MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • వెంకటేష్‌నే పెళ్లి చేసుకుంటా అని మొండికేసిన హీరోయిన్ ఎవరో తెలుసా? ఫస్ట్ క్రష్ బయటపెట్టిన సీనియర్ నటి

వెంకటేష్‌నే పెళ్లి చేసుకుంటా అని మొండికేసిన హీరోయిన్ ఎవరో తెలుసా? ఫస్ట్ క్రష్ బయటపెట్టిన సీనియర్ నటి

Venkatesh: ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోలంటే లేడీ అభిమానులకే కాదు కాదు సెలబ్రిటీలకు హీరోయిన్లకు కూడా క్రష్ ఉంటుంది. చాలామంది హీరోయిన్లు తమ పస్ట్ క్రష్ గురించి ఎన్నో ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు. ఇక ఓ సీనియర్ హీరోయిన్ కూడా తన క్రష్ విక్టరీ వెంకటేష్ అంటోంది.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 07 2026, 12:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
హీరోలపై హీరోయిన్ల క్రష్..
Image Credit : Asianet News

హీరోలపై హీరోయిన్ల క్రష్..

ఇండస్ట్రీలో స్టార్ హీరోల మీద కొంత మంది హీరోయిన్ల క్రష్ ఉండటం కామన్. తన ఫస్ట్ క్రష్ అతనే అని చాలమంది హీరోయిన్లు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు కూడా. ఈ తరం తారలైతే ఏమాత్రం మొహమాటం లేకుండా తమకు నచ్చిన హీరోల గురించి.. వారితో వన్ సైడ్ లవ్ గురించి వెల్లడిస్తుంటారు. ఈక్రమంలోనే ఓ సీనియర్ హీరోయిన్ కూడా విక్టరీ వెంకటేష్ పై తనకున్నక్రష్ గురించి వెల్లడించింది. కొన్ని ఆశ్చర్చకరమైన విషయాలు కూడా ఆమె షేర్ చేసుకుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు రాశి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఆరాధ్య నటుల గురించి
Image Credit : Asianet News

ఆరాధ్య నటుల గురించి

ఫిల్మ్ ఇండస్ట్రీలో నటీనటులకు సంబంధించిన చిన్ననాటి జ్ఞాపకాలు, వారి ఆరాధ్య నటుల గురించి బయటపడే విషయాలు అభిమానులను ఎప్పుడూ ఆకట్టుకుంటూనే ఉంటాయి. తాజాగా ప్రముఖ సీనియర్ నటి, మాజీ హీరోయిన్ రాశి ఒక ఇంటర్వ్యూలో తనకు చిన్నతనంలో హీరోలపై, ప్రముఖ వ్యక్తులపై ఉన్న క్రష్ గురించి పంచుకున్న ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

35
రాశి చెప్పిన చిన్ననాటి కబుర్లు
Image Credit : youtube/@hittv

రాశి చెప్పిన చిన్ననాటి కబుర్లు

అలీతో సరదాగా ప్రోగ్రమా్ లో పాల్గోన్న రాశి.. చిన్నతనం గురించి చాలా కబుర్లు పంచుకన్నారు. తాను చిన్నగున్నప్పుడు (సుమారు 6 నుండి 7 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు) విక్టరీ వెంకటేష్ సినిమాలు బాగా చూసేవారట. ఆ సమయంలో చెన్నైలో ప్రివ్యూ షోలు ఒక పండుగలా జరిగేవని ఆమె గుర్తుచేసుకున్నారు. రాశి తాతగారు ప్రఖ్యాత డి సురేష్ బాబు/రామానాయుడు గారి బ్యానర్‌లో పనిచేయడం వల్ల కుటుంబసభ్యులకు ప్రత్యేక పాస్‌లు లభించేవి. ఆ కారణంగా వెంకటేష్ నటించిన సినిమాలను ఆమె తరచుగా ప్రివ్యూ షోలలో చూసేవారు. వెంకటేష్ స్క్రీన్ ప్రెజెన్స్, నటన చూసి చిన్నతనంలోనే ఆయనకు రాశి పెద్ద అభిమానిగా మారిపోయారు .

