MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Maheshbabu ని రెండు సార్లు రిజెక్ట్ చేసిన స్టార్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా? మహేష్‌ అభిమానులకు తీరని కోరికే

Maheshbabu ని రెండు సార్లు రిజెక్ట్ చేసిన స్టార్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా? మహేష్‌ అభిమానులకు తీరని కోరికే

మహేష్‌ బాబు చాలా మంది హీరోయిన్లతో నటించారు. కానీ ఓ స్టార్‌ హీరోయిన్‌ మాత్రం ఆయన్ని రిజెక్ట్ చేసింది. ఒక్కసారి కాదు, ఏకంగా రెండు సార్లు నో చెప్పిందట. దీంతో ఒక అరుదైన జోడి వెండితెరపై మిస్‌ అయ్యిందని చెప్పొచ్చు. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Feb 14 2026, 04:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
`వారణాసి`తో బిజీగా ఉన్న మహేష్‌ బాబు
Image Credit : youtube/@ColliderInterviews

`వారణాసి`తో బిజీగా ఉన్న మహేష్‌ బాబు

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ప్రస్తుతం గ్లోబల్‌ ఫిల్మ్ చేస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో ఆయన `వారణాసి` చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. మహేష్‌, రాజమౌళి కాంబినేషన్‌లో మొదటిసారి ఈ మూవీ తెరకెక్కుతుంది. గ్లోబల్‌ ఆడియెన్స్ ని టార్గెట్‌ చేస్తూ ఈ సినిమాని రూపొందిస్తున్నారు రాజమౌళి. ఇందులో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, ప్రకాష్‌ రాజ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇదిప్పుడు చిత్రీకరణ దశలో ఉంది. సుమారు రూ.1300-1400కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీ రూపొందుతుంది.

25
మహేష్‌ బాబుని రెండుసార్లు రిజెక్ట్ చేసిన హీరోయిన్‌
Image Credit : facebook.com/urstrulyMahesh/

మహేష్‌ బాబుని రెండుసార్లు రిజెక్ట్ చేసిన హీరోయిన్‌

ఇదిలా ఉంటే మహేష్‌ బాబుతో సినిమా అంటే ఏ హీరోయిన్‌ నో చెప్పరు. ఇంకా ఎగిరి గంతేస్తారు. చాలా మంది హీరోయిన్లు ఆయనతో సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ ఓ హీరోయిన్‌ మాత్రం మహేష్‌ తో సినిమా చేయడానికి నో చెప్పిందట. ఒక్కసారి కాదు, రెండు సార్లు ఇదే జరిగింది. మొదటసారి తనకంటే చిన్న వాడుగా ఉన్నాడని, రెండోసారి అక్కగా నటించనని. ఇలా రెండు సార్లు మహేష్‌ బాబుకి చేదు అనుభవం ఎదురయ్యింది.

Related Articles

Related image1
Couple Friendly Movie Review: కపుల్‌ ఫ్రెండ్లీ మూవీ రివ్యూ, రేటింగ్‌.. ప్రేమికులకు పర్‌ఫెక్ట్ ఛాయిస్‌
Related image2
Barabar Premistha Collections: బరాబర్‌ ప్రేమిస్తా మూవీ ఫైనల్‌ కలెక్షన్లు.. చంద్రహాస్‌ సినిమాకి ఊహించని వసూళ్లు
35
మహేష్‌ బాబుని రిజెక్ట్ చేసిన హీరోయిన సౌందర్యనే
Image Credit : MAA TV

