100 రోజుల్లో సిక్స్ ప్యాక్ , సూర్య డైట్ ప్లాన్ తెలిస్తే మతిపోవాల్సిందే
సూర్య ఫిట్ నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఏడాది సూర్యకు 50 ఏళ్ళు వస్తాయి. అయినా సరే 30 ఏళ్ళ యంగ్ స్టార్ అంటే నమ్మేస్తారు. ఇంత హ్యాండ్సమ్ గా.. అంత ఫిట్ నెస్ ను సూర్యా ఎలా మెయింటేన్ చేస్తున్నాడో తెలుసా?

సూర్య
వారసత్వంగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చాడు సూర్య. పాత తరం హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ శివకుమార్ కొడుకు సూర్య. తండ్రి సాయంతో సినిమాల్లోకి వచ్చినా, తర్వాత తన కష్టంతో ఎదిగి టాప్ హీరో అయ్యాడు. సూర్యకు ఇప్పుడు 49 ఏళ్లు. కానీ ఇప్పటికీ యంగ్‌గా ఉండటానికి కారణం అతని డైట్, వ్యాయామాలే.
Also Read: ప్రభాస్ తమ్ముడు హీరోగా నటించిన ఏకైక సినిమా ఏదో తెలుసా? ఇండస్ట్రీలో ఎందుకు సక్సెస్ అవ్వలేదు?
సూర్య ఫిట్‌నెస్
రీసెంట్‌గా కంగువా సినిమాలో కూడా సిక్స్ ప్యాక్‌తో కనిపించాడు సూర్య. సిక్స్ ప్యాక్ కోసం 100 రోజుల డైట్ ప్లాన్ ఫాలో అవుతున్నానని సూర్య ఓ సందర్భంలో చెప్పాడు. ఈ విషయం గురించి మాట్లాడుతూ, నాకు 49 ఏళ్లు. ఈ వయసులో మెటబాలిజం తగ్గుతుంది. అందుకే ఈ వయసులో ఎక్కువ కార్డియో చేయాలి. క్యాలరీ డెఫిసిట్ డైట్ కూడా ఫాలో అవ్వాలి.
Also Read: సమంత ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలుసా ? అతనితో బ్రేకప్ ఎలా అయ్యింది?
సూర్య సిక్స్ ప్యాక్
నా బాడీని ఫిట్‌గా ఉంచడానికి 100 రోజుల డైట్ ప్లాన్ ఫాలో అవుతున్నా. ఈ 100 రోజుల్లో ఎలాంటి పౌడర్లు, మందులు తీసుకోకుండా, సహజంగా పోషకాలున్న ఆహారం తిని సిక్స్ ప్యాక్ బాడీకి మారాను అని సూర్య చెప్పాడు. తనకు ఇష్టమైన ఆహారం గురించి కూడా చెప్పాడు. కొంగు బిర్యానీ అంటే రైస్, పప్పు కలిపి వండిన అన్నం అంటే చాలా ఇష్టమట.
Also Read:అడల్ట్ కామెడీ కోసమే జబర్థస్త్ చూస్తున్నారు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ పై ఇంద్రజ షాకింగ్ కామెంట్స్,
సూర్య సినిమాలు
49 ఏళ్ల వయసులో కూడా హెల్తీగా ఉన్న అందరిని తన ఫిట్ నెస్ తో ఆశ్చర్యపరుస్తున్నాడు. సూర్య ప్రస్తుతం రెట్రో అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేస్తున్నాడు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా మే 1న రిలీజ్ కానుంది. దీంతో పాటు ఆర్.జే.బాలాజీ డైరెక్షన్‌లో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా కూడా ఈ ఏడాదే రిలీజ్ అవుతుంది.
Also Read: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కు ముహూర్తం ఫిక్స్, ఈసారి రెండు నెలలు ముందే సందడి