45
ఎవరిని పెళ్లి చేసుకుంటావంటే?
Image Credit : Asianet News

ఎవరిని పెళ్లి చేసుకుంటావంటే?

ఇంటి దగ్గర ఎవరైనా సరదాగా "పెద్దయ్యాక ఎవరిని పెళ్లి చేసుకుంటావు?" అని అడిగితే, "నేను పెళ్లి అంటూ చేసుకుంటే ఒక్క వెంకటేష్ గారిని తప్ప ఇంకెవరినీ చేసుకోను" అని పట్టుపట్టేవారట . చిన్నతనంలో రాశికి వెంకటేష్‌పై ఉన్న ఆ అమాయకమైన అభిమానం ఒక సీజన్ పాటు బలంగా నడిచిందని ఆమె నవ్వుతూ వెల్లడించారు. ఆ తర్వాత పెద్దయ్యాక ఆయనతో జంటగా నటించే అవకాశం రాకపోయినా.. ఓ సాంగ్ కు డ్యాన్స్ చేసే అవకాశం మాత్రం వచ్చింది. శ్రీను' చిత్రంలో వెంకటేష్‌తో కలిసి ఓ మనాలి ఓ మనాలి పాటకు రాశీ డ్యాన్స్ చేసింది. అయితే చిన్ననాటి ఈ పెళ్లి మాటను ఆయనతో చెప్పలేకపోయానని ఆమె గుర్తు చేసుకున్నారు.

55
వెంకటేష్ తరువాత ఎవరు?
Image Credit : Asianet News

వెంకటేష్ తరువాత ఎవరు?

కేవలం వెంకటేష్ మాత్రమే కాకుండా, ఆ తర్వాత రోజుల్లో దేశ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారిని చూసి కూడా ఆమె బాగా ఆకర్షితులయ్యారట. టీవీలు, దినపత్రికల్లో రాజీవ్ గాంధీ గారి ఫోటోలు చూసి ఆయన చాలా స్మార్ట్‌గా, గుడ్ లుకింగ్‌గా ఉన్నారని అనేవారట రాశి. ఆ వయసులో న్యూస్ చూస్తుంటే ఇంట్లోవాళ్లు ఆశ్చర్యపోగా, "నేను పెళ్లి చేసుకుంటే రాజీవ్ గాంధీని చేసుకుంటా" అని చెప్పేవారట. అలా వెంకటేష్ తర్వాత రాజీవ్ గాంధీపై కూడా కొంతకాలం క్రష్ నడిచిందని రాశి సరదాగా గుర్తుచేసుకున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
దగ్గుబాటి వెంకటేష్
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Suriya Jyotika Record: విజయ్ - అజిత్ రికార్డును బ్రేక్ చేసిన సూర్య - జ్యోతికల వెడ్డింగ్ వీడియో!
Recommended image2
Megastar: చిరంజీవిని పరిచయం చేసిన పాపానికి.. సీనియర్ నటుడు అవకాశాలు కోల్పోయాడా? రెమ్యునరేషన్ నష్టపోయాడా? నిజమెంత?
Recommended image3
Magadheera: మగధీర మూవీ రిజెక్ట్ చేసిన హీరో, ఎన్ని సూపర్ హిట్స్ ఉన్నాయో తెలుసా.. అయినా కెరీర్ క్లోజ్
Related Stories
Recommended image1
Rajamouli కోడలు బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా? జగపతి బాబుతో బంధుత్వం ఎలాగంటే?
Recommended image2
ANR: సాంబార్ గాడు వచ్చాడురా.. అని అక్కినేని నాగేశ్వరరావు ను అవమానించింది ఎవరు? ఏఎన్నార్ ఏం చేశాడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved