- Home
- Entertainment
- బిగ్ బాస్ రెమ్యునరేషన్ లిస్ట్: కామనర్స్ కు వేలల్లో.. సెలబ్రిటీలకు లక్షల్లో.. నాగార్జునకు కోట్లల్లో..
బిగ్ బాస్ రెమ్యునరేషన్ లిస్ట్: కామనర్స్ కు వేలల్లో.. సెలబ్రిటీలకు లక్షల్లో.. నాగార్జునకు కోట్లల్లో..
Bigg Boss Telugu 9 Remuneration List: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో 6 మంది కామనర్స్, 9 మంది సెలబ్రిటీలు పాల్గొన్నారు. సెలబ్రిటీలకు వారి పాపులారిటీ, డిమాండ్‌ను బట్టి బిగ్ బాస్ నిర్వాహకులు రెమ్యూనరేషన్ ఫిక్స్ చేశారు. రెమ్యూనరేషన్ వివరాలు ఇలా..

బిగ్ బాస్ కంటెస్టెంట్ల రెమ్యునరేషన్ వివరాలు
Bigg Boss Telugu 9 Remuneration List: ప్రతి ఏడాది బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి బిగ్ బాస్ సరికొత్త సీజన్లతో వస్తూ ఉంటుంది. తెలుగులో ఇప్పటికే 8 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో ప్రస్తుతం 9వ సీజన్‌తో అలరించడానికి ముందుకు వచ్చింది. ఈసారి మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టారు. అందులో 6 మంది కామనర్స్, 9 మంది సెలబ్రిటీలు ఉన్నారు. కామనర్స్‌ని హౌస్ ఓనర్స్ గా, సెలబ్రిటీలను టెనెంట్స్ గా విభజించి బిగ్ బాస్ ఈ సీజన్‌ను ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేశారు. బిగ్ బాస్ తెలుగు 9 - హోస్ నాగార్జున, సెలబ్రిటీ కంటెస్టెంట్స్, కామనర్స్ రెమ్యూనరేషన్ డీటైల్స్ ఇలా..
నాగార్జున రెమ్యూనరేషన్
బిగ్ బాస్ తెలుగు హోస్ట్ గా కింగ్ నాగార్జున చేస్తున్న విషయం తెలిసిందే. కింగ్ నాగ్ తన హోస్టింగ్ తో ఈ షోకు ఎనలేని పాపులరిటీ తీసుకవచ్చారు. మూడవ సీజన్ నుంచి ఇప్పటివరకు ఆయనే షోకి హోస్ట్‌గా ఉన్నారు. ఈ సీజన్ కోసం నాగార్జునకు ఏకంగా ₹40 కోట్లు రెమ్యూనరేషన్ అందిస్తున్నట్లు సమాచారం. అంతేకాక, అన్నపూర్ణ స్టూడియోలో ప్రత్యేక సెట్ ఏర్పాటు చేసినందున అక్కడి నుంచి కూడా బిగ్ బాస్‌కు భారీ ఆదాయం వస్తోంది.
భరణి శంకర్ (Bharani Shankar)
టీవీ సీరియల్ స్రవంతితో కెరీర్ ప్రారంభించి, సినిమాల్లోనూ నటించిన భరణి శంకర్, నాగబాబు ఫ్రెండ్‌గా టెలివిజన్ ద్వారా మరింత పాపులారిటీ సంపాదించారు. భరణి శంకర్ వారానికి రూ. 3.5 లక్షల రెమ్యూనరేషన్ అందిస్తున్నారట.
ఆశా షైనీ (Asha Saini / Flora Saini)
బాలయ్య సినిమా `నరసింహ నాయుడు`లో నటించి మెప్పించిన ఫ్లోరా సైనీ రెండో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆమె తన జీవితంలో ఎన్నో అవమానాలు ఫేస్ చేసింది. చిత్ర హింసకు గురయ్యింది. అవన్నీ దాటుకుని, వాటికి సమాధానం చెప్పేందుకు బిగ్ బాస్ కి వచ్చినట్టు తెలిపింది. ఈ అమ్మడు పాఫులారిటీని బట్టి వారానికి రూ. 3 లక్షల రెమ్యూనరేషన్ అందిస్తున్నారట.
సంజన గల్రానీ (Sanjana Garlani)
ఒకప్పుటి హీరోయిన్ సంజనా గాల్రానీ పదో కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టింది. ఈ అమ్మడు తన జీవితంలో పలు వివాదాలు ఎదుర్కొంది. ఓ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ జైలు పాలైంది కూడా. వాటిని నుంచి బయటపడి క్లీన్ చీట్ కూడా పొందింది. అయితే.. ఈ షో ద్వారా తన నిజాయితీని నిరూపించుకునేందుకు హౌజ్‌లోకి వచ్చినట్టు తెలిపారు. సంజన గల్రానీ వారానికి రూ. 2.75 లక్షల పారితోషికం అందుకుంటున్నట్లు తెలుస్తోంది.
