కృష్ణ సినిమా వల్ల 144 సెక్షన్, రికార్డులు తిరగరాసిన సినిమా ఏదో తెలుసా?
టాలీవుడ్ లో రికార్డుల రారాజుగా సూపర్ స్టార్ కృష్ణకు పేరుంది. సినిమాల విషయంలో ఆయన క్రియేట్ చేసిన సంచలనాలు ఎన్నో. తెలుగు పరిశ్రమకు టెక్నాలజీని పరిచయం చేసిన కృష్ణ, అద్భుతాలెన్నో చేశారు. కృష్ణ సినిమా వల్ల 144 సెక్షన్ పెట్టాల్సి వచ్చిందని మీకు తెలుసా?

తెలగు సినిమాచేత కొత్త అడుగులు వేయించిన కృష్ణ
తెలుగు సినీ చరిత్రలో ఎన్నో రికార్డులు, సంచలనాలు సృష్టించిన ఘనత సూపర్ స్టార్ కృష్ణకే చెందుతుంది. ఆయన పరిచయం చేసిన సాంకేతికతలు, సినిమాల్లో ప్రయోగాలు ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేశాయి. టాలీవుడ్ లో టెక్నికల్‌గా చూస్తే తొలి కలర్ సినిమా, ఫస్ట్ ఫుల్ స్కోప్ మూవీ, తొలి స్టీరియో సౌండ్ టెక్నాలజీ, ఫస్ట్ R/O టెక్నాలజీ సినిమాలు అన్నీ కృష్ణ పరిచయం చేసినవే. టాలీవుడ్ లో ఫస్ట్ కౌబాయ్ సినిమా కూడా కృష్ణ హీరోగానే చేశారు.
టాలీవుడ్ కు టెక్నాలజీ పరిచయం చేసిన హీరో
అంతే కాదు కలర్ ప్రింట్ కు సబంధించిన టెక్నాలజీ మన దేశంలో లేకపోతే, అమెరికా నుంచి మూడు నెలల ముందు డబ్బులు కట్టి ఆర్డర్ ఇచ్చి మరీ కలర్ ఫ్రింట్ చెప్పించారట సూపర్ స్టార్ కృష్ణ. అప్పట్లో ఆ ప్రింట్ కోసం దాదాపు రెండు లక్షల పైనే ఖర్చు చేశారట. అందుకే కృష్ణ చేసిన సాహసాలు ఇంకెవరు చేయలేరు అని అంటారు. అంతే కాదు సినిమాల్లో డూప్ లేకుండా యాక్షన్ సీన్స్, అడ్వెంచర్ సీన్స్ చేసిన ఘనత కూడా సూపర్ స్టార్ ఖాతాలోనే ఉంది అయితే కృష్ణ సినిమాల్లోనే ఇలాంటివి సాధ్యం అయ్యేవి. ఇవే కాకుండా ఆయన సినిమాలు టాలీవుడ్ లో సృష్టించిన రికార్డులెన్నో ఉన్నాయి.
కృష్ణ సినిమా కోసం 144 సెక్షన్
కృష్ణ సినిమా కోసం ఏ కంగా 144 సెక్షన్ పెట్టాల్సి వచ్చిందంటే ఎవరైనా నమ్ముతారా? ఇప్పుడు అంటే పాన్ ఇండియా హీరోల స్టార్ ఇమేజ్ తో ఫ్యాన్స్ చేసే కొన్ని పనుల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాని అప్పట్లో, పెద్దగా జనాలు లేని రోజుల్లో కృష్ణ సినిమా కోసం ఏకంగా 144 సెక్షన్ పెట్టారంటే ఆ సినిమా ఎంత ప్రత్యేకమో అర్ధం అవుతుంది. ఇంతకీ ఆ సినిమా ఏదో కాదు సింహాసనం. కృష్ణ కెరీర్ లో చాలా ప్రత్యేకమైన చిత్రం ‘సింహాసనం’. ఈ చిత్రం వల్లే విజయవాడలో పోలీసులు 144 సెక్షన్ విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సింహాసనం సినిమాలో విశేషాలెన్నో
1986లో విడుదలైన 'సింహాసనం' సినిమా తెలుగు చిత్రపరిశ్రమలో ఓ సంచలనంగా చెప్పవచ్చు. ఈ సినిమాను కృష్ణ స్వయంగా నిర్మించి, దర్శకత్వం వహించడమే కాకుండా తాను మూడు పాత్రల్లో నటించారు. సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కగా, విడుదల సమయానికి భారీగా క్రేజ్‌ని సొంతం చేసుకుంది. ఈసినిమాపై అంచనాలు ఎంతలా పెరిగాయంటే అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్లతో ఈసినిమా గురించి ఎదురు చూశారు. సినిమా రిలీజ్ టైమ్ లో రోడ్ల మీద తండోపతండాలుగా జాతరలా జనాలు కనిపించారట.
సంచలన విజయం సాధించిన కృష్ణ సింహాసనం
ఇక ఈసినిమా విజయవాడలో రిలీజ్ అయినప్పుడు రాజ్ థియేటర్ వద్ద సుమారు 12 కిలోమీటర్ల మేర అభిమానులు క్యూ కట్టారు. టికెట్లు పొందేందుకు వేలాది మంది జనం తరలి వచ్చారు. ఎండ్లబండ్లు కట్టుకుని మరీ థియేటర్లకు జనం పోటెత్తారు. ఈ కారణంగా ట్రాఫిక్ నిలిచిపోయింది.
ఆ ప్రాంతంలో పరిస్థితులు అదుపు తప్పుతుండటంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆ ప్రాంతంలో పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు. ఈ విషయాన్ని కృష్ణ గారు స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. టికెట్ చూపించినవారికి మాత్రమే ఆ వీధిలో నడవనిచ్చే పరిస్థితి నెలకొంది. సింహాసనం సినిమా క్రియేట్ చేసిన రికార్డ్ అది. ఈ విషయాన్ని కృష్ణ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
మద్రాస్ లో 100 రోజులు ఆడిన అరుదైన సినిమా
అంతే కాదు సింహాసనం సినిమా మరికొన్ని రికార్డ్ లకు కేంద్రం అయ్యింది. మద్రాసులో 100 రోజులు ప్రదర్శించబడిన అరుదైన తెలుగు చిత్రంగా సింహాసనం నిలిచింది. ఈసినిమా విడుదలయ్యాక 400 బస్సుల్లో అభిమానులు విజయయాత్రకు హాజరయ్యారు. ఇది మాత్రమే కాదు, కృష్ణ సినిమాలు సంక్రాంతికి విడుదలైన రికార్డుల్లోనూ ముందున్నాయి.
1976 నుంచి 21 ఏళ్లపాటు ప్రతి సంక్రాంతికి ఆయన సినిమాలు విడుదల కావడం ఒక అపూర్వమైన ఘనత. అలాగే ఆయన నటించిన ‘అల్లూరి సీతారామరాజు’ హైదరాబాద్‌లో ఏకంగా ఒక సంవత్సరం పాటు ప్రదర్శించబడింది. ఈ నేపథ్యంలో ‘సింహాసనం’ సినిమా కృష్ణ కెరీర్ లోనే కాదు, తెలుగు సినిమా చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిపోయింది.