MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • Couple Friendly Movie Review: కపుల్‌ ఫ్రెండ్లీ మూవీ రివ్యూ, రేటింగ్‌.. ప్రేమికులకు పర్‌ఫెక్ట్ ఛాయిస్‌

Couple Friendly Movie Review: కపుల్‌ ఫ్రెండ్లీ మూవీ రివ్యూ, రేటింగ్‌.. ప్రేమికులకు పర్‌ఫెక్ట్ ఛాయిస్‌

సంతోష్‌ శోభన్‌, మాజీ మిస్‌ ఇండియా మానస వారణాసి హీరోహీరోయిన్లుగా నటించిన `కపుల్‌ ఫ్రెండ్లీ` మూవీ ఈ శనివారం విడుదలయ్యింది. మరి చెన్నై లవ్‌ స్టోరీ ఆకట్టుకుందా? సినిమా ఎలా ఉందనేది చూస్తే.   

5 Min read
Author : Aithagoni Raju
Published : Feb 14 2026, 10:01 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
కపుల్‌ ఫ్రెండ్లీ మూవీ రివ్యూ
Image Credit : Asianet News

కపుల్‌ ఫ్రెండ్లీ మూవీ రివ్యూ

సంతోష్‌ శోభన్‌కి చాలా కాలంగా హిట్స్ లేవు. దీంతో కొంత గ్యాప్‌ తీసుకుని ఇప్పుడు `కపుల్‌ ఫ్రెండ్లీ` చిత్రంలో నటించారు. ఇందులో మానస వారణాసి హీరోయిన్‌ చేసింది. అజయ్‌ చంద్రశేఖర్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీని యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ నిర్మించింది. అజయ్ కుమార్ రాజు.పి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు తమిళంలోనూ ప్రేమికుల రోజు సందర్భంగా శనివారం(ఫిబ్రవరి 14)న విడుదల చేశారు. చెన్నై బేస్డ్ గా రూపొందిన ఈ ఇంటెన్స్ లవ్‌ స్టోరీ ఆకట్టుకుందా? సక్సెస్‌ కోసం వెయిట్‌ చేస్తున్న సంతోష్‌ శోభన్‌కి, మానస వారణాసికి హిట్ ఇచ్చిందా అనేది రివ్యూలో తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
కపుల్‌ ఫ్రెండ్లీ మూవీ కథ ఏంటంటే?
Image Credit : Asianet News

కపుల్‌ ఫ్రెండ్లీ మూవీ కథ ఏంటంటే?

