- Home
- Entertainment
- కృష్ణ 8 ఏళ్ల వయసులో 100 రోజుల వేడుక జరుపుకున్న అక్కినేని నాగేశ్వరావు సినిమా ఏదో తెలుసా?
కృష్ణ 8 ఏళ్ల వయసులో 100 రోజుల వేడుక జరుపుకున్న అక్కినేని నాగేశ్వరావు సినిమా ఏదో తెలుసా?
సూపర్ స్టార్ కృష్ణకు 8 ఏళ్లు ఉండగానే ఎన్టీఆర్, ఏఎన్నార్ స్టార్ హీరోలుగా ఉన్నారు. వారి సినిమాలు చూస్తూ పెరిగిన కృష్ణ హీరో అవ్వాలని ఇన్స్పైర్ అయ్యింది మాత్రం ఏఎన్నార్ ను చూసి. కృష్ణ స్కూల్ కు వెళ్లేప్పుడు 100 రోజుల వేడుక జరిగిన ANR మూవీ ఏదో తెలుసా?

ఎన్టీఆర్, ఏఎన్నార్ ను తట్టుకుని నిలబడ్డ కృష్ణ
ఎన్టీఆర్, ఏఎన్నార్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని ఏలుతున్న రోజుల్లోనే ఇండస్ట్రీకి వచ్చి తన టాలెంట్ చూపించాడు సూపర స్టార్ కృష్ణ. ఇండస్ట్రీకి వచ్చీ రావడంతోనే తన టాలెంట్ చూపించి రికార్డ్ ల రారాజుగా వెలుగు వెలిగారు సూపర్ స్టార్. తెలుగు సినిమాను కొత్త పుంతలు తొక్కించారు. అంతే కాదు ఎన్టీఆర్, ఏఎన్నార్ ల తో కాంపిటేషన్ ను తట్టుకుని నిలబడి స్టార్ హీరోగా ఎదిగి చూపించాడు కృష్ణ. ఒక్కప్పుడు నందమూరి, అక్కినేని ఫ్యాన్స్ మాత్రమే ఉన్న సమయంలో.. తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకోగలిగారు కృష్ణ ఫిల్మ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ఎదిగి, అద్భుతమైన సినిమాలెన్నో అందించారు.
KNOW
కృష్ణకు 8 ఏళ్ల వయసు ఉన్నప్పుడు రిలీజ్ అయిన ఏఎన్నార్ సినిమా
నిజానికి కృష్ణ స్కూల్లో చదువుకునే రోజుల్లోనే ఎన్టీఆర్, ఏఎన్నార్ లు పెద్ద హీరోలుగా ఇండస్ట్రీని ఏలుతున్నారు. కృష్ణకు 8ఏళ్లు ఉన్నప్పుడే అక్కినేని నాగేశ్వారావు బ్లాక్ బస్టర్ మూవీ దేవదాసు రిలీజ్ అయ్యింది. తెనాలిలో కృస్ణ స్కూల్ కు వెళ్లేప్పుడు దేవదాసు 100 రోజుల వేడుకలు జరుగుతున్నాయి. అప్పుడు జనాలు రోడ్డుమీదకు వచ్చి ఏదో వింత చూస్తున్నారట.
అప్పుడే కృష్ణ స్కూల్ కు వెళ్తూ.. ఏం జరుగుతుంది అని గమనించారట. అప్పుడే ఆయనకు తెలిసింది. దేవదాసు 100 రోజుల వేడుకల కోసం ఏఎన్నార్, సావిత్రి తెనాలి వచ్చారు, అదే ఈ హడావిడి అని. అప్పుడే ఆరోజుల్లోనే ఆయనపై అభిమానం పెంచుకున్నాను అని సూపర్ స్టార్ కృష్ణ గతంలో జరిగిన అక్కినేని నాగేశ్వరావు 75 సంవత్సరాల సినీ వేడుకలలో వెల్లడించారు.
అక్కినేని క్రేజ్ చూసి హీరో అవ్వాలని ఫిక్స్ అయిన కృష్ణ
కృష్ణ మాట్లాడుతూ.. ''నేను స్కూల్లో ఉన్నప్పుడే ఎన్టీఆర్ ఏఎన్నార్ లపై అభిమానం పెంచుకున్నాను. ఇక అది కాలేజీ రోజుల్లోకి వచ్చే సరికి ఎక్కువైపోయింది. ఎన్టీఆర్ సినిమాలు కూడా విపరీతంగా చూసేవాడిని. కాని ఎన్టీఆర్ ను ఎప్పుడు మా ఊరిలో చూసే అవకాశం నాకు రాలేదు. నాగేశ్వరావు గారు మాత్రం ఊరూర తిరిగే వారు. అప్పట్లో ఆయనకు ప్రతీ ఊరిలో పౌర సన్మానం చేశారు. ఆకార్యక్రమానికి కూడా నేను వెళ్లాను, ఆతరువాత ఏలూరులో నేను చదువుకునే రోజుల్లో మా కాలేజీకి ఏఎన్నార్ గారు వచ్చారు. అప్పుడు ఆయన క్రేజ్ చూసి నేను కూడా హీరో అవ్వాలి అని డిసైడ్ అయ్యాను. అప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టాను'' అని కృష్ణ ఎఎన్నార్ సన్మాన సభలో వెల్లడించారు.
కృష్ణను హీరోగా సెలక్ట్ చేసిన అక్కినేని నాగేశ్వరావు.
కృష్ణ హీరో అవ్వాలని ప్రయత్నించినప్పుడు, అనుకోకుండా ఆయన మొదటి సినిమాకు ఏఎన్నార్ కారణం అయ్యారు. కృష్ణ మొదటి సినిమా తేనెమనసులు. ఈ సినిమా ఆడిషన్ కోసం ఫోటోలు పంపించారు కృష్ణ. అప్పుడు ఆ సినిమాకు హీరో సెలక్షన్ లో జడ్జ్ ల టీమ్ లో అక్కినేని నాగేశ్వరావు కూడా ఉన్నారు. ఆయనే కృష్ణను తేనె మనసులు సినిమాకు సెలక్ట్ చేశారు. ఈ విషయాన్ని కూడా కృష్ణ అక్కినేని 75 సంవత్సరాలు సినిమా వేడుకల్లో వెల్లడించారు. అప్పుడు తనను హీరోగా సెలక్ట్ చేసింనందుకు ఏఎన్నార్ కు కృష్ణ కృతజ్ఞతలు కూడా తెలుపుకున్నారు.
టాలీవుడ్ లో హీరో గా కొత్త ప్రయోగాలు చేసిన కృష్ణ
తెలుగు సినీ చరిత్రలో ఎన్నో రికార్డులు, సంచలనాలు సృష్టించిన ఘనత సూపర్ స్టార్ కృష్ణకే చెందుతుంది. ఆయన పరిచయం చేసిన సాంకేతికతలు, సినిమాల్లో ప్రయోగాలు ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేశాయి. టాలీవుడ్ లో టెక్నికల్‌గా చూస్తే తొలి కలర్ సినిమా, ఫస్ట్ ఫుల్ స్కోప్ మూవీ, తొలి స్టీరియో సౌండ్ టెక్నాలజీ, ఫస్ట్ R/O టెక్నాలజీ సినిమాలు అన్నీ కృష్ణ పరిచయం చేసినవే. టాలీవుడ్ లో ఫస్ట్ కౌబాయ్, జేమ్స్ బాండ్ సినిమాలు కూడా కృష్ణ హీరోగానే చేశారు.
టాలీవుడ్ కు టెక్నాలజీ పరిచయం చేసిన సూపర్ స్టార్
అంతే కాదు కలర్ ప్రింట్ కు సబంధించిన టెక్నాలజీ మన దేశంలో లేకపోతే, అమెరికా నుంచి మూడు నెలల ముందు డబ్బులు కట్టి ఆర్డర్ ఇచ్చి మరీ కలర్ ఫ్రింట్ చెప్పించారట సూపర్ స్టార్ కృష్ణ. అప్పట్లో ఆ ప్రింట్ కోసం దాదాపు రెండు లక్షల పైనే ఖర్చు చేశారట. అందుకే కృష్ణ చేసిన సాహసాలు ఇంకెవరు చేయలేరు అని అంటారు. అంతే కాదు సినిమాల్లో డూప్ లేకుండా యాక్షన్ సీన్స్, అడ్వెంచర్ సీన్స్ చేసిన ఘనత కూడా సూపర్ స్టార్ ఖాతాలోనే ఉంది. ఒకే ఏడాది 18 సినిమాలు చేసిన రికార్డ్ కూడా కృష్ణదే. కృష్ణ సినిమాల్లోనే ఇలాంటివి సాధ్యం అయ్యేవి. ఇవే కాకుండా ఆయన సినిమాలు టాలీవుడ్ లో సృష్టించిన రికార్డులెన్నో ఉన్నాయి.