MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Barabar Premistha Collections: బరాబర్‌ ప్రేమిస్తా మూవీ ఫైనల్‌ కలెక్షన్లు.. చంద్రహాస్‌ సినిమాకి ఊహించని వసూళ్లు

Barabar Premistha Collections: బరాబర్‌ ప్రేమిస్తా మూవీ ఫైనల్‌ కలెక్షన్లు.. చంద్రహాస్‌ సినిమాకి ఊహించని వసూళ్లు

యాటిట్యూడ్‌ స్టార్‌ చంద్రహాస్‌ హీరోగా నటించిన `బరాబర్‌ ప్రేమిస్తా` మూవీ గత వారం ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ఈ రోజుతో ఈ సినిమా థియేటర్లలో క్లోజ్‌ అయ్యింది. మరి ఇప్పటి వరకు ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేసిందంటే? 

2 Min read
Author : Aithagoni Raju
Published : Feb 13 2026, 05:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
బరాబర్‌ ప్రేమిస్తా కి ఊహించిన కలెక్షన్లు
Image Credit : Asianet News

బరాబర్‌ ప్రేమిస్తా కి ఊహించిన కలెక్షన్లు

యాటిట్యూడ్‌ స్టార్‌ చంద్రహాస్‌ హీరోగా నటించిన మూవీ `బరాబర్‌ ప్రేమిస్తా`. అనేక వివాదాల మధ్య ఈ మూవీ గత శుక్రవారం విడుదలైంది. ఇందులో మేఘనా ముఖర్జీ హీరోయిన్‌గా నటించగా, మురళీధర్‌ గౌడ్‌, అభయ్‌ నవీన్‌, లక్ష్మణ్‌ కీలక పాత్రలు పోషించారు. సంపత్‌ రుద్ర దర్శకత్వం వహించారు. కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సిసి క్రియేషన్స్, ఎవిఆర్ మూవీ వండర్స్ బ్యానర్లపై గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్ ఈ మూవీని నిర్మించారు. ఆద్యంతం లవ్‌ అండ్‌ ఫన్‌ ఎంటర్‌టైనర్‌గా సాగే ఈ మూవీలో కులానికి సంబంధించి అందించిన సందేశం బాగుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
బెడిసికొట్టిన వివాదం
Image Credit : Asianet News

బెడిసికొట్టిన వివాదం

గత శుక్రవారం విడుదలైన ఈ మూవీకి ఆడియెన్స్ నుంచి పెద్దగా రెస్పాన్స్ లేదు. మూవీ కూడా పెద్దగా ఆకట్టుకునేలా లేదు. కానీ కులానికి సంబంధించి అందించిన సామాజిక సందేశం బాగుంది. కానీ వివాదం సినిమాకి పెద్ద మైనస్‌గా మారింది. ఆడియెన్స్ కి చేరువ కాలేదు. ఈ వివాదం వల్ల సినిమాకి వెళ్లాలనుకున్న వాళ్లు కూడా వెనక్కి తగ్గే పరిస్థితి. ఇటీవల కాలంలో సినిమా జనంలోకి వెళ్లడానికి వివాదం చేస్తుంటారు. దాని వల్ల బాగా ప్రమోషన్‌ జరుగుతుందని భావిస్తుంటారు. కానీ `బరాబర్‌ ప్రేమిస్తా` మూవీకి మాత్రం రివర్స్ అయ్యింది. చాలా ప్రభావం పడింది. దీంతో మూవీని పట్టించుకునే వాళ్లే లేరు.

34
బరాబర్‌ ప్రేమిస్తా మూవీ ఫైనల్‌ కలెక్షన్లు
Image Credit : Asianet News

బరాబర్‌ ప్రేమిస్తా మూవీ ఫైనల్‌ కలెక్షన్లు

ఇక సినిమా విడుదలై వారం రోజులు పూర్తి చేసుకుంది. మరి ఇప్పటి వరకు ఈచిత్రానికి ఎంత కలెక్షన్లు వచ్చాయి? బ్రేక్‌ ఈవెన్‌ అయ్యిందా? నిర్మాతలు సేఫా? నష్టపోయారా? అనేది చూస్తే, ఈ మూవీ మొదటి రోజు రూ.31లక్షలు వసూలు చేసింది. రెండో రోజు  రూ.22లక్షలు వచ్చింది. మూడో రోజు రూ.14 లక్షలు రాబట్టింది. వీకెండ్‌లో ఈ మూవీకి దాదాపు రూ.67లక్షలు రాబట్టింది. ఇక వీక్‌ డేస్‌లో దారుణంగా పడిపోయింది. సోమవారం రూ.10లక్షలు, మంగళవారం రూ.7లక్షలు, బుధవారం ఐదు లక్షలు, గురువారం రూ.4లక్షలు వచ్చాయి.

44
బరాబర్‌ ప్రేమిస్తా మూవీ నేటితో బాక్సాఫీసు క్లోజ్‌
Image Credit : Asianet News

బరాబర్‌ ప్రేమిస్తా మూవీ నేటితో బాక్సాఫీసు క్లోజ్‌

మొత్తంగా వారం రోజుల్లో ఈ మూవీ రూ.79లక్షల నెట్‌, రూ.93లక్షల గ్రాస్‌ రాబట్టింది. డివైడ్‌ టాక్‌ వచ్చిన ఈ రేంజ్‌లో వసూలు చేసిందంటే మామూలు విషయం కాదు. పైగా కొత్తగా వస్తోన్న హీరోకిది మంచి వసూళ్లనే చెప్పొచ్చు. అదే సినిమాని పాజిటివ్‌ వైపు ప్రమోట్‌ చేసి ఉంటే ఈజీగా రెండు కోట్ల వరకు రాబట్టేది. అది నిర్మాతలకు హెల్ప్ అయ్యింది. కానీ నెగటివ్‌ ప్రచారం సినిమాని చంపేశాయి. ఇక ఈ మూవీని సుమారు రూ.4కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు. ఓటీటీ, శాటిలైట్‌ రూపంలో కొంత వస్తుంది. ఇవన్నీ రానూ, నిర్మాతలకు రెండు కోట్లకుపైగానే నష్టం వాటిళ్లే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. యాటిట్యూడ్‌ స్టార్‌ చంద్రహాస్‌ మూవీ ఈ శుక్రవారంతో క్లోజ్‌ అనే చెప్పొచ్చు. కొత్త సినిమాలు వస్తున్న నేపథ్యంలో దీన్ని ఆల్మోస్ట్ అన్ని థియేటర్ల నుంచి ఎత్తేశారని టాక్‌.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: ఝాన్సీ వల్ల బాటమ్ లోకి షాలిని, రోహిత్.. ఇరగదీసిన నరేష్, రామ్ ప్రసాద్
Recommended image2
Ranabaali Trailer: రణబాలి ట్రైలర్ రివ్యూ.. బ్రిటిష్‌పై వీర పోరాటం, విజయ్ దేవరకొండ ఊచకోత చూశారా
Recommended image3
Bollywood Controversies: సల్మాన్-షారుఖ్ నుంచి కంగనా-హృతిక్ వరకు.. స్టార్లను కుదిపేసిన 7 వివాదాలు
Related Stories
Recommended image1
Funky Review: `ఫంకీ` మూవీ రివ్యూ, రేటింగ్‌.. విశ్వక్‌ సేన్‌, అనుదీప్‌ల కామెడీ సినిమా నవ్వించిందా?
Recommended image2
Nilave Review: `నిలవే` మూవీ రివ్యూ.. ఇంటెన్స్ లవ్‌ స్టోరీ ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved