- Home
- Entertainment
- నాగచైతన్య బాగా నచ్చిన నాగార్జున రెండు సినిమాలు, సీక్వెల్ చేయడానికి రెడీ అవుతున్న అక్కినేని యంగ్ హీరో
నాగచైతన్య బాగా నచ్చిన నాగార్జున రెండు సినిమాలు, సీక్వెల్ చేయడానికి రెడీ అవుతున్న అక్కినేని యంగ్ హీరో
ఎప్పుడూ.. కింగ్ నాగార్జున కనుసన్నల్లో ఉంటాడు నాగచైతన్య. తండ్రి సినిమాల్లో చైతూకి రెండు సినిమాలంటే చాలా ఇష్టమట. ఆ రెండు సినిమాలు త్వరలో సీక్వెల్స్ చేయబోతున్నాడట. నిజమెంత..?

అక్కినేని నట వారసుల్లో మూడో తరం హీరోగా నాగచైతన్య ఎంతో కష్టపడుతున్నాడు. తన తాత, తండ్రిలాగా అంత త్వరగా స్టార్టమ్ రాలేదు చైతూకి. కాని మంచి సినిమాలు చేస్తూ.. మంచి పేరు మాత్రం సాధించుకున్నాడు. టైర్ 1 హీరోల లిస్ట్ లో మాత్రం చేరలేకపోతున్నాడు. అయితే వారసత్వం గురించి మాట్లాడకుండా.. తన మార్క్ సినిమాలు చేసుకుంటూ సొంత ఇమేజ్ ను మాత్రం సాధించగలిగాడు చైతూ.
Naga Chaitanya
ప్లాప్ సినిమాలు చూసినా..హిట్ సినిమాలు చూసినా. నాగచైతన్య సినిమాలంటే కాస్త పాజిటీవ్ ఆలోచనలు ఉంటాయి ఆడియన్స్ లో. ఈమధ్య మరీ ప్రయెగాత్మక సినిమాలు చేస్తూ వస్తున్నాడు చైతు. ఎక్కువగా లవ్ స్టోరీస్ చేసుకుంటూ.. అందులోనే వేరియేషన్స్ ను, ఎమెషనల్ టచ్ ను ఇస్తున్నాడు. మాస్ ఇమేజ్ కోసం ట్రై చేసినా.. అవి కలిసిరాకపోవడంతో.. లవ్ స్టోరీస్ నే నమ్మకున్నాడు అక్కినేని హీరో. రీసెంట్ గా లవ్ స్టోరీకి.. ఓ రియల్ స్టోరీని యాడ్ చేసి.. తండేల్ మూవీతో హిట్ కొట్టాడునాగచైతన్య.

ఇంతకీ ఆ సినిమాలు ఏంటంటే.. కింగ్ నాగార్జునకు స్పెషల్ ఇమేజ్ తెచ్చిపెట్టిన లాండ్ మార్క్ మూవీస్ హలో బ్రదర్, మన్మధుడు. అయితే ఈసినిమాలు కరెక్ట్ గా డ్రైవ్ చేయగల దర్శకుల కోసం చైతూ చూస్తున్నాడట. ఇక్కడ ట్వీస్ట్ ఏంటంటే.. మన్మధుడు సినిమాను సీక్వెల్ చేసి నాగార్జునే దెబ్బతిన్నాడు. ఇక హాల్ బ్రదర్ ను కూడా నాగార్జునతో సీక్వెల్ చేయాలని అనిల్ రావిపూడి చూస్తున్నాడట.
మరి ఈ రకంగా చూసుకుంటే నాగచైతన్య కోరిక తీరడం సాధ్యమేనా అనిపిస్తుంది. అసలు ఇందులో నిజమెంతో చూడాలి. ప్రస్తుతం నాగచైతన్య తండేల్ హిట్ ను ఎంజాయ్ చేస్తుంటే.. నాగార్జున మాత్రం కుంబేర సినిమాతో పాటు మరో తమిళ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.