కండలు తిరిగిన దేహంతో తాప్సీ.. వాహ్ చంపేశావ్ పో అంటోన్న రకుల్
First Published Dec 22, 2020, 9:12 PM IST
సొట్టబుగ్గల సుందరి తాప్సీ ఫిట్ నెస్ కోసం కఠోరంగా శ్రమిస్తుంది. కండలు తిరిగే దేహాన్ని పొందింది. సుకుమారంగా ఉండే ఆమె తొడలు ఉక్కులా మారిపోయాయి. తన కొత్త సినిమా కోసం తాప్సీ ఇంతగా కష్టపడుతుంది. తన హార్డ్ వర్క్ ని సోషల్ మీడియా ద్వారా ఫోటోల రూపంలో పంచుకుంటూ ఆనందించడంతోపాటు, అభిమానులను అలరిస్తుంది.

తాప్సీ ప్రస్తుతం `రష్మీ రాకెట్` చిత్రంలో నటిస్తుంది. స్పోర్ట్స్ బేస్డ్ చిత్రమిది. రన్నింగ్ వంటి గేమ్స్ ప్రధానంగా సాగుతుంది. ఈ సినిమా కోసం తాప్సీ చాలా రోజులుగా కష్టపడుతుంది.

ఎక్కువ సమయంలో జిమ్‌లోనే గడుపుతుంది. ఖాళీ టైమ్ మొత్తం జిమ్‌కే కేటాయించింది. పాత్ర కోసం తన శరీరాన్ని మలుచుకుంటూ చూపరును ఫిదా చేస్తుంది.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?