- Home
- Entertainment
- శంకర్ 1000 కోట్ల డ్రీమ్ ప్రాజెక్ట్, డిజాస్టర్ ఎదురైనా తగ్గేది లేదంటున్న స్టార్ డైరెక్టర్
శంకర్ 1000 కోట్ల డ్రీమ్ ప్రాజెక్ట్, డిజాస్టర్ ఎదురైనా తగ్గేది లేదంటున్న స్టార్ డైరెక్టర్
వరుస ప్లాప్ లు ఎదురవుతున్నా తగ్గేది లేదంటున్నారు సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్. ఈసారి తన డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు. దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తో సినిమా చేయబోతున్నాడు శంకర్. ఇంతకీ ఏంటా సినిమా?
- FB
- TW
- Linkdin
Follow Us

సౌత్ సినిమాకు గుర్తింపు తీసుకొచ్చిన మొదటి దర్శకుడు శంకర్. అప్పట్లోనే పాన్ ఇండియా సినిమాలు చేసిన ఈ స్టార్ డైరెక్టర్ కు ఈమధ్య టైమ్ అస్సలు కలిసిరావడం లేదు. తీసిన ప్రతీ సినిమా డిజాస్టర్ అవుతోంది. శంకర్ కు వరుసగా ఫ్లాప్స్ ఎదురవుతున్న సంగతి తెలిసిందే. ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ సినిమాలతో రెండు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ ఇవ్వడంతో శంకర్ పని అయిపోయింది అంటూ విమర్శలు వినిపించాయి. అంతే కాదు శంకర్ నుంచి ఇంకా ఇండియన్ 3 కూడా రిలీజ్ అవ్వాల్సి ఉంది కానీ అది అవుతుందో లేదో కూడా క్లారిటీ లేదు.
ఇలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నా కాని శంకర్ మాత్రం ఏమాత్రం తగ్గేది లేదంటున్నాడు. ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే తన డ్రీం ప్రాజెక్టును తెరపైకి తీసుకువస్తానంటున్నాడు. భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ స్థాయిలో శంకర్ చేయబోయే డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటి? రీసెంట్ గా ఆయన ఈ విషయంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేశారు. ఇంతకీ శంకర్ ఏమన్నారంటే?
రీసెంట్ గా వేల్పరి బుక్ ఈవెంట్ లో డైరెక్టర్ శంకర్ తన డ్రీమ్ ప్రాజెక్టుపై క్లారిటీ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ఇప్పుడు నా డ్రీం ప్రాజెక్టు వేల్పరి. అవతార్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాంటి సినిమాలకు వాడిన అడ్వాన్స్ టెక్నాలజీని వాడి ఆ రేంజ్ లో సినిమా తీయాలని ఉంది. ఇది మన తమిళ ఇండియన్ సినిమా అని గర్వంగా చెప్పుకునేలా ఉంటుంది. ఈ డ్రీమ్ ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి అని అన్నారు. ఇక శంకర్ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే ఈ విషయంలో శంకర్ పై రకరకాల విమర్శలు వస్తున్నాయి.
వేల్పరి సినిమాకు దాదాపు వెయ్యి కోట్ల వరకూ బడ్జెట్ పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. వేల్పరి అనే వ్యక్తి ఒక యోధుడు. కొన్ని వందల ఏళ్ళ క్రితం తమిళనాడు, కేరళలోని కొన్ని ప్రాంతాలను పాలించిన యోధుడు. చోళులు, పాండ్యులను కూడా ఈ రాజు ఓడించాడు. ఆ చరిత్రను పుస్తకరూపంలోకి తీసుకువచ్చారు, కాగా ఆ బుక్ ను ఆధారంగా చేసుకుని శంకర్ సినిమా తెరకెక్కిస్తానంటున్నాడు. దీంతో అసలు ఇప్పుడు శంకర్ ని నమ్మి వెయ్యి కోట్లు ఎవరు పెడతారు అంటూ ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు.
అయితే శంకర్ అనుకున్నది సాధించినట్టు తెలుస్తోంది. వేల్పరి సినిమాకు ఆయనకు నిర్మాతలు దొరికారాని సమాచారం. బాలీవుడ్ స్టార్ నిర్మాత కరణ్ జోహార్, నెట్ ఫ్లిక్స్, సన్ పిక్చర్స్ సంస్థలు కలిసి శంకర్ వేల్పరి సినిమాని నిర్మించబోతున్నట్టు సమాచారం. వెయ్యి కోట్లకు పైగా ఖర్చుపెట్టి ఇండియాలోనే అత్యధిక బడ్జెట్ సినిమాగా శంకర్ వేల్పరి నిలుస్తుందని తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
అయితే దీనిపై ఎటువంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ మాత్రం రాలేదు. నిజంగానే సన్ పిక్చర్స్, నెట్ ఫ్లిక్స్, కరణ్ జోహార్.. శంకర్ ని నమ్మి వెయ్యి కోట్ల బడ్జెట్ వేల్పరి సినిమాపై పెడతారా, ఈసినిమా ను శంకర్ చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఒక వేళ శంకర్ చేయబోయే సినిమా ప్లాప్ అయితే హ్యాట్రిక్ ఫేయిల్యూర్, అది కూడా పాన్ ఇండియా హ్యాట్రీక్ ఫెయిల్యూర్ ఫేస్ చేసిన దర్శకుడిగా శంకర్ నిలిచిపోతారు.