- Home
- Entertainment
- బాలకృష్ణ, వెంకీ, నాగ్ లతో ఒక్క సినిమా కూడా చేయని స్టార్ హీరోయిన్.. చిరంజీవితో మాత్రం రెండు చిత్రాలు
బాలకృష్ణ, వెంకీ, నాగ్ లతో ఒక్క సినిమా కూడా చేయని స్టార్ హీరోయిన్.. చిరంజీవితో మాత్రం రెండు చిత్రాలు
తెలుగు చిత్ర పరిశ్రమకి చెందిన ఓ స్టార్ హీరోయిన్ చిరంజీవితో 2 చిత్రాల్లో నటించింది. కానీ బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లతో ఆమె హీరోయిన్ గా నటించకపోవడం ఆశ్చర్యకరమే. ఆ హీరోయిన్ ఎవరో ఈ కథనంలో తెలుసుకుందాం.

చిరంజీవితో నటించిన హీరోయిన్లు
మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎందరో హీరోయిన్లతో నటించారు. చిరంజీవితో ఎక్కువ సినిమాలు చేసిన హీరోయిన్లలో విజయశాంతి, రాధా, రాధికా, సుహాసిని లాంటి వారు ప్రధానంగా ఉంటారు. చిరంజీవితో నటించిన చాలా మంది హీరోయిన్లు అప్పట్లో టాప్ లీగ్ లో ఉన్న బాలయ్య, వెంకీ, నాగార్జునతో కూడా నటించారు. అయితే ఓ లెజెండ్రీ హీరోయిన్ మాత్రం చిరంజీవితో మాత్రం రెండు సినిమాల్లో నటించింది, కానీ బాలయ్య, వెంకీ, నాగార్జునతో ఒక్క చిత్రం కూడా చేయలేదు.
KNOW
చిరంజీవి, జయప్రద కాంబినేషన్
ఆ హీరోయిన్ ఎవరో కాదు.. తెలుగు చిత్ర పరిశ్రమలో లెజెండ్రీ హీరోయిన్లలో ఒకరైన జయప్రద. జయప్రద ఎన్టీఆర్, ఏఎన్నార్, సూపర్ స్టార్ కృష్ణ లాంటి వారితో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించింది. అప్పట్లో శ్రీదేవికి పోటీగా నిలిచిన హీరోయిన్ జయప్రద. ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాతి తరం హీరో అయిన చిరంజీవితో జయప్రద 2 చిత్రాల్లో నటించింది. కె బాలచందర్ దర్శకత్వంలో 1981లో 47 రోజులు అనే చిత్రంలో చిరంజీవి, జయప్రద నటించారు. ఆ తర్వాత 1986లో వేట చిత్రంలో మరోసారి జంటగా చిరంజీవి, జయప్రద నటించారు.
వారితో ఒక్క మూవీ కూడా లేదు
ఈ రెండు చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. దీనితో మూడవసారి వీరి కాంబినేషన్ రిపీట్ కాలేదు. కానీ బాలకృష్ణ, వెంకీ, నాగార్జున లతో ఒక్క చిత్రంలో కూడా జయప్రద నటించలేదు. కానీ బాలయ్య మహారథి చిత్రంలో మాత్రం జయప్రద హీరోయిన్ తల్లిగా నటించింది.
రాజకీయాల్లో రాణించిన జయప్రద
జయప్రద రాజకీయాల్లో కూడా రాణించారు. ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీలో ఆమె కీలక పాత్ర వహించారు. రాజ్యసభ ఎంపీగా కూడా పనిచేశారు. ఆ తర్వాత ఆమె తెలుగుదేశం పార్టీ నుంచి తప్పుకున్నారు.
జయప్రద చిత్రాలు
ఇప్పటికీ జయప్రద అవకాశం ఉన్నప్పుడు సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు. జయప్రద తెలుగులో అడవి రాముడు, యమగోల, కురుక్షేత్రం, భలేకృష్ణుడు, చంద్ర వంశం లాంటి ఎన్నో చిత్రాల్లో నటించారు. హిందీలో కూడా ఆమె సత్తా చాటారు. జయప్రద అచ్చ తెలుగు మహిళ. ఆమె రాజమండ్రిలో జన్మించారు.