MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మీ తాత మళ్ళీ పుట్టాడు రా.. జూనియర్ ఎన్టీఆర్ నటనకు ఫిదా, సెట్ లో చప్పట్లు కొడుతూ ఉండిపోయిన సీనియర్ నటుడు

మీ తాత మళ్ళీ పుట్టాడు రా.. జూనియర్ ఎన్టీఆర్ నటనకు ఫిదా, సెట్ లో చప్పట్లు కొడుతూ ఉండిపోయిన సీనియర్ నటుడు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటనకు సీనియర్ నటుడు ఫిదా అయ్యారు. ఎన్టీఆర్ డైలాగ్ చెప్పిన తర్వాత సెట్ లో క్లాప్ కొడుతూ ఉండిపోయారట. ఇంతకీ ఆ నటుడు ఎవరు, ఆ సినిమా ఏంటి అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Feb 09 2026, 04:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
జూనియర్ ఎన్టీఆర్ 
Image Credit : Youtube/Sithara Entertainments

జూనియర్ ఎన్టీఆర్ 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న ఉత్తమ నటుల్లో ఒకరు. నటన, డైలాగ్ డెలివరీ, డ్యాన్సులు ఇలా అన్ని విధాలుగా తారక్ కి తిరుగులేదు అనే చెప్పాలి. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
నందమూరి తారక రామారావు పోలికలు 
Image Credit : Youtube/ T-Series Telugu

నందమూరి తారక రామారావు పోలికలు 

ఎన్టీఆర్ తన తొలి చిత్రం నుంచే నటనలో అందరినీ మెస్మరైజ్ చేస్తున్నారు. తారక్ కి సాధారణంగా తన తాత నందమూరి తారక రామారావు పోలికలు ఉంటాయి అని అభిమానులు భావిస్తుంటారు. ఓ సినిమాలో నటిస్తున్నప్పుడు సీనియర్ నటుడు ఒకరు తారక్ నటనకు ఫిదా అయిపోయారు. మీ తాత మళ్ళీ పుట్టాడు రా అని అభినందించారట. ఆ సంఘటన గురించి తెలుసుకునేందుకు వివరాల్లోకి వెళదాం. 

35
రాఖీ మూవీలో డైలాగ్ 
Image Credit : IMDB

రాఖీ మూవీలో డైలాగ్ 

కృష్ణవంశీ తెరకెక్కించిన రాఖీ చిత్రంలో రైల్వే డిపార్ట్మెంట్ గురించి తారక్ ఒక పెద్ద డైలాగ్ చెబుతారు. ఇండియన్ రేల్వేస్ లో ఎంత మంది స్టాఫ్ ఉన్నారు, ట్రైన్స్ ఎన్ని ఉన్నాయి ఇలా ఆపకుండా ఒక భారీ డైలాగ్ రూపంలో తారక్ లెక్కలతో సహా రైల్వే నెట్వర్క్ గురించి చెబుతారు. దాని గురించి నటుడు సమీర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. 

45
మీ తాత మళ్ళీ పుట్టాడు రా 
Image Credit : Facebook/Kota Srinivasa Rao, Balakrishna

మీ తాత మళ్ళీ పుట్టాడు రా 

సమీర్ మాట్లాడుతూ.. కృష్ణ వంశీ గారు నోటికి వచ్చిన నంబర్స్ తో ఆ డైలాగ్ రాయలేదు. రైల్వే డిపార్ట్మెంట్ దగ్గర పక్కాగా లెక్కలు తీసుకుని రాశారు. ఎన్టీఆర్ ఆ డైలాగ్ ని సింగిల్ టేక్ లో కంప్లీట్ చేశారు. ఎన్టీఆర్ ఆ డైలాగ్ చెప్పిన తర్వాత సెట్ లో అందరూ క్లాప్స్ కొట్టారు. కోట శ్రీనివాసరావు గారు అయితే క్లాప్స్ కొడుతూనే ఉన్నారు. మీ తాత మళ్ళీ పుట్టాడురా అని తారక్ ని ప్రశంసలతో ముంచెత్తారు అని సమీర్ తెలిపారు. 

55
మూవీ ఫ్లాప్ 
Image Credit : etv

మూవీ ఫ్లాప్ 

తారక్ ఈ మూవీలో తన పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టినప్పటికీ రాఖీ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఈ మూవీలో ఇలియానా, ఛార్మి హీరోయిన్లుగా నటించారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Udaya Bhanu: 150 ఎకరాలు దానం చేసిన జమీందారు, యాంకర్ ఉదయభాను తండ్రి గురించి మీకు తెలుసా?
Recommended image2
Raviteja: బాలయ్య, రవితేజ కాంబినేషన్‌లో మిస్‌ అయిన మూవీ ఇదే.. పరుచూరి బ్రదర్స్ చేసిన మోసం
Recommended image3
Rakul Preet Singh IT Raid: రకుల్ ప్రీత్ సింగ్, వాసు భగ్నానీ ఇళ్లపై ఐటీ దాడులు.. దృశ్యం 3 నిర్మాణ సంస్థపై కూడా
Related Stories
Recommended image1
OTT Movies: చిరు, నవీన్ పోలిశెట్టి, శివాజీ ఒకేసారి దండయాత్ర..ఈ వారం ఓటీటీలో వినోదాల విందు గ్యారెంటీ
Recommended image2
45 రోజుల్లో 1500 కోట్ల బిజినెస్.. అంచనాలు పెంచేస్తున్న 6 పాన్ ఇండియా సినిమాలు, లిస్ట్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved