బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ లక్కీ లక్ష్మణ్ తో పాటు.. ఈవారం థియేటర్లలో చిన్న సినిమాల సందడి
ఈ వారం థియేటర్లలో ఎక్కువగా చిన్న సినిమాలే పోటీ పడబోతున్నాయి. చాలా కాలం తరువాత ఈ రేంజ్ లో చిన్న సినిమాలు ఒకేసారి రిలీజ్ అవ్వడం ఈవీక్ లోనే జరుగుతోంది. దాదాపు ఏడెనిమిది చిన్న సినిమాలో సందడి చేయబోతున్నాయి.
కరోనా తరువాత పెద్ద సినిమాలు సెట్ అవ్వడానికే చాలా టైమ్ పట్టింది. అటువంటిది చిన్న సినిమాలు పరిస్థతి అయితే మరీ దారుణంగా తయారయ్యింది. ఈక్రమంలోనే ఫస్ట్ టైమ్ పెద్ద ఎత్తున చిన్న సినిమాలు పోటీ పడబోతున్నాయి. 2022 ఏడాదిలో చివరి వారంలో బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలు సందడిచేయబోతున్నాయి.
బిగ్‌బాస్ తో మంచి పేరు తెచ్చుకన్నాడు సోహెల్. విన్నర్ గా నిలవకపోయినా.. టైటిల్ విన్నర్ కంటే కూడా క్రేజ్ తెచ్చుకున్నాడు సోహెల్. ఫస్ట్ హీరోగా నటిస్తోన్న సినిమా లక్కీ లక్ష్మణ్. ఈ సినిమా డిసెంబర్ 30న రిలీజ్ కాబోతున్నది. ప్రేమనురాగాల కంటే డబ్బు గొప్పదని నమ్మే ఓ యువకుడి కథతో ఫన్ లవ్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందుతోంది. ఏ ఆర్ అభి దర్శకత్వం వహించాడు. బిగ్‌బాస్ షో తో మెగాస్టార్ నే మెప్పించిన సోహెల్ ఫస్ట్ సినిమా కావడంతో అందరి దృష్టి ఈసినిమాపైనే ఉంది. ఈ సినిమాలో సోహెల్ జంటగా.... మోక్ష హీరోయిన్గా నటిస్తోంది. అంతే కాదు రీసెంట్ గా బిగ్‌బాస్ సీజన్ 6 లో సందడిచేసిన కంటెస్టెంట్స్ గీతూ రాయల్ ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ పాత్రలో నటించింది.
హీరోగా నిలబడాలని బాగా ట్రై చేస్తున్నాడు యంగ్ స్టార్ ఆది సాయికుమార్. ఈసారి కాస్త గ్యాప్ ఇచ్చి టాప్ గేర్ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీ ఈ శుక్రవారమే థియేటర్లలోకి రాబోతున్నది. యాక్షన్ థ్రిల్లర్ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమాకు కె.శశికాంత్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో యంగ్ హీరో ఆది సాయికుమార్ క్యాబ్ డ్రైవర్‌గా కనిపించబోతున్నాడు. ఓ క్రైమ్‌లో చిక్కుకున్న అతడు ఎలా బయటపడ్డాడన్నదే ఈ సినిమా కథ. రియా సుమన్ హీరోయిన్గా నటిస్తోంది.
సాయిరోనక్, అంకిత సాహ, బిస్మి సాహ హీరోహీరోయిన్లుగా నటించిన రాజయోగం థియేటర్ల ద్వారా ప్రేక్షకుల్ని పలకరించబోతున్నది. కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమాకు రామ్ గణపతి దర్శకత్వం వహించాడు.
నందమూరి తారకరత్న, సునీల్, ప్రిన్స్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఎస్5 నో ఎగ్జిట్ సినిమా డిసెంబర్ 30న రిలీజ్ కాబోతున్నది. హారర్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాను దర్శకుడు సన్నీ కోమలపాటి తెరకెక్కించాడు. చాలా రోజులుగా పోస్ట్ పోన్ అవుతోన్న ఈ సినిమా ఎట్టకేలకు ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానుంది.