- Home
- Entertainment
- సుమన్ ను బ్లూ ఫిలిం కేసులో ఇరికించిన ముఖ్యమంత్రి ఎవరు? అందులో చిరంజీవి పాత్ర ఏమిటి?
సుమన్ ను బ్లూ ఫిలిం కేసులో ఇరికించిన ముఖ్యమంత్రి ఎవరు? అందులో చిరంజీవి పాత్ర ఏమిటి?
Suman Blue Film Case: స్టార్ హీరోల లిస్ట్ లో చేరాల్సిన సుమన్ కెరీర్ ను నాశనంచేసింది ఎవరు? సుమన్ ను బ్లూ ఫిల్మ్ కేసులో ఇరికించిన ముఖ్యమంత్రి ఎవరు.? సుమన్ ఈ కేసులో ఇరుక్కోవడంలో మెగాస్టార్ చిరంజీవి పాత్ర కూడా ఉందా? నిజమేంటి?
- FB
- TW
- Linkdin
Follow Us
)
kollywood actor suman
Suman Blue Film Case: 80, 90 దశకంలో స్టార్ హీరోలకు పోటీ ఇచ్చాడు సుమన్. అప్పట్టో టాలీవుడ్ ను చిరు, బాలయ్య, వెంకటేష్, నాగార్జున ఈ నలుగురు ఏలేవారు. ఈ నలుగురు స్టార్స్ తో సమానంగా హీరోగా ఇమేజ్ రావల్సిన సుమన్ కెరీర్ కు మధ్యలో బ్రేక్ పడింది. టైర్ 2 హీరోగానే మిగిలిపోవల్సి వచ్చింది. స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా సుమన్ చాలా అందంగా ఉండేవారు. మేకప్ వేసినా వేయకపోయినా.. సుమన్ చాలా హ్యాండ్సమ్ గా కనిపించేవారు. అందుకే చాలామంది అమ్మాయిలు ఆయన్ను ఇష్టపడేవారు. మంచి నటన, గ్లామర్ అన్నీ ఉన్న సమన్ ఫ్యామిలీ సినిమాలతో పాటు యాక్షన్ సీనిమాలు కూడా అద్భుతంగా చేసేవారు.
Also Read: ఈ సూపర్ హిట్ సాంగ్ లో నటించిన నలుగురు స్టార్స్ ఎలా మరణించారో తెలుసా? హీరో హీరోయిన్ తో సహా
కాని ఆయన స్టార్ హీరో స్థాయికి మాత్రం ఎదగలేకపోయారు.సుమన్ ను స్టార్ అవ్వకుండా ఇండస్ట్రీలో తొక్కేశారు అన్న రూమర్స్ అప్పట్లో గట్టిగా వినిపించాయి. అంతే కాదు సుమన్ పై హీరోలతో పాటు, రాజకీయ నాయకులు కూడా ప్లాన్ చేసి పడగొట్టారంటూ వార్తలు వైరల్ అయ్యాయి. ఏకంగా ముఖ్యమంత్రి సుమన్ ను కేసుల్లో ఇరికించారంటూ గతంలో రూమర్స్ గట్టిగా వినిపించాయి. . సుమన్ పై అన్యాయంగా కేసులు పెట్టి ఎదగకుండా చేయడంతో పాటు.. బ్లూ ఫిల్మ్ చేస్తున్నాడంటూ సంచలన ఆరోపణలు చేయడంతో సుమన్ కెరీర్ ఇబ్బందుల్లో పడింది.
Also Read: 72 కోట్ల ఆస్తిని స్టార్ హీరోకి రాసిచ్చి చనిపోయిన మహిళా అభిమాని, ఎవరా హీరో, అంత పిచ్చి ప్రేమ ఎందుకు?
Suman Talwar
అయితే ఈ ఎపిసోడ్ మొత్తం మీద మెగాస్టార్ చిరంజీవి పేరు కూడా వినిపించింది. అయితే అసలు విషయం ఏంటి.. ఎక్కడ పొరపాటు జరిగింది. సుమన్ కేసుల్లో ఇరుక్కొవడానికి ముఖ్యమంత్రికి సబంధం ఏంటి..? అందులో చిరంజీవి పేరు ఎందుకు వినిపించింది. నిజానిజాలు ఏంటి..? సుమన్ ను ఈ విషయంలో ఇరికించాల్సిన అవసరం ఏంటి.? ఆ పని చేసింది ఎవరు..? ఈ విషయాలలో నిజా నిజాలను వెల్లడించారు దర్శకుడు సాగర్. ఆయన సుమన్ కు చాలా సన్నిహితుడు స్నేహితుడు. గతంలో ఇచ్చిన ఇటర్వ్యూలో సంచలన విషయాలు వెల్లడించారు సాగర్.
Suman
ఈ విషయాలు వైరల్ గా మారాయి. అయితే సుమన్ బ్లూ ఫిల్మ్ కేసులు సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి ప్రమేయం ఉందని తెలిసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఎవరా ముఖ్యమంత్రి. సుమన్ పై కావాలని రాజకీయ కారణాలతో నే ఈ కేసులు పెట్టారన్నరు సాగర్. అంతే కాదు అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి MGR కు తెలిసి ఈ విషయం జరిగిందన్నారు.
అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి MGR, రాష్ట్ర డిజిపి, లిక్కర్ కాంట్రాక్టర్ వడయార్ ఈ ముగ్గురి వల్లే సుమన్ జైలుపాలయ్యారు. ముఖ్యమంత్రి స్థాయిలో సుమన్ పై హై లెవల్ స్కెచ్ వేసి ఇరికించారు. బెయిల్ కూడా రాకుండా సుమన్ పై కేసులు పెట్టారు. అన్నింటికి కారణం ఓ అమ్మాయి సుమన్ పై మనసుపడటమే.
actor suman
సుమన్ అందగాడు. ఆరుడుగుల, మంచి కలర్ ఉండటంతో అప్పట్లో అమ్మాయిలు ఆయన వెంటపడేవారట. అందరు అమ్మాయిల్లానే తమిళనాడు అప్పటి డీజీపీ కూతురు కూడా సుమన్ పెంట పడిందట. అయితే అప్పటికే ఆ అమ్మాయి పెళ్ళి జరిగిపోయింది.
అయినా సరే సుమన్ షూటింగ్ ఉంటే అక్కడ వాలిపోయి హడావిడి చేసేదట. కానీ సుమన్ కి ఆమెపై ఎలాంటి అభిప్రాయం లేదు. సరిగ్గా ఇదే టైమ్ కు కాంట్రాక్టర్ వడయార్ కూతురుని సుమన్ స్నేహిడుతు ఒకరు ప్రేమించడంతో.. పరిస్థితులన్నీ కలిసి సుమన్ కు వ్యతిరేకంగా మారాయి.
MG Ramachandran
ఇక ఈ విషయం సరాసరి అప్పటి ముఖ్యమంత్రి MG రామచంద్రన్ కు దగ్గరకు వెళ్ళింది. దాంతో ఎంజీఆర్ సుమన్ ని పిలిపించాడు. బాబు నువ్వు నటుడివి. ఎంతో భవిష్యత్తు ఉంది. ఇలాంటివి వద్దు అని ఎంజీఆర్ చెప్పారట. లేకుంటే ఏం జరుగుతుందో కూడా చెప్పారట.
అప్పుడు సుమన్ కూడా అందులో తన తప్పు లేదని డైరెక్ట్ గా చెప్పకుండా.. ఆ విషయం నాకు కాదు చెప్పాల్సింది.. ఆ అమ్మాయికి చెప్పండి అని అన్నాడట. సుమన్ సున్నితంగానే అన్నా.. అది నిర్లక్ష్యంగా అన్నట్టు కన్వే అయ్యిందట. ఎమ్జీఆర్ కు సుమన్ సమాధానం నచ్చలేదు. డీజీపీకి సుమన్ పై కోపం ఉంది. వడయార్ కు సుమన్ ఫ్రెండ్ పై కోపం ఉంది.
దాంతో ఈ మూడు పరిణామాలు సుమన్ కు సంకటంగా మారాయి. డిజిపి తన బలం ఉపయోగించి సుమన్ పై అల్లర్ల కేసు పెట్టి అరెస్ట్ చేశారు.పైకి కనిపించేవి కాకుండా లోపల చాలా కేసులు పెట్టారట. అయితే అప్పుడే బ్లూ ఫిలిం కేసు పెట్టినట్లు పుకార్లను పుట్టించారు. కాని అసలు ఆ కేసు పెట్టలేదని అన్నారు సాగర్.
బ్లూఫిల్మ్ కేసుపై వచ్చినవన్నీ వట్టి పుకార్లు అని సాగర్ కొట్టిపారేశారు. సుమన్ స్నేహితుడికి క్యాసెట్ల షాప్ ఉండేది. ఆ విధంగా అపుకార్లు వచ్చాయి అని అన్నారు. అయితే సుమన్ చేయని తప్పుకు కొన్ని నెలలు జైల్లో ఉండాల్సి వచ్చిందట.
అంతే కాదు సుమన్ అమ్మగారికి గవర్నర్ బాగా తెలుసు. కాబట్టి త్వరగానే బెయిల్ వచ్చింది. కానీ బయటకు వచ్చేసరికి సుమన్ డబ్బు ఇచ్చిన స్నేహితులందరూ మోసం చేశారు. ఆ విధంగా సుమన్ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సాగర్ తెలిపారు. ఇక ఇందులో మెగాస్టార్ చిరంజీవి ప్రమేయం కూడా ఉన్నట్టు వార్తలు వైరల్ అయ్యాయి.
సుమన్ అరెస్ట్ వెనుక చిరంజీవి కూడా ఉన్నారని. ఆయన ఇన్వాల్వ్ మెంట్ తోనే ఇదంతా జరిగిందన్న వార్తలు వినిపించాయి. కానీ అందులో ఏమాత్రం వాస్తవం లేదు అని సాగర్ అన్నారు. ఈవిషయంలో అసలు చిరంజీవి పాత్రలేదన్నారు. అవన్నీ కావాలని పుట్టించిన పుకార్లంటూ క్లారిటీ ఇచ్చారు సాగర్.