- Home
- Entertainment
- మహేష్ గుండెలపై కారుతున్న రక్తం.. మెడలో త్రిశూలం, నంది.. ఏమీ చెప్పకుండానే అరాచకం సృష్టించిన జక్కన్న
మహేష్ గుండెలపై కారుతున్న రక్తం.. మెడలో త్రిశూలం, నంది.. ఏమీ చెప్పకుండానే అరాచకం సృష్టించిన జక్కన్న
మహేష్ బాబు, రాజమౌళి చిత్రం నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. మహేష్ బాబు ప్రీ లుక్ పోస్టర్ ని రాజమౌళి రిలీజ్ చేశారు.

మహేష్ బాబు, రాజమౌళి చిత్రం
సూపర్ స్టార్ మహేష్ బాబు 50వ జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అయితే ఒక విషయంలో మాత్రం మహేష్ ఫ్యాన్స్ కి నిరాశ తప్పలేదు. మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో SSMB 29 చిత్రం తెరకెక్కుతోంది. పాన్ ఇండియా స్థాయిలో తన సత్తా చాటిన రాజమౌళి ఈ చిత్రంతో పాన్ వరల్డ్ బాక్సాఫీస్ ని టార్గెట్ చేశారు. ఈ మూవీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్నారు.
KNOW
ఫ్యాన్స్ కి నిరాశ
పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆయనే విలన్ అంటూ ప్రచారం జరుగుతోంది. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా SSMB 29 నుంచి ఏదైనా అప్డేట్ ఉంటుందని ఫ్యాన్స్ ఆశించారు. కానీ జక్కన్న మొండిచేయి చూపించారు. ఈ బర్త్ డే కి ఎలాంటి సర్ప్రైజ్ లేదని.. అభిమానులు ఓపికతో ఉండాలని ప్రకటన విడుదల చేశారు.
SSMB 29 పై రాజమౌళి ప్రకటన
రాజమౌళి చేసిన ఈ ప్రకటనలోని పెద్ద సర్ప్రైజ్ దాగి ఉంది. రాజమౌళి ట్విట్టర్ లో చేసిన పోస్ట్ బ్యాగ్రౌండ్ లో ముఖం కనిపించకుండా మహేష్ బాబు లుక్ దాగి ఉంది. ముందు రాజమౌళి ప్రకటనలో ఏం చెప్పారో తెలుసుకుని ఆ తర్వాత మహేష్ లుక్ గురించి చూద్దాం. ఇండియాలో, వరల్డ్ వైడ్ గా ఉన్న ప్రియమైన సినీ అభిమానులు, మహేష్ బాబు అభిమానులకు.. మేము షూటింగ్ ప్రారంభించి కొంతకాలమే అయింది. ఈ చిత్రం కోసం మీరంతా ఎంతలా ఎదురుచూస్తున్నారో అర్థం చేసుకోగలం. ఈ చిత్ర కథ, తెరకెక్కిస్తున్న స్కేల్ చాలా భారీ స్థాయిలో ఉంటాయి. కాబట్టి కేవలం ఒక పోస్టర్ లేదా మీడియా సమావేశం ఈ చిత్రం గురించి తెలియాజేయడానికి సరిపోదు.
నవంబర్ లో ఫస్ట్ రివీల్
ఈ సినిమా ఉద్దేశం, లోతు, భారీతనం తెలియజేసేలా ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాం. అది విడుదలైనప్పుడు మేము ఎంత భారీ చిత్రం క్రియేట్ చేస్తున్నామో మీకు అర్థం అవుతుంది. ఈ సర్ప్రైజ్ ని నవంబర్ లో రిలీజ్ చేస్తాం. ఇది ఇంతకు ముందు మీరెప్పుడూ చూడని, ఊహించలేని విధంగా ఉంటుంది. మీ సహనానికి ధన్యవాదాలు అని రాజమౌళి ప్రకటనలో పేర్కొన్నారు.
మహేష్ మెడలో రుద్రాక్ష మాల
ఇక ఈ పోస్ట్ బ్యాగ్రౌండ్ లో ముఖం కనిపించకుండా మహేష్ బాబు లుక్ ఉంది. మహేష్ మెడలో రుద్రాక్ష మాల, త్రిశూలం, నంది కనిపిస్తున్నాయి. అంతే కాదు మహేష్ గుండెలపై రక్తం కారుతోంది. జస్ట్ బ్యాగ్రౌండ్ లో చూపించిన ఈ డీటెయిల్స్ తోనే జక్కన్న అరాచకం సృష్టించారు. మునుపెన్నడూ లేని విధంగా ఈ చిత్రంలో మహేష్ బాబు లుక్ ఉంది. మెడలో రుద్రాక్ష ఉండడంతో ఈ చిత్రంలో డివోషనల్ అంశాలు కూడా ఉన్నాయని జక్కన్న చెప్పకనే చెప్పారు. ఏమీ చెప్పకుండానే ఊహించని సర్ప్రైజ్ ఇచ్చిన రాజమౌళి.. నవంబర్ లో రిలీజ్ అయ్యే అప్డేట్ తో అంచనాలు తారా స్థాయికి పెరగడం ఖాయం.