రీతూ చౌదరి (Rithu Chowdhary)
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా తన ప్రయాణాన్నిమొదలు పెట్టి, జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఫేమస్ అయిన రీతూ చౌదరి. అలాగే, సీరియల్స్‌తోనూ గుర్తింపు పొందింది. ఈ ముద్దుగుమ్మ ఎనిమిదో కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. గ్లామర్ ఫోటోలతో రచ్చ చేసే రీతూ చౌదరీ ఆ మధ్య 700కోట్ల ల్యాండ్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంది. ఈ అమ్మడు వారానికి రూ. 2.5 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు టాక్.
సుమన్ శెట్టి (Suman Shetty)
తెలుగు, తమిళం, కన్నడ, భోజ్‌పురి ఇలా 300+ సినిమాల్లో నటించి గుర్తింపు పొందిన కమెడియన్ సుమన్ శెట్టి, ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. ఒకప్పటి స్టార్ కమెడియన్ సుమన్ శెట్టి 13వ కంటెస్టెంట్‌గా బీబీ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. సుమన్ శెట్టి వారానికి రూ. 2.5 లక్షలు రెమ్యూనరేషన్ గా అందుకుంటున్నారట.
ఇమ్మానుయేల్ (Emmanuel)
జబర్దస్త్ కామెడీ షోతో పాపులర్ అయిన ఇమ్మానుయేల్, కామెడీ టైమింగ్‌తో మంచి ఫాలోయింగ్ సంపాదించారు. నాల్గో కంటెస్టెంట్‌గా జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యుయెల్ ఎంట్రీ ఇచ్చారు. బిగ్ బాస్ హౌజ్‌లో గుర్తుండిపోయేలా పార్మామెన్స్ ఇవ్వడానికి సిద్దమయ్యారు. ఇతడు వారానికి రూ. 2.25 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట.
రాము రాథోడ్ (Ramu Rathod)
యూట్యూబర్‌గా కెరీర్ ప్రారంభించారు రాము రాథోడ్. ఆయన ఫోక్ సింగర్‌గా, డాన్సర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల అతని “రాను బొంబాయి కి రాను” పాట ప్రపంచవ్యాప్తంగా వైరలైంది. రాము రాథోడ్ 11వ కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇతడు వారానికి రూ. 2 లక్షల రెమ్యూనరేషన్ అందుకుంటున్నారట.
తనూజ గౌడ (Thanuja Gowda)
‘ముద్దమందారం’ సీరియల్‌తో టెలివిజన్ కెరీర్ ప్రారంభించి, పలు సీరియల్స్‌లో నటించింది తనూజ గౌడ. ఈసారి బిగ్ బాస్ హౌస్‌లో తన అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఈ అమ్మడు మొదటి కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ తెలుగు 9 హౌజ్‌లోకి వచ్చారు. తనూజ వారానికి రూ. 2.5 లక్షలు తీసుకుంటున్నారట.
శ్రేష్టి వర్మ (Shrasti Varma)
జానీ మాస్టర్ అసిస్టెంట్‌గా ప్రారంభించి, లేడీ కొరియోగ్రాఫర్‌గా పాపులారిటీ సంపాదించకుంది శ్రేష్టి వర్మ. ఆమె జానీ మాస్టర్ పై లైంగిక ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో వైరల్‌గా మారింది శ్రష్టి. `పుష్ప 2` కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ వారానికి రూ. 2 లక్షలు అందుకుంటున్నారట.
కామనర్స్ రెమ్యూనరేషన్ వివరాలు
బిగ్ బాస్ సీజన్ 9 లో తొలిసారి కామనర్స్ కూడా అవకాశం కల్పించారు. ఇలా సోల్జర్ కళ్యాణ్, మాస్క్ మాన్ హరిత హరీష్, దమ్ము శ్రీజ, డిమోన్ పవన్, ప్రియా శెట్టి, మర్యాద మనీష్ ఎంట్రీ ఇచ్చారు. వీరందరికీ వారానికి రూ.70,000 చొప్పున రెమ్యూనరేషన్ ఇస్తున్నారు. అంటే నెలకు రూ. 2.4 లక్షలు అందుకుంటున్నారు. రెమ్యూనరేషన్ విషయమే కాకుండా, హౌస్‌లో పాపులారిటీ ఆధారంగా ఫ్యూచర్‌లో బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్, సినిమాలు, టీవీ ఆఫర్స్ కూడా దక్కే అవకాశం ఉంది.