ఉదయ్ కిరణ్ తో పాటు ఈ హిట్ సాంగ్ లో నటించిన నలుగురు స్టార్స్ ఎలా మరణించారు?
నీ స్నేహం సినిమాలో అన్నీ సూపర్ హిట్ సాంగ్సే. కాని అందులో చాలా మంది ఇష్టపడే పాట ''చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా'' ఈ పాటలో కనిపించిన హీరో హీరోయిన్ తో సహా.. నలుగురు స్టార్ యాక్టర్స్ మరణించారని మీకు తెలుసా..?అది ఎలా జరిగింది.?
- FB
- TW
- Linkdin
Follow Us
)
ఉదయ్ కిరణ్ , ఆర్తి అగర్వాల్ జంటగా నటించిన సినిమా నీ స్నేహం. ఈసినిమాలో ఎమోషన్స్ మనసును తాకుతాయి. ఏదో తీపి బాధను రేపుతాయి. సినిమా చూసినంత సేపు తెలియని అనుభూతి కలుగుతుంది. అయితే ఈ సినిమా ఎంత అద్భుతంగా ఉంటుందో పాటలు కూడా అంతే అద్భుతంగా ఉంటాయి. మనసును హత్తుకుంటాయి. అయితే ఈసినిమాలో నటించిన నలుగురు స్టార్స్, అది కూడా ఓ పాటలో నటించిన నలుగురు స్టార్స్ ప్రస్తుతం ఈ లోకలో లేరు. ''చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా'' పాటలో కనిపించిన ఆనలుగురు స్టార్స్ ఎవరు..? వారు ఎలా మరణించారు.?
ఉదయ్ కిరణ్:
నీ స్నేహం సినిమాలో ఉదయ్ కిరణ్ హీరో. ఈ ఫ్యామిలీ హీరో అంటే అభిమానించనివారంటూ ఉండరు. నటనతో పాటు అందరి మనసులను గెలుచుకున్న వ్యక్తిత్వం తనది. ఏ సినిమా చేసినా ఎంతో అద్భుతంగా మన ఇంటి మనిషిని చూసినట్టుగా ఉంటుంది ఉదయ్ కిరణ్ ను చూస్తే. అటువంటి మంచి హీరో చాలా చిన్న వయస్సులో మరణించాడు. ఈ పాటలో ఉదయ్ కిరణ్ ఎంతో ప్లసెంట్ గా కనిపిస్తారు. హీరోగా మంచి భవిష్యత్తు ఉండగా.. 40 ఏళ్ళ వయస్సులోనే ఆత్మ హత్య చేసుకుని ఆయన చనిపోయారు.
ఉదయ్ కిరణ మరణం ఇప్పటికీ మిస్టరీనే. ఆయన ఏ కారణంతో చనిపోయారు అనేది ఎవరికి తెలియదు. భార్య కారణం అని కొందరు, మానసిక సమస్యలు అంటారు, ఇంకొకరు ఇంకో మాట చెపుతారు. కాని ఇంత వరకు ఆయన ఆత్మహత్యకు కారణం తెలియదు. కాని మంచి హీరోను టాలీవుడ్ కోల్పోయింది. ఇప్పటికీ ఉదయ్ కిరణ్ ను తలుచుకుని బాధపడే అభిమానులు ఎందరో ఉన్నారు.
ఆర్తి అగర్వాల్:
నీస్నేహం సినిమాలో.. మరీ ముఖ్యంగా ''చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా'' పాటలో ఆకట్టుకున్న నటి.. ఈ సినిమా హీరోయిన్ ఆర్తి అగర్వాల్. ఈమె జీవితం కూడా సగంలోనే మగిసింది. హీరోయిన్ గా స్టార్ డమ్ ను చూసిన ఆర్తి అగర్వాల్ తెలుగులో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ఉదయ్ కిరణ్, తరుణ్ లాంటి యంగ్స్ స్టార్స్ తో సూపర్ హిట్ సినిమాలు చేసింది. ''చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా'' పాటలో ఆర్తి అగర్వాల్ ను అలా చూస్తూ ఉండిపోవచ్చు.
అంత అందమైన హీరోయిన్, తరుణ్ తో లవ్ ఎఫైర్ వల్ల కెరీర్ ను కరాబు చేసుకుందని టాలీవుడ్ టాక్. ఆతరువాత చాలా ఇబ్బందులు పడ్డ ఆమె.. ఆత్మహత్య ప్రయత్నం చేసి.. ఎలాగోలా బ్రతికింది. ఆతరువాత పెళ్ళి చేసుకుని ఫారెన్ లో సెటిల్ అయిన ఆర్తి అగర్వాల్.. బాగా లావుగా మారడంతో.. సన్నబడాలని ఆపరేషన్ చేయించుకుని.. అది వికటించడంతో మరణించిందని సమాచారం. 40 ఏళ్ళు రాకముందే ఆర్తి అగర్వాల్ తనువు చాలించింది. ఒక మంచి ఆర్టిస్ట్ ను ఫిల్మ్ ఇండస్ట్రీ మిస్ అయ్యింది.
కె విశ్వనాథ్:
తెలుగు చిత్ర పరిశ్రమకు ఫూజ్యనీయుడు, గొప్ప గొప్ప సినిమాలను డైరెక్ట్ చేసి ప్రపంచానికి తన సినిమాల ద్వారా గొప్ప గొప్ప పాఠాలు నేర్పిన మహానుబావుడు కే విశ్వనాథ్. దర్శకుడిగా, నటుడిగా ఆయన ప్రస్థానం అద్భుతం అనే చెప్పాలి. ఓంట్లో కాస్త ఓపిక ఉన్నంత వరకూ విశ్వనాథ్ సినిమాల్లో నటించార. సినిమాకార్యక్రమాలకు కూడా హాజరయ్యారు. ముఖ్యంగా నీ స్నేహం సినిమాలో ఆయన పాత్ర సగంలోనే ఆగిపోతుంది.
ఈ సినిమాలో ఆయన సినిమా సగంలోనే మరణిస్తారు. అప్పటి నుంచే కథ మలుపుతిరుగుతుంది. ఇక ''చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా'' పాటలో విశ్వనాథ్ ప్రముఖంతా కనిపిస్తారు. ఆర్తి అగర్వాల్ తాత పాత్రలో ఆయన కనిపించారు. ఇక విశ్వనాథ్ వయసు మీదపడటంతో వృధ్ధాప్య సమస్యలతో రీసెంట్ గానే మరణించారు.
సుజాత:
నీ స్నేహం సినిమాలో విశ్వనాథ్ భార్యగా, ఆర్తి అగర్వాల్ నానమ్మగా నటించింది అలనాటి తార సుజాత. తెలుగు నటి కాకపోయినా.. తెలుగులో ఆమె చేసిన పాత్రలన్నీ ఆమెను మన ప్రేక్షకులకు దగ్గర చేశాయి. ఈనటి కూడా 60 ఏళ్లు రాకముందే మరణించింది. హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. శోభన్ బాబు లాంటి హీరోలతో మంచి మంచి సినిమాలు చేసిన సుజాత.
హీరోయిన్ గా కెరీర్ క్లోజ్ అయిన తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయారు. తల్లిగా ఆమె ఎన్నో సినిమాల్లో అద్భుతమైన పాత్రలు చేశారు. ఇలా నీ స్నేహం సినిమాలో ''చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా'' పాటలో కనిపించిన మొయిన్ లీడ్ క్యారెక్టర్స్ నలుగురు మరణించడం చాలా బాధాకరం. మరీ ముఖ్యంగా చిన్న వయస్సులోనే ఉదయ్ కిరణ్, ఆర్తి అగర్వాల్ చనిపోవడం వారి ఫ్యాన్స ను ఇంకా బాధపెటిందని చెప్పాలి.