మహేష్‌ బాబుని రిజెక్ట్ చేసిన హీరోయిన సౌందర్యనే

మరి ఇంతకి మహేష్‌ బాబుని రెండు సార్లు రిజెక్ట్ చేసిన హీరోయిన్‌ ఎవరనేది చూస్తే, ఆమె ఎవరో కాదు సౌందర్య. ఒకప్పుడు సహజ నటిగా పేరుతెచ్చుకుంది. అద్భుతమైన నటిగా రాణించింది. స్టార్‌ హీరోలందరితోనూ సినిమాలు చేసి మెప్పించింది. తిరుగులేని స్టార్‌ హీరోయిన్‌గా నటించింది. ఈ క్రమంలో మహేష్‌ బాబు హీరోగా `యువరాజు` అనే సినిమాని రూపొందిస్తున్నారు. ఈ మూవీకి మొదట హీరోయిన్‌గా సౌందర్యనే ఎంపిక చేశారు. ఆ సమయంలో ఫోటో షూట్‌ చేయగా,  సౌందర్య ముందు మహేష్‌ చిన్నగా కనిపిస్తున్నాడట. సౌందర్యకి తమ్ముడిలా ఉన్నాడట. దీంతో ఈ సినిమా చేసేందుకు సౌందర్యనే నో చెప్పిందట. అలా సౌందర్యతో కలిసి నటించే అవకాశాన్ని మహేష్‌ బాబు కోల్పోయాడు. ఆ తర్వాత సిమ్రాన్‌ ని హీరోయిన్‌గా ఎంపిక చేశారు.

45
అక్కగా నటించేందుకు నో చెప్పింది సౌందర్య
Image Credit : MAA TV

అక్కగా నటించేందుకు నో చెప్పింది సౌందర్య

మరోసారి ఇలాంటి అనుభవమే ఎదురయ్యింది. `అర్జున్‌` మూవీ విషయంలో కూడా ఇదే జరిగింది. గుణ శేఖర్‌ దర్శకత్వంలో `అర్జున్‌` మూవీ రూపొందింది. ఇందులో మహేష్‌ బాబుకి జోడీగా శ్రియా  నటించింది. ఆయనకు అక్క పాత్రలో కీర్తి రెడ్డి నటించింది. అయితే ముందుగా ఆ పాత్ర కోసం సౌందర్యనే అడిగారట. అప్పుడు కూడా తాను మహేష్‌ కి అక్కగా చేయనని చెప్పిందట. ఇలా రెండు సార్లు మహేష్‌ బాబుని రిజెక్ట్ చేసింది సౌందర్య. మొత్తంగా ఈ అరుదైన కాంబినేషన్‌ సెట్‌ కాకుండానే పోయింది. అదే ఏడాది సౌందర్య ప్రమాదంలో కన్నుమూసిన విషయం తెలిసిందే.

55
వచ్చే ఏడాది `వారణాసి`
Image Credit : Mahesh Babu\Twitter

వచ్చే ఏడాది `వారణాసి`

సౌందర్య, మహేష్‌ బాబు కలిసి నటిస్తే అదొక అద్బుతమైన జోడీగా నిలిచిపోయేది. అభిమానులు పండగ చేసుకునేవారు. ఎంతో మంది అభిమానుల కోరిక కూడా. కానీ అది నెరవేరకుండానే సౌందర్య చనిపోవడం బాధాకరం. ఇక మహేష్‌ బాబు నటిస్తున్న `వారణాసి` మూవీ ఇప్పుడు శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. మైథలాజికల్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌గా రూపొందిస్తున్నారు. టైమ్‌ ట్రావెల్‌ కథతో సాగుతుందని రాజమౌళి తెలిపిన విషయం తెలిసిందే. ఈ మూవీని వచ్చే ఏడాది ఏప్రిల్‌ 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
మహేష్ బాబు ఘట్టమనేని
సౌందర్య
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
పుష్ప, కాంతార, బాహుబలి... ఇండియన్ సినిమాను ఏలుతున్న 6 ఫ్రాంచైజీలు, టాలీవుడ్ హీరోలదే హవా..
Recommended image2
సమంత రాజ్ తో పాటు పెళ్లి తర్వాత ఫస్ట్ వాలెంటైన్స్ డే.. ఈ 6 సినిమా జంటలు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాయంటే?
Recommended image3
రష్మిక మందన్న - విజయ్ దేవరకొండ పెళ్లికి 100 కోట్ల ఓటీటీ ఆఫర్‌? రౌడీ కపుల్ నిర్ణయం ఏంటో తెలుసా? షాక్ అవుతారు
Related Stories
Recommended image1
Couple Friendly Movie Review: కపుల్‌ ఫ్రెండ్లీ మూవీ రివ్యూ, రేటింగ్‌.. ప్రేమికులకు పర్‌ఫెక్ట్ ఛాయిస్‌
Recommended image2
Barabar Premistha Collections: బరాబర్‌ ప్రేమిస్తా మూవీ ఫైనల్‌ కలెక్షన్లు.. చంద్రహాస్‌ సినిమాకి ఊహించని వసూళ్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved