- Home
- Entertainment
- డబ్బుల కోసం వేరే మగాడితో ఒకే మంచంపై పడుకోలేను.. బిగ్ బాస్ పై స్టార్ హీరోయిన్ సెన్సేషన్ కామెంట్స్
డబ్బుల కోసం వేరే మగాడితో ఒకే మంచంపై పడుకోలేను.. బిగ్ బాస్ పై స్టార్ హీరోయిన్ సెన్సేషన్ కామెంట్స్
Bigg Boss: బిగ్‌బాస్ ఫ్యామిలీ ఎంటర్టైన్‌మెంట్ ఎప్పుడో ఆ గీత దాటేసిందనే విమర్శలు తరుచూ వింటునే ఉంటాం. కానీ, ఓ బాలీవుడ్ హీరోయిన్ బిగ్ బాస్ పై సెన్సేషన్ కామెంట్స్ చేసింది. ఒకే బెడ్‌పై వేరే వ్యక్తితో పడుకోననీ, అంత చీప్ కాదని షాకింగ్ కామెంట్స్ చేసింది.

బిగ్ బాస్ పై స్టార్ హీరోయిన్ సెన్సేషన్ కామెంట్స్
Bigg Boss: బిగ్‌బాస్ ఫ్యామిలీ ఎంటర్టైన్‌మెంట్ గా ప్రారంభమైన ఎప్పుడో ఆ గీత దాటేసింది. భాషతో సంబంధం లేకుండా ప్రతీచోట కంటెస్టెంట్లు దరిద్రంగా ప్రవర్తిస్తున్నారు. ఇక షోలో పాల్గొన్న వాళ్లల్లో కొంత బరితెగించేస్తున్నారనే విమర్శలు చాలానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో చాలామంది నటులు, నటీమణులు బిగ్‌బాస్ ఆఫర్లను తిరస్కరించిన సందర్భాలు ఉన్నాయి. కానీ, తాజాగా ఓ బాలీవుడ్ హీరోయిన్ మునుపెన్నడూ లేని విమర్శలు చేసింది. "డబ్బుల కోసం వేరే వ్యక్తితో బెడ్‌పై పడుకోలేను. నేను అంత చీప్ కాదు" అని బిగ్‌బాస్ మేకర్స్‌ను భారీ షాక్ ఇచ్చింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు?
టాలీవుడ్‌లో ఎంట్రీ – బాలీవుడ్‌కు తిరిగి వెళ్లిన తనుశ్రీ
బిగ్ బాస్ షోపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరోయిన్ ఎవరో కాదు.. బాలీవుడ్ భామ తనుశ్రీ దత్తా. ఈ అమ్మడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బిహార్‌కి చెందిన ఈ అందాల రాశి 2004లో ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్ విజేతగా నిలిచింది. ఆ తరువాత బాలీవుడ్‌లో వరుస అవకాశాలు అందుకుని మంచి ఫేమ్ సంపాదించుకుంది. ‘ఆషిక్ బనాయా అప్నే’ సినిమాలోని పాటతో ఈమెకు గుర్తింపు వచ్చింది. బాలకృష్ణ హీరోగా నటించిన ‘వీరభద్ర’ సినిమాతో టాలీవుడ్ లో కూడా అడుగుపెట్టింది. అయితే ఆ సినిమా డిజాస్టర్ కావడంతో తిరిగి బాలీవుడ్‌కి వెళ్లిపోయింది. హిందీలో పలు చిత్రాలు చేసిన స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.
మీటూ ఉద్యమంతో మళ్లీ వెలుగులోకి
సినీ కెరీర్‌లో కొన్ని సంవత్సరాల తర్వాత తనుశ్రీ సినిమాలకు దూరమైంది. కానీ 2018లో మీటూ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ, బాలీవుడ్‌లో పలువురు ప్రముఖులపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ గళం విప్పింది. దీంతో ఆమె మళ్లీ జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యింది. అలాగే.. ఇటీవల తనుశ్రీ వ్యక్తిగత జీవితం వార్తల్లో నిలిచింది. తన కుటుంబ సభ్యులు వేధిస్తున్నారని, తాను ఈ బాధ తట్టుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ వీడియో విడుదల చేసింది. “ఎవరైనా వచ్చి నన్ను సాయం చేయండి” అంటూ ఫిర్యాదు చేసిన ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో అభిమానులు ఆమెకు మద్దతుగా నిలిచారు.
రూ.1.65 కోట్ల ఆఫర్ రిజెక్ట్
తాజాగా బాలీవుడ్ హీరోయిన్ తనుశ్రీ దత్తా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో యాంకర్ బిగ్‌బాస్‌లో ఎంట్రీ విషయాన్ని ప్రశ్నించారు. దానికి సమాధానంగా ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది. “బిగ్‌బాస్ షో నాకు నచ్చదు. గత 11 ఏళ్లుగా ఈ షో మేకర్స్ ప్రతి ఏటా నన్ను సంప్రదిస్తున్నారు. ఒకసారి అయితే రూ. 1.65 కోట్లు ఆఫర్ చేశారు. అంతకంటే ఎక్కువ ఇస్తామని కూడా చెప్పారు. కానీ నేను తిరస్కరించాను” అని చెప్పింది.
బిగ్‌బాస్‌పై ఘాటైన విమర్శ
బిగ్ బాస్ రిజెక్ట్ చేయడానికి కారణం ఏమిటో వివరిస్తూ తనుశ్రీ, “బిగ్‌బాస్‌లో పురుషులు, మహిళలు ఒకే బెడ్‌పై పడుకుంటారు. అదే ప్లేస్‌లో గొడవలు పడతారు. ఇది నాకు అసలు నచ్చదు. నా ఆహారం విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉంటా. కేవలం ఒక రియాలిటీ షో కోసం మరో మగాడితో మంచం పంచుకునే అమ్మాయిని కాదు. నేను అంత చీప్ కాదు. ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా నేను బిగ్‌బాస్‌లో పాల్గొనను”అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.
ఆమె చేసిన ఈ సంచలన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు కూడా విభిన్న రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఆమెను సపోర్ట్ చేస్తుంటే, మరికొందరు బిగ్‌బాస్ ఫార్మాట్‌నే దారుణమని కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి తనుశ్రీ దత్తా బిగ్‌బాస్‌పై చేసిన ఈ విమర్శలు హాట్ టాపిక్‌గా మారాయి.