16 ప్లాప్ సినిమాలు ఇచ్చిన హీరో, ప్రస్తుతం 100 కోట్ల తీసుకుంటున్న స్టార్ ఎవరు?
వరుసగా 16 సినిమాలు ఫ్లాప్ లు చూసిన హీరో నిర్మాతల చేత అవమానాలు కూడా ఫేస్ చేశారు. అలాంటి నటుడు ఇప్పుడు తన సినిమాకి 100 కోట్లు తీసుకుంటున్నాడు. ఇంతకీ ఎవరా హీరో.

కష్టపడకుండా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎవరు రాలేదు. వచ్చినా టాలెంట్ నిరూపించుకోకుండా స్టార్ హీరో అవ్వలేదు. ఈ మధ్యలో ఎన్నో అవమానాలు. మరెన్నో ఇబ్బందులు ఫేస్ చేయక తప్పదు. చిరంజీవి, రజినీకాంత్, షారుఖ్ ఖాన్ లాంటి వాళ్ళు కూడా ఇక్కడ చాలా కష్టాలు పడ్డారు. మొదట్లో చాలా ఓటములు చూడాల్సి వస్తుంది. కొంతమంది నిర్మాతల చేత అవమానాలు, నిందలు అనుభవించారు. ఇప్పుడు స్టార్ డమ్ ను అనుభవిస్తున్నారు.
ఇక అలాంటి మరో నటుడు ఏకంగా 16 ప్లాప్ లు చూశాడు. ఇప్పుడు 100 కోట్లు వసూలు చేస్తున్నాడు ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా..? అతను మరెవరో కాదు, అక్షయ్ కుమార్. అక్షయ్ కుమార్ కృషి, పట్టుదల, సరైన సమయంలో సరైన ప్రాజెక్టులు ఎంచుకునే తెలివితేటలు ఆయన్ని పైకి తీసుకొచ్చాయి. మొదట్లో వచ్చిన ఓటములు ఆయన జీవితంలో పాసింగ్ క్లౌడ్స్ మాదిరి అడ్డు పడ్డాయి. కాని ఆతరువాత అతని కష్టం అతన్ని ఈ స్థాయిలో నిలబెట్టింది.
Also Read: సుమన్ ను బ్లూ ఫిలిం కేసులో ఇరికించిన ముఖ్యమంత్రి ఎవరు? అందులో చిరంజీవి పాత్ర ఏమిటి?
Akshay Kumars Sky Force collection report ou
రాజీవ్ హరి ఓం భాటియా అనేది అక్షయ్ కుమార్ అసలు పేరు. జనవరి 25, 1991న విడుదలైన 'సౌగంధ్' సినిమాతో అక్షయ్ కుమార్ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఈరోజు ఆయన ఇండస్ట్రీలో 34 ఏళ్ళ ప్రయాణం పూర్తి చేసుకున్నారు. బాలీవుడ్ చరిత్రలో అత్యంత స్థిరమైన నటుల్లో ఒకరిగా నిలిచారు.
Also Read: నాగచైతన్య బాగా నచ్చిన నాగార్జున రెండు సినిమాలు, సీక్వెల్ చేయడానికి రెడీ అవుతున్న అక్కినేని యంగ్ హీరో
అక్షయ్ 'ఖిలాడి'తో మొదటి విజయం సాధించారు. కానీ 1990ల దశకం ఆయనకి టైమ్ కలిసి రాలేదు. అప్పటివరకు అక్షయ్ వరుసగా 16 ఫ్లాపులు చూడాల్సి వచ్చింది. ఇక చాలామంది అక్షయ్ కుమార్ పని అయిపోయింది అన్నారు. సినిమా క్రిటిక్స్ కూడా ఆయనకి భవిష్యత్తు లేదని రాశారు. ప్రేక్షకులు ఆయన్ని ఆదరించలేదు. అయినా అక్షయ్ ధైర్యం కోల్పోలేదు.
Also Read: గ్యాంగ్ లీడర్ సీక్వెల్ ఆ ఇద్దరు హీరోలు మాత్రమే చేయగలరు, చిరంజీవి చెప్పిన ఆ స్టార్స్ ఎవరు..?
ఈ కష్టకాలంలోనే ఒక నిర్మాత అక్షయ్‌ని అవమానించారు. నిర్మాత సునీల్ దర్శన్, అక్షయ్‌తో, "నీ సినిమాకి బ్యానర్ పెట్టాం. కానీ అది నీ సామర్థ్యాన్ని నమ్మి కాదు" అని మరో నిర్మాత అన్న మాటలు చెప్పి అవమానించిన క్షణాన్ని వివరించారు. అయినా ఈ అవమానం, తిరస్కారం అక్షయ్‌ని నిరుత్సాహపరచలేదు. బదులుగా అది ఆయనలో పట్టుదలను పెంచింది. సాలిడ్ కమ్ బ్యాక్ కు కారణం అయ్యింది.
Also Read: ఉదయ్ కిరణ్ తో పాటు ఈ హిట్ సాంగ్ లో నటించిన నలుగురు స్టార్స్ ఎలా మరణించారు?
అక్షయ్ మళ్ళీ తన బుర్రకు పదును పెట్టాడు. అవకాశాలు సాధించాడు. దర్శన్ 'ధడ్కన్'లో అక్షయ్‌కి ప్రధాన పాత్ర ఇచ్చారు. ఇది ఆయన కెరీర్‌కి మంచి బ్రేక్ ఇచ్చింది. వైఫల్యాల మధ్య, అక్షయ్ కెరీర్ 'హేరాఫెరి' సినిమాతో మళ్ళీ ఊపందుకుంది. ఆ సినిమా కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. అక్షయ్ కృషి, పట్టుదల, సరైన సినిమాల సెలక్షన్ అక్షయ్ ను మళ్ళీ పైకి తీసుకువచ్చింది.
ఇప్పుడు మీడియా కథనాల ప్రకారం అక్షయ్ కుమార్ ఆస్తుల విలువ దాదాపు 2700 కోట్లు. రీసెంట్ గా మళ్ళీ అక్షయ్ బాక్సాఫీస్ వద్ద కొన్ని సవాళ్ళు ఎదుర్కొన్నారు అక్షయ్. సామ్రాట్ పృథ్వీరాజ్, బడే మియా చోటే మియా సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు.
అయినా అక్షయ్ భయపడలేదు. సినిమా స్కై ఫోర్స్ ఆయన అదృష్టాన్ని మళ్ళీ మార్చింది.బాలీవుడ్‌లో అక్షయ్ కుమార్ ప్రయాణం ఆయన పట్టుదల, దృఢమైన మనస్తత్వం, ఏ ఓటమికీ లొంగని స్వభావానికి నిదర్శనం.
వ్యక్తిగత, వృత్తిపరమైన కష్టాలను ఎదుర్కొని.. కింద పడ్డప్పుడల్లా అంతే బలంగా వెనక్కి వచ్చేవాడు అక్షయ్. రీ ఎంట్రీలు అతనికి బాగా కలిసి వచ్చాయి. ఫిల్మ్ ఇండస్ట్రీలో అక్షయ్ కుమార్ 34 ఏళ్ళ ప్రయాణం.. కొత్త నటులకు స్ఫూర్తిదాయకం.