MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Korean Kanakaraju Day 1 Collections: సాలిడ్ ఓపెనింగ్స్ సాధించిన వరుణ్ తేజ్ సినిమా, కొరియన్ కనకరాజు ఫస్ట్ డే వసూళ్లు ఎంత?

Korean Kanakaraju Day 1 Collections: సాలిడ్ ఓపెనింగ్స్ సాధించిన వరుణ్ తేజ్ సినిమా, కొరియన్ కనకరాజు ఫస్ట్ డే వసూళ్లు ఎంత?

Korean Kanakaraju Day 1 Collections: మొత్తానికి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సాధించాడు. ఫస్ట్ డే సాలిడ్ ఒపెనింగ్స్ తో కొరియన్ కనకరాజ్ బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతోంది. ఇంతకీ మెగా హీరో నటించిన హారర్ కామెడీ మూవీ ఫస్ట్ రోజు ఎంత వసూలు చేసిందంటే?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 08 2026, 08:47 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కొరియన్ కనకరాజు ఫస్ట్ డే వసూళ్లు
Image Credit : X/@UV_Creations

కొరియన్ కనకరాజు ఫస్ట్ డే వసూళ్లు

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం 'కొరియన్ కనకరాజు' థియేటర్లలోకి వచ్చిరావడంతోనే బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. ఆగస్టు 7న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ తెలుగు హారర్-కామిడీ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు సాలిడ్ కలెక్షన్స్ ను సాధించింది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన రితికా నాయక్ హీరోయిన్ గా నటించగా, నటుడు సత్య కీలక పాత్రలో కనిపించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఇండియాలో కొరియన్ కనకరాజు వసూళ్లు..
Image Credit : Asianet News

ఇండియాలో కొరియన్ కనకరాజు వసూళ్లు..

సాక్నిల్క్ (Sacnilk) నివేదికల ప్రకారం.. 'కొరియన్ కనకరాజు' సినిమా తొలిరోజే దుమ్మురేపింది.. భారతదేశంలో రూ. 3.95 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. దేశవ్యాప్తంగా 1,656 షోలతో రిలీజ్ అయిన ఈమూవీ.. ఈ స్థాయి వసూళ్లు నమోదు కావడం విశేషం. ఇక ఇండియా మొత్తంమీద ఈ సినిమా గ్రాస్ కలెక్షన్స్ రూ. 4.50 కోట్లకు చేరుకున్నాయి. వరుణ్ తేజ్ కెరీర్ లో మంచి ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా ఇది నిలిచిపోయింది.

35
ప్రపంచవ్యాప్తంగా వరుణ్ తేజ్ మూవీ కలెక్షన్స్ ఎంత?
Image Credit : Asianet News

ప్రపంచవ్యాప్తంగా వరుణ్ తేజ్ మూవీ కలెక్షన్స్ ఎంత?

దేశీయ మార్కెట్‌లోనే కాకుండా ఓవర్సీస్‌లోనూ ఈ చిత్రానికి మంచి స్పందన లభించింది. విదేశీ మార్కెట్ల నుంచి తొలిరోజే రూ. 2 కోట్ల గ్రాస్ కలెక్షన్లు నమోదయ్యాయి. దీనితో మొదటి రోజు ముగిసేసరికి ప్రపంచవ్యాప్తంగా 'కొరియన్ కనకరాజు' మొత్తం గ్రాస్ వసూళ్లు రూ. 6.50 కోట్లకు చేరుకున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా నైట్ షోలకు భారీ ఆక్యుపెన్సీ నమోదు అయ్యింది. శుక్రవారం నాడు ఈ తెలుగు 2D వెర్షన్‌కి థియేటర్లలో మొత్తంగా 41% ఆక్యుపెన్సీ నమోదైంది.

పూటవారీగా పరిశీలిస్తే:

మార్నింగ్ షోలు: 27.83%

ఆఫ్టర్‌నూన్ షోలు: 38.25%

ఈవినింగ్ షోలు: 38.33%

నైట్ షోలు: అత్యధికంగా 57.42% ఆక్యుపెన్సీని నమోదు చేసి బాక్సాఫీస్ వద్ద బలమైన పట్టును చూపించాయి.

45
తెలుగు రాష్ట్రాలదే సింహభాగం
Image Credit : X/@UV_Creations

తెలుగు రాష్ట్రాలదే సింహభాగం

చాలా కాలంగా సరైన హిట్ లేక వరుణ్ తేజ్ కెరీర్ ఇబ్బందుల్లో పడింది. ఈసారైన సాలిడ్ సక్సెస్ కోసం ఎదరుచూసిన మెగా హీరోకి కొరియన్ కనకరాజు ఫస్ట్ డే ఊరటనిచ్చింది. ఇక ఈ సినిమా కలెక్షన్లలో ఆంధ్రప్రదేశ్ ‌- తెలంగాణ రాష్ట్రాలు ప్రధాన పాత్ర పోషించాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కలసి రూ. 4 కోట్ల గ్రాస్ వసూలైంది. ఆ తర్వాతి స్థానంలో కర్ణాటక రూ. 43 లక్షలు వసూలు చేయగా, తమిళనాడు నుంచి రూ. 5 లక్షలు, దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి రూ. 2 లక్షల రాబడి వచ్చింది.

55
రాయలసీమ సంస్కృతికి కొరియన్ కాన్సెప్ట్ మిక్స్ చేసి..
Image Credit : X/@UV_Creations

రాయలసీమ సంస్కృతికి కొరియన్ కాన్సెప్ట్ మిక్స్ చేసి..

ఈ సినిమా స్టోరీ లైన్ చాలా డిఫరెంట్ గా అనిపించింది. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చింది. రాయలసీమ స్థానిక సంస్కృతికి కొరియన్ దెయ్యం ఆవహించే ఒక వినూత్నమైన సూపర్ నేచురల్ కాన్సెప్ట్‌ను జోడించి డైరెక్టర్ మేర్లపాక గాంధీ ఈ హారర్ కామిడీని రూపొందించారు. వరుణ్ తేజ్ తన నటనతో అలరించగా, సత్య కామిడీ టైమింగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. సిజిఐ (CGI) విభాగాలు .. క్లైమాక్స్ విషయంలో కొందరి నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ, మొత్తంమీద బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా డీసెంట్ ఓపెనింగ్స్‌తో దూసుకుపోతోంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT: ఆ నర్సు గొంతు కోసం ఆరాటపడే హీరో, దిమ్మతిరిగే ట్విస్టులు.. ఈ వారం ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు ఇవే
Recommended image2
Siva Reddy: 11 లక్షలు పెడితే 100 కోట్లు.. స్నేహితుడి చేతిలో నటుడు శివారెడ్డి ఎలా మోసపోయాడో తెలుసా?
Recommended image3
Apoorva Remuneration: మూడు వారాలకే అపూర్వ ఎలిమినేషన్.. ఆమెకు అందిన పారితోషికం ఎంతో తెలుసా?
Related Stories
Recommended image1
వెంకటేష్‌నే పెళ్లి చేసుకుంటా అని మొండికేసిన హీరోయిన్ ఎవరో తెలుసా? ఫస్ట్ క్రష్ బయటపెట్టిన సీనియర్ నటి
Recommended image2
Savitri: తప్పంతా సావిత్రిదే.. మహానటి మొండితనం గురించి, రమాప్రభ చెప్పిన సంచలన విషయాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved