ఎవరీ డాక్టర్ రమ్య మోహన్ ? విజయ్ సేతుపతిపై సంచలన ఆరోపణలు..ఆ అమ్మాయిని అలా..
విజయ్ సేతుపతి ఓ అమ్మాయిని మోసం చేశాడు అంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. డాక్టర్ రమ్య మోహన్ అనే మహిళ విజయ్ సేతుపతిపై సంచలన ఆరోపణలు చేసింది.

విలక్షణ నటుడిగా విజయ్
సేతుపతి విజయ్ సేతుపతి విలక్షణ నటుడిగా దక్షిణాది సినిమాలో తనదైన ముద్ర వేశారు. బాలీవుడ్ లో కూడా విజయ్ సేతుపతి నటించారు. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎలాంటి పాత్ర అయినా సరే అందులో పరకాయ ప్రవేశం చేసి మెప్పించడం విజయ్ సేతుపతి స్టైల్. విజయ్ సేతుపతి ఎప్పుడూ కూల్ గా ఉంటూ, ఎలాంటి వివాదంలో తలదూర్చకుండా తన పని తాను చేసుకుంటూ వెళతాడు.
KNOW
విజయ్ సేతుపతిపై క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు
అయితే ఇటీవల కొన్ని రోజులుగా విజయ్ సేతుపతిపై క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు వినిపిస్తుండడం సంచలనంగా మారింది. బ్రిటన్ కి చెందిన డాక్టర్ రమ్య మోహన్ అనే మహిళ విజయ్ సేతుపతిపై తీవ్ర స్థాయిలో క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసింది. ఆమె ట్విట్టర్ ఖాతాలో విజయ్ సేతుపతిపై ఆరోపణలు చేస్తూ పోస్ట్ పెట్టింది. డైరెక్ట్ గా ఆమె విజయ్ సేతుపతి పేరు ప్రస్తావిస్తూ ఈ ఆరోపణలు చేయడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
బ్రిటన్ సైకియాట్రిస్ట్ సంచలనం
రమ్య మోహన్ బ్రిటన్ లో సైకియాట్రిస్ట్ గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె విజయ్ సేతుపతిపై ట్వీట్స్ చేసి వాటిని కొంత సేపటి తర్వాత డిలీట్ చేశారు. ఇంతలో ఆ ట్వీట్స్ కి సంబంధించిన స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ఆమె ట్విట్టర్ ఖాతా కూడా ఇన్ యాక్టివ్ గా మారింది.
రమ్య మోహన్ తీవ్ర ఆరోపణలు
ఇంతకీ రమ్య మోహన్ విజయ్ సేతుపతి గురించి ఏం చెప్పిందో ఇప్పుడు చూద్దాం. కోలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్, మాదక ద్రవ్యాలు కల్చర్ అనేది తేలిగ్గా తీసుకోవాల్సిన అంశం కాదు. నాకు తెలిసిన ఓ అమ్మాయి మీడియాలో పనిచేస్తూ ఉండేది. ఆమెని బలవంతంగా సినిమా రంగంలోకి లాగారు. ప్రస్తుతం ఆమె రిహాబిలిటేషన్ సెంటర్ లో చికిత్స తీసుకుంటోంది. మాదక ద్రవ్యాలు వాడకం, నమ్మించి మోసం చేయడం, వాడుకోవడం అనేవి ఇండస్ట్రీలో కామన్ గా మారిపోయాయి. విజయ్ సేతుపతి క్యారవ్యాన్ లో ఫేవర్ కోసం రూ 2 లక్షలు, లాంగ్ డ్రైవ్ కోసం 50 వేలు అమ్మాయిలకు ఆఫర్ చేస్తుంటాడు. కానీ పైకి మాత్రం ఒక యోగిలాగా నటిస్తాడు. ఆ అమ్మాయిని విజయ్ సేతుపతి కొన్నేళ్లుగా వాడుకుంటూ మోసం చేస్తూనే ఉన్నాడు. ఇది మాత్రమే కాదు ఇలాంటి సంఘటనలు ఇండస్ట్రీలో చాలా ఉన్నాయి.
విజయ్ సేతుపతికి ఫ్యాన్స్ మద్దతు
ఆ తర్వాత ట్వీట్ ని రమ్య మోహన్ డిలీట్ చేశారు. ఆవేశంలో ట్వీట్ చేశాను. ఆ అమ్మాయి ప్రైవసీని దృష్టిలో పెట్టుకుని డిలీట్ చేస్తున్నాను అని పేర్కొంది. ఆ తర్వాత ఆమె ట్విట్టర్ అకౌంట్ ఇన్ యాక్టివ్ లోకి వెళ్ళింది. దీనితో సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు మొదలయ్యాయి. కొందరు విజయ్ సేతుపతికి మద్దతు తెలుపుతుంటే మరికొందరు విమర్శిస్తున్నారు. విజయ్ సేతుపతి ఫ్యాన్స్ మాత్రం అసలు రమ్య మోహన్ ఎవరు ? బ్రిటన్ లో ఉండే ఆమెకి ఈ విషయాలు ఎలా తెలిశాయి ? ఆమె చేసిన ఆరోపణలు బలమైనవి అయితే ట్వీట్స్ ఎందుకు డిలీట్ చేసింది అంటూ ప్రశ్నిస్తున్నారు. విజయ్ సేతుపతి ఈ వివాదంపై స్పందిస్తూ ఆ ఆరోపణలు పూర్తిగా అవాస్తవం అని కొట్టిపారేశారు. ఆమె ఎవరో కూడా తనకి తెలియదని అన్నారు. తన టీం ఆమెపై కంప్లైంట్ చేస్తుందని విజయ్ సేతుపతి పేర్కొన్నారు.