- Home
- Entertainment
- Superstar Krishna సంక్రాంతి మొనగాడుగా నిలవడానికి భీజం వేసిన సినిమా ఏంటో తెలుసా? ఎన్టీఆర్, శోభన్ బాబుకి ఝలక్
Superstar Krishna సంక్రాంతి మొనగాడుగా నిలవడానికి భీజం వేసిన సినిమా ఏంటో తెలుసా? ఎన్టీఆర్, శోభన్ బాబుకి ఝలక్
Superstar Krishna ఒకప్పుడు సంక్రాంతి మొనగాడుగా ఉండేవారు. ఆయన సంక్రాంతి విన్నర్ కావడానికి భీజం వేసిన మూవీ `పాడి పంటలు` కావడం విశేషం. ఈ మూవీ దెబ్బకి ఎన్టీఆర్, శోభన్ బాబు సినిమాలు అడ్రస్ లేకుండా పోయాయి.

అల్లూరి సీతారామరాజుతో కృష్ణ ఇండస్ట్రీ హిట్
సూపర్ స్టార్ కృష్ణ స్టార్ డమ్‌ని పెంచి ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్‌ని చేసిన మూవీ `అల్లూరి సీతారామరాజు`. 1974లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద సంచలన విజయం సాధించింది. ఈ సినిమాని చాలా వరకు కృష్ణనే డైరెక్ట్ చేశారు. ఇందులో అల్లూరి సీతారామరాజుగా ఆయన నట విశ్వరూపం చూపించారు. దీంతో ఆడియెన్స్ కూడా బ్రహ్మరథం పట్టారు. ఈ మూవీ విజయం గురించి ఇప్పటికీ చెప్పుకుంటారంటే అది సృష్టించిన సంచలనాలు ఏం స్థాయిలో ఉన్నాయనేది అర్థం చేసుకోవచ్చు.
కృష్ణకి 14 డిజాస్టర్లు
`అల్లూరి సీతారామరాజు` వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత కృష్ణ నటించిన అన్నీ సినిమాలు పరాజయం చెందాయి. ఏకంగా 14 సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి. ఇక కృష్ణ పని అయిపోయిందని అంతా అనుకున్నారు. ఇండస్ట్రీ గుసగుసలు కూడా స్టార్ట్ అయ్యాయి. నిర్మాతలు వెనకడుగు వేశారు. ఓ దశలో కృష్ణతో సినిమాలు చేసేందుకు ఒక్క నిర్మాత కూడా రాలేదు. దీంతో కొంత గ్యాప్ తీసుకునే తానే నిర్మాతగా మారి `పాడిపంటలు` మూవీని తీశారు. దీనికి పీ చంద్రశేఖర్(పి.సి. రెడ్డి) దర్శకత్వం వహించారు. ఇందులో కృష్ణ, విజయ నిర్మల జంటగా నటించారు.
సంక్రాంతి పండక్కి పర్‌ఫెక్ట్ విలేజ్ ఫిల్మ్ గా నిలిచిన పాడి పంటలు
1976 జనవరి 14న `పాడి పంటలు` విడుదలై భారీ విజయాన్ని సాధించింది. కృష్ణ బౌన్స్ బ్యాక్ అయ్యేలా చేసింది. ఆయన రేంజ్ ఏంటో చూపించింది. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీకి పల్లె జనం సైతం బ్రహ్మరథం పట్టారు. తెలుగుదనం ఉట్టిపడేలా మూవీని రూపొందించారు. పల్లెటూర్లలోని సిరిసంపదలను కళ్లకి కట్టినట్టుగా చూపించారు. అప్పటికి వరుస ఫెయిల్యూర్స్ లో ఉన్న కృష్ణ కెరీర్‌ని మలుపు తిప్పిందీ చిత్రం. సంక్రాంతి పండక్కి రావడం, కథ కూడా తెలుగు పల్లెటూర్లని తలపించేలా ఉండటం, గ్రామాభ్యుదయ కథాంశం కావడం ఇవన్నీ ఈమూవీ విజయానికి కారణమయ్యాయి.
కృష్ణని సంక్రాంతి మొనగాడుగా నిలిపిన పాడిపంటలు
అయితే అప్పటి వరకు సూపర్ స్టార్ కృష్ణ నటించిన సినిమాలు సంక్రాంతికి పెద్దగా రాలేదు. అడపాదడపా ఒకటి అరా వచ్చినా, సంక్రాంతిని స్పెషల్‌గా భావించలేదు. రెగ్యూలర్ రిలీజ్‌లో కొన్ని సంక్రాంతికి వచ్చాయి. కానీ `పాడిపంటలు` మాత్రం సంక్రాంతి పండక్కి ఉన్న దమ్మేంటో చూపించింది. ఈ సినిమాకి ఊహించని కలెక్షన్లు రావడంతో ఇక కృష్ణ సంక్రాంతి పండగని స్పెషల్‌గా భావించారు. ఆ తర్వాత వరుసగా సంక్రాంతి పండక్కి తన సినిమాలు ఉండేలా చూసుకున్నారు. అలా చాలా వరకు ఆయన నటించిన సినిమాలు సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. అప్పట్లో కృష్ణని సంక్రాంతి మొనగాడుగా పిలిచేవారు.
ఎన్టీఆర్, శోభన్ బాబు సినిమాలకు పాడి పంటలు ఝలక్
ఇదిలా ఉంటే `పాడిపంటలు` సమయంలో ఈ మూవీకి పోటీగా, ఎన్టీఆర్ `భీమకవి`, శోభన్ బాబు నటించిన `పిచ్చిమారాజు` చిత్రాలు విడుదలయ్యాయి. ఆ టైమ్‌లో ఈ హీరోలు ఫామ్‌లో ఉన్నారు. అలాంటి టైమ్‌లో వారికి పోటీగా `పాడిపంటలు` మూవీని రిలీజ్ చేస్తే పరాజయం తప్పదని చాలా మంది కృష్ణని వ్యతిరేకించారట. కానీ ఎవరి మాట వినకుండా మూవీని రిలీజ్ చేశారు. బ్లాక్ బస్టర్ అందుకున్నారు. `పాడిపంటలు` దెబ్బకి ఎన్టీఆర్, శోభన్ బాబు చిత్రాలు అడ్రస్ లేకుండా పోయాయట. అలా కృష్ణ సంక్రాంతి మొనగాడిగా నిలవడానికి `పాడిపంటలు` భీజం వేసిందని చెప్పొచ్చు.
కృష్ణ నటించిన సంక్రాంతి సినిమాలు
`పాడిపంటలు` తర్వాత వరుసగా `కురుక్షేత్రం`, `ఇంద్రధనస్సు`, `భలే కృష్ణుడు`, `ఊరికి మొనగాడు`, `బెజవాడ బెబ్బులి`, `ఇద్దరు దొంగలు`, `అగ్ని పర్వతం`, `తండ్రీ కొడుకు ఛాలెంజ్`, `కలియుగ కర్ణుడు`, `రాజకీయ చదరంగం`, `ఇన్ స్పెక్టర్ రుద్ర`, `పరమశివ`, `నెంబర్ వన్` `అమ్మదొంగ` వంటి చిత్రాల వరుసగా సంక్రాంతికి విడుదలై మెప్పించాయి. ఇందులో చాలా వరకు విజయం సాధించాయి.

