- Home
- Entertainment
- కృష్ణ ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయడానికి ఇబ్బంది పడిన హీరోయిన్ ఎవరో తెలుసా? కారణం ఏంటి?
కృష్ణ ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయడానికి ఇబ్బంది పడిన హీరోయిన్ ఎవరో తెలుసా? కారణం ఏంటి?
సూపర్ స్టార్ కృష్ణ తన కెరీర్ లో ఎంతో మంది హీరోయిన్లతో నటించి మెప్పించారు. చాలామంది హీరోయిన్లకు స్టార్ డమ్ కూడా ఇచ్చారు కృష్ణ. అయితే ఒక హీరోయిన్ తో మాత్రం నటించడానికి బాగా ఇబ్బందిపడేవారట. ఆమె ఎవరు? కారణం ఏంటి

సూపర్ స్టార్ కృష్ణ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు. స్టార్ హీరో మాత్రమే కాదు మంచి మనసున్న హీరోగా కూడా ఆయన గుర్తింపు పొందరు. ఆయనతో నటించడానికి చాలామంది హీరోయిన్లు పోటీపడేవారు. రెండు తారాల హీరోయిన్లతో కలిసి కృష్ణ నటించి మెప్పించారు. జయసుధ, జయప్రద నుంచి సౌందర్య, రోజా వరకు ఎంతో మంది హీరోయిన్లు కృష్ణకు జోడీగా నటించారు.
అయితే ఎంత మంది హీరోయిన్లు నటించినా కృష్ణ తన కెరీర్ లో ఎటువంట కాంట్రవర్సీని ఫేస్ చేయలేదు. కాకపోతే హీరో అయ్యేటప్పటికే పెళ్లై పిల్లలు ఉన్న కృష్ణ.. హీరోగా మారిన తరువాత హీరోయిన్, దర్శకురాలు విజయనిర్మలను ప్రేమించి రెండో పెళ్లి చేసుకున్నారు. విజయ్ నిర్మలతో జంటగా చాలా సినిమాల్లో నటించిన కృష్ణ, ఆమె డైరెక్షన్ లో కూడా చాలా సినిమాలు చేశారు సూపర్ స్టార్. ఈక్రమంలో కృష్ణకు సబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది.
సూపర్ స్టార్ కృష్ణ చాలామంది హీరోయిన్లతో కలిసి నటించారు, డ్యూయోట్లు పాడారు, ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేశారు కాని.. ఒక్క హీరోయిన్ తో మాత్రం నటించడానికి ఇబ్బందిపడ్డారట. డ్యూయెట్లు చేయాలన్నా, ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయాలన్నీ కూడా ఆ హీరోయిన్ తో కృష్ణకు చాలా ఇబ్బందిగా ఉండేదట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు జయసుధ. అవును జయసుధ హీరోయిన్ అంటే కృష్ణ చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యేవారట. కారణం ఏంటీ అనే విషయాన్ని జయసుధ ఓ ఇంటర్వూలో వెల్లడించారు.
జయసుధ విజయ నిర్మలకి చాలా దగ్గర బంధువు. ఈ విషయం చాలామందికి తెలియదు. విజయనిర్మల ఫ్యామిలీ తమిళనాడులో సెటిల్ అయిన తెలుగువారు. విజయనిర్మల కూడా చెన్నైలోనే జన్మించారు. ఇటు జయసుధ కూడా చెన్నైలోనే జన్మించారు. జయసుధ కి విజయ నిర్మల అత్త అవుతారు. కృష్ణ-విజయ నిర్మల కాంబినేషన్లో వచ్చిన ‘పండంటి కాపురం’ సినిమాలో జయసుధ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. విజయ నిర్మల స్వయంగా జయసుధను కావాలని పట్టుపట్టి ఈ పాత్రకు తీసుకున్నారు. ఈరకంగా ఇండస్ట్రీకి జయసుధను పరిచయం చేసింది విజయనిర్మలనే.
హీరోయిన్ గా జయసుధ ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించారు. ఈక్రమంలోనే ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబుతో పాటు కృష్ణ సరసన కూడా జయసుధ కొన్ని సినిమాల్లో నటించారు. అయితే కృష్ణ మాత్రం జయసుధతో నటించేప్పుడు ఇబ్బందిపడేవారట. తన కళ్లముందు పెరిగిన అమ్మాయి జయసుధతో ఇబ్బందిగానే డ్యూయోట్లకు డాన్స్ చేసేవారట కృష్ణ. అందుకే వీరి కాంబినేషన్ లో చాలా తక్కవ సినిమాలు వచ్చాయి. ఈ విషయాన్ని జయప్రదం కార్యక్రమంలో జయసుధ, జయప్రదతో అన్నారు.
ఇక హీరోయిన్ గా స్టార్ డమ్ చూసిన జయసుధ.. ఆతరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ఎన్నో అద్భుతమైనపాత్రలు చేశారు. యంగ్ స్టార్ హీరోలకు అమ్మగా నటించిన ఆమె.. ఆతరువాత కాలంలో కుర్ర హీరోలకు నానమ్మగా కూడా నటించి మెప్పించారు. ప్రస్తుతం జయసుధ చాలా తక్కువగా సినిమాలు చేస్తున్నారు. అప్పుడప్పుడు మాత్రమే వెండితెరపై కనిపిస్తున్నారు.