శివ (సంతోష్‌ శోభన్‌) ఇంటీరియర్‌ డిజైనర్‌ కోర్స్ చేస్తాడు. కానీ జాబ్‌ లేదు. పెళ్లీడు వచ్చినా ఇంకా తన డబ్బుల మీదనే ఆధారపడుతున్నాడని తండ్రి రోజూ తిడుతుంటాడు. దీంతో ఆ టార్చర్‌ భరించలేక నెల్లూరు నుంచి చెన్నై వెళ్లిపోతాడు. అక్కడ జాబ్‌ కోసం ప్రయత్నాలు చేస్తుంటాడు. చెన్నైలోనే మిత్ర(మానస వారణాసి) ఐటీ జాబ్‌ కోసం వెతుకుతుంది. ఆమెది చిత్తూరు. పెళ్లి చూపుల కోసం ఇంట్లో నుంచి పిలుపు మేరకు ఆమె ఊరు వెళ్లాలనుకుంటుంది. శివ డబ్బుల కోసం ర్యాపిడో నడిపిస్తుంటాడు. ఆ టైమ్‌లో శివ ఆమెని తీసుకెళ్లాల్సి వస్తుంది. మిత్రని బస్టాండ్‌ వద్ద డ్రాప్‌ చేస్తాడు. కానీ ఆమెకి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. దీంతో మనసు మార్చుకుని మళ్లీ తన హాస్టల్‌ కి రావాలనుకుంటుంది. అందుకు శివకి ఫోన్‌ చేస్తుంది. శివ ఆమెని హాస్టల్‌లో డ్రాప్‌ చేస్తాడు. కానీ తన హాస్టల్‌లో రూమ్‌ ఫిల్‌ అయిపోతుంది. దీంతో శివ సహాయంతో ఆ రోజంతా హాస్టల్‌ కోసం వెతకగా ఒక్కటి కూడా దొరకదు. దీంతో తన రూమ్‌లో ఉండమని చెబుతాడు శివ. మొదట నో చెప్పినా, తర్వాత ఓకే అంటుంది. ఇద్దరు కలిసి ఒకే రూమ్‌లో ఉంటారు. ఈ క్రమంలో శివ పడే కష్టం స్వయంగా చూస్తుంది మిత్ర. ఆయనపై మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. తన ఇంటీరియర్‌ డిజైనింగ్‌ జాబ్‌ కోసం హెల్ప్ చేస్తుంది. దీంతో ఆయనకు ప్రాజెక్ట్ లు రావడం స్టార్ట్ అవుతాయి. నెమ్మదిగా ఇద్దరు కలిసి పనిచేస్తుంటారు. అయినా తన జాబ్‌ ప్రయత్నాలు వదలేయదు మిత్ర. ఈ క్రమంలో ఇద్దరు ప్రేమ పడతారు. అందులో చాలా దూరం వెళ్తారు. అలాంటి పరిస్థితుల్లో మిత్ర మరో అబ్బాయిని చేసుకోవడానికి ఎందుకు రెడీ అయ్యింది? శివ చేసిన మిస్టేక్‌ ఏంటి? శివ, మిత్ర వారి పేరెంట్స్ కి ఎలా దొరికిపోయారు? మిత్ర కి వచ్చిన ఆరోగ్య సమస్య ఏంటి? చివరికి శివ, మిత్ర ప్రేమ కథ సుఖాంతమా? విషాదమా ? అనేది మిగిలిన కథ.

36
కపుల్‌ ఫ్రెండ్లీ మూవీ విశ్లేషణ
Image Credit : Asianet News

కపుల్‌ ఫ్రెండ్లీ మూవీ విశ్లేషణ

ఇంటెన్స్ రొమాంటిక్‌ లవ్‌ స్టోరీస్‌ ఇప్పుడు చాలా అరుదుగా వస్తున్నాయి. ఒకప్పుడు చాలా వచ్చేవి, కానీ ఇప్పుడు తగ్గిపోయాయి. వాటికి అంతగా ఆదరణ దక్కడం లేదు. దీంతో బోల్డ్ లవ్‌ స్టోరీస్‌కే ప్రయారిటీ ఇస్తున్నారు మేరక్స్. ఇలాంటి టైమ్‌ లో ఒక జెన్యూన్‌ లవ్‌ స్టోరీతో రూపొందిన చిత్రం `కపుల్‌ ఫ్రెండ్లీ`. ఇంట్రెన్స్, డ్రామా, రొమాంటిక్‌ లవ్‌ స్టోరీ చిత్రమిది. చాలా సహజంగా, కొత్తగా ఉంటుంది. ఆద్యంతం ఎంగేజింగ్‌గా సాగుతుంది. సినిమా ప్రారంభమే సహజమైన సన్నివేశాలతో స్టార్ట్ అవుతుంది. ఎదిగిన కొడుకు జాబ్‌ లేక గాలిగా తిరుగుతున్నాడని ఇంట్లో నాన్నతిట్టడం అందరి ఇళ్లల్లోనూ జరిగేదే. దీంతో ఆ బాధ భరించలేక హీరో చెన్నై వెళ్లిపోవడం అక్కడ జాబ్‌ కోసం అన్ని ప్రయత్నాలు చేయడం, అలసిపోవడం, డబ్బుల కోసం ర్యాపిడో నడిపించడం చాలా రియాలిటీగా ఉంటుంది. హీరోయిన్‌ ని బైక్‌ పై ఎక్కించుకుని రోజంతా హాస్టల్ కోసం తిరగడం వంటి సీన్లు ఆసక్తికరంగా సాగుతాయి. ఈ క్రమంలో హీరో ఆమెని తన రూమ్‌ కి రమ్మనడం, కొంత డ్రామా తర్వాత ఆమెకూడా రావడం, రూమ్‌లో వీరి మధ్య జరిగే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఆ తర్వాత నెమ్మదిగా ఇద్దరి మధ్య ఎఫెక్షన్‌ స్టార్ట్ అవుతుంది. అది ప్రేమగా మారుతుంది. ఓ వర్షం కురిసిన రాత్రి ఇద్దరు తమ భావాలను కంట్రోల్‌ చేసుకోలేకపోవడం ప్రేమలోని పీక్‌ స్టేజ్‌ని ప్రతిబింబిస్తుంది. ఆడియెన్స్ మనసు కూడా అందులో లీనమైపోతుంది. ఆ తర్వాత సన్నివేశాల కోసం వెయిట్‌ చేయగా, అది బ్రేక్‌ అవుతుంది. అటు హీరోహీరోయిన్లు బాధపడినట్టుగానే ఆడియెన్స్ కూడా బాధపడాల్సి వస్తుంది. అలా ఇద్దరు ప్రేమలో జర్నీ చేసిన తీరు బాగుంటుంది. ప్రేమ కథకి ఎక్కడో చోట బ్రేక్‌ పడుతుంది. ఇందులోనూ అదే జరిగింది. కానీ వెంటనే అది సెట్‌ అవుతుంది. ఇంటర్వెల్‌ అది క్యూరియాసిటీని క్రియేట్‌ చేస్తుంది. సెకండాఫ్‌ ప్రేమలోని ఇంటెన్సిటి మరింత పెరుగుతుంది. కానీ అది సీరియస్‌ వైపు తిరుగుతుంది. ఇద్దరు అడ్డంగా పేరెంట్స్ కి దొరికిపోవడంతో కథ ఫ్యామిలీ వైపు టర్న్ తీసుకుంటుంది. అది కామెడీగా ఉంటుంది. అటు హీరో వదిన ప్రెగ్నెన్సీ కోసం ఇబ్బంది పడటం, ఇటు హీరోయిన్‌ ని వారి పేరెంట్స్ మరో అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలనుకోవడం వంటి సన్నివేశాలు ఈ క్రమంలో చోటు చేసుకునే డ్రామా ఎంగేజింగ్‌గా సాగుతుంది. ఏం జరగబోతుందనే క్యూరియాసిటీని క్రియేట్‌ చేస్తుంది. కానీ అంతలోనే ట్విస్ట్. సినిమా సీరియస్‌గా మారిపోతుంది. ఎమోషనల్‌ సైడ్‌ వెళ్తుంది. హీరోయిన్‌కి ఆరోగ్య సమస్య అందరిని షాక్‌ కి గురి చేస్తుంది. క్లైమాక్స్ మాత్రం గుండెని బరువెక్కిస్తుంది.

46
కపుల్‌ ఫ్రెండ్లీ మూవీలో ప్లస్‌, మైనస్‌లు
Image Credit : Asianet News

కపుల్‌ ఫ్రెండ్లీ మూవీలో ప్లస్‌, మైనస్‌లు

సినిమాలో లవ్‌, ఇంటెన్సిటీ, రొమాన్స్ అదిరిపోయింది. మధ్య మధ్యలో కామెడీ సీన్లు కూడా బాగున్నాయి. లవ్‌ స్టోరీలో ఓ కొత్తదనం కనిపిస్తుంది. రియాలిటీ ఉంటుంది. అది ఆద్యంతం కట్టిపడేస్తుంది. రొమాన్స్ ని కూడా చాలా బాగా చూపించారు. హీరోహీరోయిన్లు అంతే బాగా చేశారు. లవర్స్ గా సహజంగా చేసి వాహ్‌ అనిపించారు. విజువల్స్ బాగున్నాయి. మ్యూజిక్‌ అదిరిపోయింది. ఫస్టాఫ్‌ ఆద్యంతం కట్టిపడేస్తుంది. సెకండాఫ్‌  ఎమోషనల్‌గా ఉంటుంది. సినిమా ఒక జెన్యూన్‌గా చేసిన ప్రయత్నంగా చెప్పొచ్చు. రియల్‌ లోకేషన్‌లో చిత్రీకరించడం బాగుంది. అది సినిమాకి మరింత సహజత్వాన్ని యాడ్‌ చేసింది.

అయితే ఇందులో మైనస్ లు చూస్తే సినిమా చాలా స్లోగా సాగుతుంది. ఇలాంటి ప్రేమ కథలు స్లోగానే ఉంటాయి. కథని, పాత్రలను ఎస్టాబ్లిష్‌ చేయడానికి చాలా టైమ్‌ తీసుకున్నారు. మూవీ కూడా స్లోగా సాగుతుంది. ఎంతసేపు అక్కడే ఉన్న ఫీలింగ్‌ ఉంటుంది. అవే సన్నివేశాలు రిపీట్‌ అవుతుంటాయి. నాన్‌ లీనియర్‌ స్క్రీన్‌ ప్లే బాగుంది. కానీ చివరలో లాజిక్‌ లెస్‌గా మారింది. ప్రారంభంలో చూపించిన దానికి, దాని కన్‌ క్లూజన్‌కి సంబంధం లేదు. మరోవైపు వర్షం సీన్‌లో ముద్దుపెట్టుకున్న తర్వాత వచ్చే సన్నివేశాలు డిజప్పాయింట్‌గా ఉంటాయి. అక్కడ ఫీలింగ్స్ కే ప్రయారిటీ ఇవ్వాల్సింది. మరోవైపు క్లైమాక్స్ ఎమోషనల్‌గా చూపించడం ఓకే, కానీ దాని ముగింపు మాత్రం డిస్‌ కనెక్ట్ చేస్తుంది. అక్కడ మరో ఛాయిస్‌ తీసుకోవాల్సింది. సినిమాలో కొంత తమిళ ఫ్లేవర్‌ కనిపించింది.

56
కపుల్‌ ఫ్రెండ్లీ మూవీలో నటీనటుల పర్‌ఫెర్మెన్స్
Image Credit : Asianet News

కపుల్‌ ఫ్రెండ్లీ మూవీలో నటీనటుల పర్‌ఫెర్మెన్స్

శివ పాత్రలో సంతోష్‌ శోభన్‌ చాలా బాగా నటించాడు. సెటిల్డ్ గా చేసి మెప్పించాడు. ఆయన నటనలో చాలా మార్పు కనిపిస్తుంది. మెచ్యూరిటీ కనిపిస్తుంది. విభిన్నమైన భావోద్వేగాలను చాలా బాగా పలికించారు. చాలా చోట్ల వాహ్‌ అనిపిస్తాడు. సింపుల్‌గా చెప్పాలంటే పాత్రలో జీవించాడు. ఇక మిత్రగా మానస వారణాసి సైతం ఇరగదీసింది. చాలా సహజంగా చేసింది. ఇద్దరు కలిసి రియల్‌ లైఫ్‌ని చూపించారని చెప్పొచ్చు. ఈ మూవీతో మానస కుర్రాళ్ల క్రష్ అయిపోతుందని చెప్పొచ్చు. మిత్ర తండ్రిగా రాజీవ్‌ కనకాల అదరగొట్టాడు. యోగిబాబు కామెడీ నవ్విస్తుంది. ఇక మిగిలిన పాత్రధారులు బాగానే మెప్పించారు. హీరోహీరోయిన్ల పాత్రల ముందు మిగిలిన పాత్రలు పెద్దగా కనిపించవని చెప్పొచ్చు.

66
కపుల్‌ ఫ్రెండ్లీ మూవీ టెక్నీకల్‌గా ఎలా ఉందంటే?
Image Credit : Asianet News

కపుల్‌ ఫ్రెండ్లీ మూవీ టెక్నీకల్‌గా ఎలా ఉందంటే?

ఆదిత్య రవీంద్రన సంగీతం అదిరిపోయింది. ఒక ఫ్రెష్‌ ఫీలింగ్‌ని తెప్పించింది. కథలో భాగంగా సాగే పాటలు ఆద్యంతం ఆకట్టుకుంటాయి. సన్నివేశాలను బాగా ఎలివేట్‌ చేశాయి. బాగా పండేలా చేశాయి. అలాగే దినేష్‌ పురుషోత్తమన్‌ విజువల్స్ మూవీకి మరో అసెట్‌గా చెప్పొచ్చు. చాలా కూల్‌గా, ఫ్రెష్‌ ఫీలింగ్‌ని తెప్పించాయి. కనువిందుగా ఉన్నాయి. గణేష్‌ శివ ఎడిటింగ్‌ బాగుంది. సినిమా ఎక్కడా డిస్టర్బెన్స్ లేదు. సాఫీగా సాగిపోయింది. నిర్మాణ విలువలకు కొదవలేదు. దర్శకుడు అశ్విన్‌ చంద్రశేఖర్‌ ఎంచుకున్న కథ అదిరిపోయింది. కొత్తగా ఉంది. దాన్ని అంతే బాగా తెరపై ఆవిష్కరించారు. కొన్ని లాజిక్స్ మిస్ అయ్యాడు. కాకపోతే రియాలిటీకి దగ్గరగా చూపించిన తీరు బాగుంది. ఎమోషన్స్ ని బాగా పట్టుకున్నారు.  స్లోగా నడిపించడం మైనస్‌గా మారింది. సెకండాఫ్‌ని మరింత బాగా డీల్‌ చేయాల్సింది. ఆరోగ్య సమస్యలు, ఆడవారి సమస్యలు గురించి చెప్పి కొంత డైవర్ట్ చేసినట్టుగా ఉంటుంది. క్లైమాక్స్ ఇంకా బాగా వర్క్ చేస్తే సినిమా మరింత బాగుండేది.

ఫైనల్‌గా: 

ఆద్యంతం ఇంటెన్సిటీతో, రొమాంటిక్‌గా సాగే సరికొత్త ప్రేమ కథ `కపుల్‌ ఫ్రెండ్లీ`. ఈ వాలెంటైన్స్ డేకి పర్‌ఫెక్ట్ ఛాయిస్‌. లవర్స్ కి మాత్రం పండగే. 

రేటింగ్‌: 3

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
సినిమా సమీక్షలు
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Pithapuramlo Ala Modalaindi Review: పిఠాపురంలో అలా మొదలైంది మూవీ రివ్యూ.. కూతురిని ఎలా పెంచాలంటే?
Recommended image2
Secret Soldier Movie Review: సీక్రెట్‌ సోల్జర్‌ మూవీ రివ్యూ.. స్నేహం, స్పై యాక్షన్‌ మేళవించిన మూవీ ఎలా ఉందంటే?
Recommended image3
Missing Meghana Review: మిస్సింగ్‌ మేఘన మూవీ రివ్యూ.. రామ్‌ కార్తీక్‌, అంకిత్‌ కొయ్య థ్రిల్లర్‌ ఎలా ఉందంటే?
Related Stories
Recommended image1
Funky Review: `ఫంకీ` మూవీ రివ్యూ, రేటింగ్‌.. విశ్వక్‌ సేన్‌, అనుదీప్‌ల కామెడీ సినిమా నవ్వించిందా?
Recommended image2
Nilave Review: `నిలవే` మూవీ రివ్యూ.. ఇంటెన్స్ లవ్‌ స్టోరీ ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved