100 సినిమాలు చేసిన స్టార్ హీరోయిన్, పేదరికం వల్ల 45 ఏళ్లకే మరణించిన నటి ?
ఫిల్మ్ ఇండస్ట్రీలో గొప్పగా బ్రతికిన కొంత మంది తారులు చివరి రోజుల్లో మాత్రం ఎన్నో ఇబ్బందులు పడ్డారు. కొంతమంది అయితే తినడానికి తిండి కూడా లేక అనాథల్లా మరణించిన వారు ఉన్నరు. అలాంటి ఓ హీరోయిన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us

సినిమా తారల జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. రోజులన్నీ ఒకేలా ఉండవు. గొప్పగా బ్రతికిన వారు కూడా చివరిరోజుల్లో ఆర్ధిక, ఆరోగ్య పరంగా ఇబ్బందులు పడ్డవారు ఉన్నారు. కోట్లు కూడబెట్టి.. చివరకు చిల్లిగవ్వ కూడా లేకుండా అనాథల్లా మరణించినవారు కూడా ఉన్నారు. ఇక 100 సినిమాలకు పైగా చేసిన ఓ హీరోయిన్ చివరిరోజుల్లో ఎన్నో ఇబ్బందులుపడింది. చివరకు అంత్యక్రియలకు కూడా డబ్బులు లేని పరిస్థితి వచ్చింది. ఆ హీరోయన్ ఎవరో కాదు అశ్విని.
తెలుగు, తమిళ చిత్రాల్లో ఒకప్పుడు తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి అశ్విని జీవితం విషాదాంతంగా ముగిసింది. వందకు పైగా సినిమల్లో నటించినా, చివరకు అనాథలా మిగిలిపోయింది, అనారోగ్యంతో మరణించిన ఆ స్టార్ నటి అంత్యక్రియలకు కూడా ఓ హీరో సాయం చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
అచ్చతెలుగు అమ్మాయి అశ్విని, నెల్లూరు జిల్లాలో జన్మించింది. బాలనటిగా తేరంగేట్రం చేసింది. భానుమతి తెరకెక్కించిన భక్త ధృవ చిత్రంతో తన కెరీర్ మొదలుపెట్టింది. ఇంటర్ చదువుతున్న సమయంలోనే హీరోయిన్ గా అవకాశాలు అందుకున్న ఆమె, 90వ దశకంలో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది.
తెలుగులో అనాదిగా ఆడది, భలే తమ్ముడు, అరణ్యకాండ, కలియుగ పాండవులు, చూపులు కలిసిన శుభవేశ, పెళ్లి చేసి చూడు, కొడుకు దిద్దిన కాపురం వంటి విజయవంతమైన సినిమాల్లో నటించి తన ప్రత్యేకతను చాటుకుంది అశ్విని. తెలుగు అమ్మాయి అయినప్పటికీ, ఆమె ఎక్కువగా తమిళ సినిమాల్లోనే నటించింది. అక్కడే ఎక్కువగా తనకంటూ గుర్తింపు సంపాదించింది.
ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని రహస్యంగా వివాహం చేసుకుంది అశ్విని. ఆ పెళ్లితో ఆమె జీవితం మారిపోయింది. కష్టాలు మొదలయ్యాయి. ఎన్నో కలలు కన్న అశ్విని జీవితం అనుకున్న విధంగా సాగలేదు. కుటుంబ సమస్యలు, కెరీర్‌లో అవకాశాలు తగ్గిపోవడంతో ఆమె మానసిక ఒత్తిడికి గురైంది. ఈ ఒత్తిడి ఆమె ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసింది.
అనారోగ్య సమస్యలతో కొన్నేళ్లు బాధపడిన అశ్విని, 2012 సెప్టెంబర్ 23న తుదిశ్వాస విడిచింది. ఆ సమయంలో ఆమె పరిస్థితి చాలా దారుణంగా మారింది. అంతేకాదు, తన సొంత ఊరిలో అంత్యక్రియలు చేయాలనేది అశ్విని చివరి కోరిక, కాని ఆమె మృతదేహాన్ని స్వస్థలానికి తరలించేందుకు కూడా ఖర్చులు భరించలేని పరిస్థితులు వారి ఫ్యామిలలో ఉన్నాయి. అప్పుడు తమిళ నటుడు పార్థిబన్ ముందుకు వచ్చి ఆ బాధ్యతను తీసుకున్నారు.
ఒకప్పుడు వెండితెరపై స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన అశ్విని, చివరకు గుర్తింపు లేకుండా, ఆర్థిక ఇబ్బందుల మధ్య కన్నుమూసింది. 100 సినిమాలకు పైగా చేసిన అశ్విని 45 ఏళ్ల చిన్నవయస్సులోనే కన్నుమూసింది. ఆమెకు ఒక కూమారుడు ఉండగా, ఆయన చదువు బాధ్యతలు కూడా పార్థిబన్ తీసుకున్నారు.