07:26 PM (IST) Sep 16

Bigg Boss Telugu 9 Live: హరిత హరీష్‌కి తనూజ హితబోధ

హరిత హరీష్‌ గత రెండు మూడు రోజులుగా డిస్టర్బ్ గా ఉంటున్నాడు. శనివారం, ఆదివారం ఎపిసోడ్‌లో నాగార్జున.. ఆయన రియాలిటీని బయటపెట్టడంతో తట్టుకోలేకపోయాడు. తన తప్పులను ఆయన రిసీవ్‌ చేసుకోలేకపోతున్నాడు. దీంతో మౌనంగా ఉన్నాడు. భోజనం చేయడం కూడా మానేశాడు. ఈక్రమంలో ఆయన్ని బుజ్జగించే చర్యలు చేపట్టారు. బిగ్‌ బాస్‌ ఆల్‌ రెడీ చెప్పాడు. రాము రాథోడ్‌కి ఆ బాధ్యతలు అప్పగించారు. అంతేకాదు తనూజ కూడా ఆయన్ని ఓదార్చే ప్రయత్నం చేసింది. నామినేషన్‌లో వీరిద్దరి మధ్య గట్టిగా వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత వెళ్లి ఆయన్ని కూల్ చేసే ప్రయత్నం చేసింది. తన రియాలిటీని చాటి చెప్పింది. అదే సమయంలో హరీష్‌కి ఎలా ఉండాలో హితబోధ చేసింది. 

05:16 PM (IST) Sep 16

Bigg Boss Telugu 9 Live: హరీష్‌ ఫైర్‌, రీతూ చౌదరీ ఎమోషనల్‌

హరిత హరీష్‌ నిన్నటి వరకు సైలెంట్‌గా ఉన్నాడు. బాధపడుతూ కనిపించాడు. కానీ నామినేషన్‌లో మాత్రం రెచ్చిపోయాడు. తనదైన స్టయిల్‌లో కౌంటర్‌ ఇస్తూ కంటెస్టెంట్లని ఆడుకున్నారు. ఈ క్రమంలో రీతూ చౌదరీపై ఆయన ఫైర్‌ అయ్యారు. దెబ్బకి ఆమె ఎమోషనల్‌ అయ్యింది. 

YouTube video player

05:10 PM (IST) Sep 16

Bigg Boss Telugu 9 Live: నీ కామెడీ వేషాలు నా వద్ద సాగవు

సుమన్‌ శెట్టి ఒకప్పుడు మంచి కమెడియన్‌ అనే విషయం తెలిసిందే. తాజాగా ఆయన బిగ్‌ బాస్‌ తెలుగు 9లో సందడి చేస్తున్నారు. ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న ఆయన ఇప్పుడు ఓపెన్‌ అవుతున్నారు. సరదాగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా నామినేషన్‌లో సంజనా గల్రానీ నామినేట్‌ చేస్తుండగా, ఆమె ఫైర్‌ అయ్యింది. 

YouTube video player