MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Naga Chaitanya: తండ్రి రొమాన్స్ చేసిన హీరోయిన్‌పైనే క్రష్‌.. తన ఫస్ట్ క్రష్‌ రివీల్‌ చేసిన నాగచైతన్య

Naga Chaitanya: తండ్రి రొమాన్స్ చేసిన హీరోయిన్‌పైనే క్రష్‌.. తన ఫస్ట్ క్రష్‌ రివీల్‌ చేసిన నాగచైతన్య

నాగచైతన్య తండ్రి నాగార్జునలాగానే రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. అంతేకాదు ఏకంగా తండ్రితో రొమాన్స్ చేసిన హీరోయిన్‌పైనే క్రష్‌ పెంచుకున్నారు. ఆ విషయాన్ని ఓపెన్‌గా చెప్పేశారు. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Feb 09 2026, 01:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రొమాంటిక్‌ హీరోలుగా అక్కినేని స్టార్స్
Image Credit : instagram/@nagachaitanya

రొమాంటిక్‌ హీరోలుగా అక్కినేని స్టార్స్

అక్కినేని హీరోలంటే రొమాన్స్ కి కేరాఫ్‌. మోస్ట్ రొమాంటిక్‌ హీరోలుగా పేరు తెచ్చుకున్నారు. అక్కినేని నాగేశ్వరరావు నుంచి ఇది ఉంది. ఆయన లవ్‌ స్టోరీస్‌తో మెప్పించారు. రొమాంటిక్‌ హీరోగా  రాణించారు. ఓ సందర్భంలో హీరో సుమంత్‌ కూడా ఆయన గురించి కామెంట్‌ చేశారు. నాగ్‌ మామ కంటే తాతనే పెద్ద రొమాంటిక్‌ అన్నారు. ఇక నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏకంగా మన్మథుడు అనే ట్యాగ్‌ని మెయింటేన్‌ చేస్తున్నారు. టాలీవుడ్‌లో హీరోయిన్లే కాదు, అమ్మాయిల గ్రీకు వీరుడిగానూ పేరుతెచ్చుకున్నారు. తండ్రి బాటలోనే కొడుకు చైతన్య కూడా వెళ్తున్నారు. రొమాంటిక్‌ హీరోగా రాణిస్తున్నారు.

25
శోభితాని రెండో పెళ్లి చేసుకున్న నాగచైతన్య
Image Credit : Instagram/@sobhitad

శోభితాని రెండో పెళ్లి చేసుకున్న నాగచైతన్య

లవ్‌ స్టోరీస్‌తో ఆకట్టుకుంటున్నారు. ఆయన కెరీర్‌లో పెద్ద హిట్‌ చిత్రాలన్నీ లవ్‌ స్టోరీస్‌ కావడం విశేషం. `ఏం మాయ చేశావె`, `100% లవ్‌`, `మనం`, `ఒక లైలా కోసం`, `ప్రేమమ్‌`, `మజిలి`, `లవ్‌ స్టోరీ`, `తండేల్‌` వంటి మూవీస్‌ తో విజయాలు అందుకున్నారు. ఇవన్నీ ప్రేమ కథా చిత్రాలే కావడం విశేషం. సినిమాల్లోనే కాదు, రియల్‌ లైఫ్‌లోనూ రెండు లవ్‌ స్టోరీలున్నాయి. సమంతతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. నాలుగేళ్లకి విడిపోయారు. ఆ తర్వాత మళ్లీ శోభితాతో ప్రేమలో పడ్డారు. రెండో సారి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు శోభితాతో రొమాంటిక్‌ లైఫ్‌ని లీడ్‌ చేస్తున్నారు.

Related Articles

Related image1
Spirit: ప్రభాస్ `స్పిరిట్` మూవీకి మరో షాక్‌.. మొన్న దీపికా, ఇప్పుడు ప్రకాష్‌ రాజ్‌ ఔట్‌.. కారణం ఇదే?
Related image2
Jagan-Vijay: పెళ్లి వేడుకలో వైఎస్‌ జగన్‌, దళపతి విజయ్‌ సందడి.. సూర్య, కార్తీలతో ఆత్మీయ ఆలింగనం.. ఫోటోలు వైరల్‌
35
నాగచైతన్య ఫస్ట్ సెలబ్రిటీ క్రష్‌
Image Credit : instagram/@sobhitad

నాగచైతన్య ఫస్ట్ సెలబ్రిటీ క్రష్‌

ఈ క్రమంలో నాగచైతన్యకి సంబంధించిన ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఆయన తన ఫస్ట్ సెలబ్రిటీ క్రష్‌ ఎవరో బయటపెట్టారు. అయితే ఆమె నాగార్జునతో రొమాన్స్ చేసిన హీరోయిన్‌ కావడం విశేషం. నాగచైతన్య నాలుగేళ్ల క్రితం ఓ ఇంగ్లీష్‌ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఇంట్రెస్టింగ్‌ విషయాన్ని పంచుకున్నారు. తన ఫస్ట్ సెలబ్రిటీ క్రష్‌ ఎవరో వెల్లడించారు. మాజీ మిస్‌ యూనివర్స్ సుస్మితా సేన్‌ అంటే క్రష్‌ అని తెలిపారు. ఆమె తన మొదటి సెలబ్రిటీ క్రష్‌ వెల్లడించారు.

45
తండ్రితో రొమాన్స్ చేసిన సుస్మితాపై చైతూ క్రష్‌
Image Credit : Entrepreneur Media India

తండ్రితో రొమాన్స్ చేసిన సుస్మితాపై చైతూ క్రష్‌

సుస్మితా సేన్‌ తన క్రష్‌ అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు, కానీ ఆమె తన తండ్రితో రొమాన్స్ చేసిన హీరోయిన్‌ కావడం విశేషం. నాగార్జున, సుస్మితా సేన్‌ కలిసి `రచ్చగన్‌`(రక్షకుడు) చిత్రంలో నటించారు. నాగార్జున కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తూ చేసిన చిత్రమిది. రొమాంటిక్‌ యాక్షన్‌ ఫిల్మ్ గా దర్శకుడు ప్రవీణ్‌ గాంధీ దీన్ని రూపొందించారు. 1997లో విడుదలైన ఈ చిత్రం డీసెంట్‌గా ఆడింది. ఒకప్పుడు తండ్రితో రొమాన్స్ చేసిన హీరోయిన్‌పై కొడుకు నాగచైతన్యకి క్రష్‌ ఏర్పడటం విశేషమనే చెప్పాలి.

55
వృష కర్మ మూవీతో బిజీగా ఉన్న నాగచైతన్య
Image Credit : Asianet News

వృష కర్మ మూవీతో బిజీగా ఉన్న నాగచైతన్య

నాగచైతన్య చివరగా `తండేల్‌`తో విజయాన్ని అందుకున్నారు. చాలా రోజుల తర్వాత ఆయనకు హిట్‌ పడింది. ఇది దాదాపు వంద కోట్ల వరకు వసూలు చేసింది. ఇప్పుడు కార్తీక్‌ దండు దర్శకత్వంలో `వృషకర్మ` చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరీ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో విడుదలయ్యే అవకాశాలున్నాయి.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
నాగ చైతన్య
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
Latest Videos
Recommended Stories
Recommended image1
Kayadu Lohar: బట్టల షాపు, స్టార్‌బక్స్‌లో పనిచేశా.. లాప్‌టాప్ వాడటం కూడా రాదు.. కయాదు లోహర్‌ కష్టాలు
Recommended image2
Prabhas: దేవుడా మళ్లీ పోయిందా, ప్రభాస్‌ ఎమోషనల్‌.. కట్‌ చేస్తే చిరు, బాలయ్యకి చుక్కలు చూపించిన సినిమా
Recommended image3
Tollywood: మోహ‌న్ బాబును కాపీ కొట్టిన మ‌హేష్ బాబు.. 35 ఏళ్ల క్రిత‌మే పోకిరీ సీన్‌. వైర‌ల్ వీడియో
Related Stories
Recommended image1
Spirit: ప్రభాస్ `స్పిరిట్` మూవీకి మరో షాక్‌.. మొన్న దీపికా, ఇప్పుడు ప్రకాష్‌ రాజ్‌ ఔట్‌.. కారణం ఇదే?
Recommended image2
Jagan-Vijay: పెళ్లి వేడుకలో వైఎస్‌ జగన్‌, దళపతి విజయ్‌ సందడి.. సూర్య, కార్తీలతో ఆత్మీయ ఆలింగనం.. ఫోటోలు వైరల్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved