- Home
- Entertainment
- Kamal Haasan: మమ్ముట్టిని ఎక్కువగా కలవనందుకు బాధగా ఉందంటూ కమల్ ఎమోషనల్ పోస్ట్.. అభిమానులకు ఆశ్చర్యపరిచే పిలుపు
Kamal Haasan: మమ్ముట్టిని ఎక్కువగా కలవనందుకు బాధగా ఉందంటూ కమల్ ఎమోషనల్ పోస్ట్.. అభిమానులకు ఆశ్చర్యపరిచే పిలుపు
Kamal Haasan: మలయాళ మెగాస్టార్ మమ్ముట్టికి కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయనకు కమల్ హాసన్ విషెస్ తెలిపారు. అయితే తమ మధ్య ఉన్న 40ఏళ్ల రసహ్య స్నేహాన్ని బయటపెట్టారు. ఎమోషనల్ పోస్ట్ పెట్టారు కమల్.

కమల్, మమ్ముట్టి మధ్య రహస్య స్నేహం
భారతీయ చిత్ర పరిశ్రమలో ఎన్నో స్నేహాలను మనం చూసి ఉంటాం. కానీ, కెమెరా ముందు ఒక్కసారి కూడా కలిసి నటించని ఇద్దరు గొప్ప కళాకారులు, తమ మధ్య ఒక రహస్యమైన, స్నేహాన్ని 40 ఏళ్లకు పైగా కొనసాగించడం విశేషం. వాళ్లు మరెవరో కాదు; లోకనాయకుడు కమల్ హాసన్, మలయాళ చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ నటుడు మమ్ముట్టి. ఇటీవల మమ్ముట్టికి కేంద్ర ప్రభుత్వం 'పద్మభూషణ్' పురస్కారం ప్రకటించిన తర్వాత, కమల్ విడుదల చేసిన విషెస్ పోస్ట్ వీరి 'నిశ్శబ్ద' స్నేహాన్ని ప్రపంచానికి చాటి చెబుతుంది.
40ఏళ్లుగా రహస్య స్నేహం
వీరిద్దరూ కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదు, కనీసం ఒక్క సన్నివేశంలో కూడా నటించలేదు. అయినా, వీరి మధ్య ఇంత సాన్నిహిత్యం ఎలా అనేది ఆసక్తికరంగా మారింది. దీని గురించి కమల్ ప్రస్తావిస్తూ, సాహిత్యంలో వచ్చే కోప్పెరుంజోళన్ - పిసిరాందైయార్ స్నేహాన్ని ఉదాహరణగా చెబుతారు. అంటే ఆ ఇద్దరూ ఒకరినొకరు చూసుకోకుండానే ఒకరిపై ఒకరు గొప్ప గౌరవం, ప్రేమ కలిగి ఉండేవారు. కమల్, మమ్ముట్టిల స్నేహం కూడా అలాంటిదే. ఒకరినొకరు దూరం నుంచి ఆరాధించడమే కాకుండా, ఒకరి నటనను మరొకరు నిజాయితీగా చర్చించుకుని, విమర్శించుకుని తమను తాము మెరుగుపరుచుకోవడమే వీరి 40 ఏళ్ల స్నేహ బంధానికి విజయ రహస్యం.
మమ్ముట్టి విషయంలో బాధని వ్యక్తం చేసిన కమల్
ఈ సుదీర్ఘ స్నేహంలో కమల్‌కు ఒక చిన్న బాధ ఉందని తన పోస్ట్‌లో వెల్లడించారు. `మేమిద్దరం ఇంకాస్త ఎక్కువగా కలుసుకుని ఉంటే బాగుండేదని ఇప్పుడు అనిపిస్తోంది` అని కమల్ అన్నారు. సౌత్ సినిమాల్లో గొప్ప స్థాయిలో ఉన్న ఈ ఇద్దరు నటులు, అహంకారం లేకుండా ఒకరినొకరు కలుసుకోవడంలో విఫలమయ్యామని బాధపడటం అభిమానులను కదిలించింది. ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
నా అభిమానులు మమ్ముట్టికి అభిమానులుగా ఉండాలి
ఒక నటుడి అభిమానులు మరో నటుడిని విమర్శించుకునే ఈ రోజుల్లో, "నా అభిమానులు మమ్ముట్టి అభిమానులుగా కూడా ఉండాలన్నదే నా కోరిక" అని కమల్ చెప్పడం సినీ పరిశ్రమలో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించింది. 40 ఏళ్లుగా తెరపై కలవని ఈ 'ధ్రువతారలు', రాబోయే కాలంలోనైనా కలిసి నటిస్తారా? అనేది చూడాలి. కానీ ఈ ఇద్దరిని ఒకే తెరపై చూడాలనేది అభిమానులు కోరిక. అది ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి.

