అల్లు రామలింగయ్య పై కోపం, షూటింగ్ నుంచి వెళ్లిపోయిన ఎస్వీఆర్, కారణం ఏంటి?
స్టార్ హీరోలకంటే ఎక్కువ ఇమేజ్ ఉన్న నటుడు ఎస్వీ రంగారావు. ఆయనతో మాట్లాడంటే స్టార్ హీరోలు కూడా భయపడేవారట. ఇక ఆయనకు కోపం వస్తు మాత్రం ఇంక అంతే సంగతులు. ఓసందర్భంలో సీనియర్ నటుడు అల్లు రామలింగయ్య పై ఎస్వీఆర్ ఫైర్ అయ్యారట. ఎందుకంటే?
- FB
- TW
- Linkdin
Follow Us

అప్పట్లో నటీనటులు చాలా సింపుల్ గా ఉండేవారు. కలిసి మెలిసి సినిమాలు చేసుకున్నారు. షూటింగ్ స్పాట్ లో కూడా ఒక కుటుంబంలా ఉండేవారు. అయితే కొంత మంది స్టాస్స్ మధ్య అప్పుడప్పుడు మనస్పర్ధలు కామన్ గా ఉండేవి. అయితే మరికోందరు స్టార్ నటులకు మాత్రం ముక్కుమీద కోపం ఎక్కువగా ఉండేది.
ఎస్వీఆర్ లాంటి స్టార్ యాక్టర్స్ సెట్ లో ఉంటే అన్నీ కరెక్ట్ గా జరిగేవి, ఏమైనా తేడా వస్తే మాత్రం ఎస్వీఆర్ అస్సలు ఒప్పుకునేవారు కాదు. ఆయనకు కోపం వస్తే.. ఆరోజు షూటింగ్ పై ఆ ప్రభావం కనిపించేది. ఎవరైనా ఆర్టిస్ట్ లు సమయానికి రాకపోయినా.. ఎస్వీఆర్ ఒప్పుకునేవారు కాదు. మరీ ముఖ్యంగా తనతోకంబినేషన్ సీన్లు ఉన్నవారు. ఎస్వీఆర్ కంటే కూడా ముందే వచ్చి రెడీగా ఉండేవారు.
ఈ క్రమంలో అప్పటి స్టార్ కమెడియన్ అల్లు రామలింగయ్య వల్ల ఎస్వీ ఆర్ కు కోపం వచ్చిందంట వెంటనే.. అక్కడ ఉన్న దర్శకుడిపై కోపంతో ఫైర్ అయ్యి, వెంటనే షూటింగ్ నుంచి వెళ్లిపోయారట ఎస్వీ రంగారావు. ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటే.
డబ్బుకు లోకం దాసోహం సినిమా షూటింగ్ మద్రాస్ లోని స్టూడియోలో జరుగుతుంది. ఈసినిమా షూటింగ్ లో ఆ రోజు ఎన్టీఆర్, ఎస్వీఆర్ కైకాల, జమున, లాంటి పెద్ద పెద్ద నటులు ఉన్నారు. వారికి సబంధించి షూటింగ్ జుుగుతుంది. ఒక్కొక్కరిపై షైట్ జరుగుతుంది.ఇక ఎస్వీఆర్ కూడా రెడీ అయ్యి ఎదురు చూస్తున్నారు.
షాట్ కోసం పిలుస్తాని ఎదురు చూస్తున్నారు ఎస్వీఆర్, కాని ఎంతకీ పిలవడంలేదు. కారణం ఎస్వీరంగారవు కి, కమెడియన్ అల్లు రామలింగయ్య కు కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. కాని అల్లు రామలింగయ్య యాత్రం ఇంకా సెట్స్ లోకి రాలేదు. ఆయన వేరే షూటింగ్ ఉండటంతో, అక్కడ లేట్ అయ్యింది. ఈ విషయం తెలియని ఎస్వీఆర్.. ఏందుకు షాట్ లోకి పిలవడం లేదు అని అడిగారట. అయితే అల్లు రామలింగయ్య రాలేదని చెప్పడంతో ఎస్వీఆర్ కు పట్టరాని కోపం వచ్చిందట.
అల్లు రామలింగయ్య కోసం నేను వెయిట్ చేయాలా అని మండిపడటంతో పాటు షూటింగ్ ఏదైనా ఉంటే రేపు పెట్టుకోండి. అది కూడా అల్లు రామలింగయ్యను నా ఇంటికి తీసుకువచ్చి చూపిస్తేనే ఆఞన వచ్చాడి నమ్ముతాను అని చెప్పి వెళ్లిపోయారట ఎస్వీఆర్. దాంతో ఆ నెక్ట్స్ డే అల్లు రామలింగయ్య నుబ్రతిమలాడి ప్రొడక్షన్ మేనేజర్ ఆయన్ను తీసుకుని ఎస్వీఆర్ ఇంటికి వెళ్లారట. ఆయన్ను చూపిస్తే అప్పుడు ఎస్వీఆర్ షూటింగ్ కు వచ్చారట. ఇలా అప్పట్లో అల్లు వారిపై ఎస్వీఆర్ కోపం చూపించం వైరల్ అయ్యింది.