకప్ వేయాలని చెప్పేవారని గుర్తు చేసుకున్నారు. ఈ పరిస్థితులు తనలో ఒక సమయంలో ఆత్మన్యూనత భావనను కూడా కలిగించాయని ఆమె వాపోయారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
శరీరాకృతి గురించే చర్చ
Image Credit : Instagram

శరీరాకృతి గురించే చర్చ

హీరోయిన్ల విషయంలో ప్రతిభ కంటే రూపురేఖలపైనే ఎక్కువ చర్చ జరుగుతుందని సమీరా పేర్కొన్నారు. ఇండస్ట్రీలో ఉన్నంత కాలం తన నటన గురించి కాకుండా బాడీ సైజ్ గురించే ఎక్కువగా మాట్లాడేవారని చెప్పారు. తాను పొడవుగా ఉండడం వల్ల వయసులో పెద్ద‌దానిలో క‌నిపిస్తున్నానంటూ.. కొందరు కామెంట్లు చేసేవారని స‌మీరా చెప్పుకొచ్చారు. ఆ వ్యాఖ్యలు తన మనసుపై ప్రభావం చూపాయని ఆవేదన వ్య‌క్తం చేశారు.

Related Articles

Related image1
ఆశగా తిందామని మ‌ట‌న్ బిర్యాని ఆర్డ‌ర్ పెట్టాడు.. క‌వ‌ర్ ఓపెన్ చేసి చూడ‌గా కుక్క కాలు.? షాకింగ్ వీడియో
Related image2
వేణు స్వామికి తాతలా ఉన్నాడుగా.. గ్యాస్ కొరత గురించి 6 నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు
35
త‌ల్లి అయిన తర్వాత ఎదురైన బాడీ షేమింగ్
Image Credit : Instagram

త‌ల్లి అయిన తర్వాత ఎదురైన బాడీ షేమింగ్

2014లో వ్యాపారవేత్తను వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమైన సమీరా, కుటుంబ జీవితం వైపు దృష్టి పెట్టారు. పిల్లలు పుట్టిన తర్వాత తన శరీరంలో సహజంగా మార్పులు వచ్చాయని ఆమె తెలిపారు. బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన త‌ర్వాత బరువు పెరిగినప్పుడు సోషల్ మీడియాలో విమర్శలు ఎదురయ్యాయని అన్నారు. ఆ సమయంలో వచ్చిన నెగిటివ్ కామెంట్లు తన ఆత్మవిశ్వాసాన్ని తీవ్రంగా దెబ్బతీశాయని ఆమె పేర్కొన్నారు.

 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sameera Reddy (@reddysameera)

45
రెండోసారి తల్లి అయిన తర్వాత మారిన ఆలోచన
Image Credit : Instagram

రెండోసారి తల్లి అయిన తర్వాత మారిన ఆలోచన

తన జీవితంలో కీలకమైన మలుపు రెండోసారి తల్లి అయిన తర్వాతే వచ్చిందని సమీరా అన్నారు. అప్పటి నుంచి తాను తనపై ఉన్న అభిప్రాయాన్ని పూర్తిగా మార్చుకున్నానని తెలిపారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరైనా విమర్శలు చేసినా వాటిని పెద్దగా పట్టించుకోనని, నెగిటివ్ కామెంట్లకు స్పందించకుండా న్యూట్రల్‌గా ఉండటాన్ని నేర్చుకున్నానని చెప్పుకొచ్చారు.

 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sameera Reddy (@reddysameera)

55
తెలుగు సినిమాలతో వచ్చిన గుర్తింపు
Image Credit : Social Media

తెలుగు సినిమాలతో వచ్చిన గుర్తింపు

తెలుగులో సమీరా చేసిన సినిమాలు చాలా తక్కువ అయినప్పటికీ మంచి గుర్తింపు తెచ్చాయి. న‌ర్సింహానాయుడు, అశోక్‌, జై చివ‌రంజీవ వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న ఆమె, సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ తన కుటుంబ జీవితం, వ్యక్తిగత అనుభవాలను అభిమానులతో ఎప్ప‌టిక‌ప్పుడు పంచుకుంటున్నారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan Kalyan Net Worth: మెగా హీరో, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆస్తి ఎంతో తెలుసా? పవర్ స్టార్ రెమ్యునరేషన్ ఎంతంటే?
Recommended image2
Jabardasth: సుధీర్ మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడు.. బోరున ఏడ్చిన రష్మీ గౌతమ్.. జబర్దస్త్ లో ఎమోషనల్ సీన్..
Recommended image3
OTT Horror Movie: ఆ రోడ్డులో వెళ్తే మాయం.. ప్రయాణికులను భయపెడుతున్న దెయ్యం సినిమా
Related Stories
Recommended image1
ఆశగా తిందామని మ‌ట‌న్ బిర్యాని ఆర్డ‌ర్ పెట్టాడు.. క‌వ‌ర్ ఓపెన్ చేసి చూడ‌గా కుక్క కాలు.? షాకింగ్ వీడియో
Recommended image2
వేణు స్వామికి తాతలా ఉన్నాడుగా.. గ్యాస్ కొరత గురించి 6 నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved