- Home
- Entertainment
- Balakrishna: నిజమే, పవన్ కళ్యాణ్ కోసం బాలయ్య త్యాగం.. ఓజీ గెలిచింది ఇప్పుడు అఖండ 2 గెలవాలి
Balakrishna: నిజమే, పవన్ కళ్యాణ్ కోసం బాలయ్య త్యాగం.. ఓజీ గెలిచింది ఇప్పుడు అఖండ 2 గెలవాలి
బాలకృష్ణ నటించిన అఖండ 2 చిత్రం డిసెంబర్ 12న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం సెప్టెంబర్ లోనే రిలీజ్ కావలసింది. కానీ ఎందుకు డిసెంబర్ లో రిలీజ్ చేశారో చెబుతూ బోయపాటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నందమూరి బాలకృష్ణ అఖండ 2
నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 చిత్రం ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తోంది. అయితే ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ మాత్రం రావడం లేదు. కొన్ని మాస్ యాక్షన్ మూమెంట్స్ ఉన్నప్పటికీ సినిమాని నిలబెట్టడానికి అవి సరిపోలేదు. వీకెండ్ లో అఖండ 2 చిత్రం సాధించే వసూళ్ళని బట్టి ఈ మూవీ జాతకం తేలిపోతుంది.
సెప్టెంబర్ లోనే రావలసింది
అఖండ 2 చిత్రం డిసెంబర్ 5న రిలీజ్ కావాల్సి ఉండగా ఆర్థిక సమస్యల కారణంగా 12కు వాయిదా వేశారు. దీనితో ఈ చిత్రం డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ వాస్తవానికి డిసెంబర్ 5 కంటే ముందుగానే అఖండ 2 రావాల్సింది. సెప్టెంబర్ లోనే రిలీజ్ అని ముందుగా ప్రకటించారు. కానీ అనుకోని కారణాల వల్ల డిసెంబర్ కి రిలీజ్ డేట్ మార్చారు.
పవన్ కళ్యాణ్ ఓజీ రిలీజ్
దీని గురించి దర్శకుడు బోయపాటి శ్రీను ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అఖండ 2 చిత్రం వాస్తవానికి ఆగస్టు లోనే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీ అయిపోయింది అని అన్నారు. ఆ తర్వాత సెప్టెంబర్ లో పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా రిలీజ్ అయింది. ఇండస్ట్రీ అంటే ఒక ఫ్యామిలీలా ఉండాలి. ఒకరిపై ఒకరు పడితే ఎలా అని అనుకున్నాం.
పవన్ కోసం బాలయ్య త్యాగం
బాలకృష్ణ గారు కూడా మనం తమ్ముడు పవన్ కళ్యాణ్ కి దారి ఇచ్చేద్దాం. మనం తర్వాత వద్దాం ఏమవుతుంది అని ఎంతో పాజిటివ్ గా అన్నారు. అందుకే ఓజీతో పాటు అఖండ 2ని విడుదల చేయలేదు. దీనితో ఓజీ రిలీజ్ అయింది. చక్కగా ఇండస్ట్రీకి ఊపిరి వచ్చింది. ఆ సినిమా గెలిచింది. ఇప్పుడు అఖండ 2 కూడా గెలవాలి అని బోయపాటి అన్నారు.
అఖండ 2 వసూళ్లు
అఖండ 2 చిత్రం 2 రోజుల్లో 40 కోట్ల వరకు ప్రపంచవ్యాప్తంగా షేర్ రాబట్టింది. మొదటి రోజు తో పోల్చుకుంటే 2వ రోజు వసూళ్లు కొంత డ్రాప్ అయ్యాయి. ఈ చిత్రం హిట్ కావాలంటే 100 కోట్లకి పైగా షేర్ రావాలి. దీనితో సాధించాల్సిన టార్గెట్ ఇంకా చాలా ఉండడంతో ఉత్కంఠ నెలకొంది.

