MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Roja Selvamani: చిరంజీవి, రోజా, సురేఖ దొంగతనంగా మారువేషంలో చేసిన పనేంటో తెలుసా? వామ్మో అరాచకం

Roja Selvamani: చిరంజీవి, రోజా, సురేఖ దొంగతనంగా మారువేషంలో చేసిన పనేంటో తెలుసా? వామ్మో అరాచకం

చిరంజీవి రోజాల కాంబినేషన్‌కి టాలీవుడ్‌లో మంచి పేరుంది. ఈ ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ వర్కౌట్‌ అయ్యింది. అయితే సినిమాలే కాదు, తెరవెనుక వీరిద్దరు కలిసి కొన్ని చిలిపి పనులు కూడా చేశారట.

2 Min read
Author : Aithagoni Raju
Published : Oct 07 2026, 01:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మూడు సినిమాలతో రచ్చ చేసిన చిరంజీవి, రోజా
Image Credit : Asianet News

మూడు సినిమాలతో రచ్చ చేసిన చిరంజీవి, రోజా

చిరంజీవి, రోజా కలిసి మూడు సినిమాలు చేశారు. `ముఠా మేస్త్రీ`, `ముగ్గురు మొనగాళ్లు`, `బిగ్‌ బాస్‌` చిత్రాల్లో నటించారు. వీటిలో రెండు సినిమాలు బాగా ఆడాయి. కానీ వీరి జోడీకి మంచి పేరొచ్చింది. ముఖ్యంగా వీరి కెమిస్ట్రీ బాగా వర్కౌట్‌ అయ్యింది. ఇద్దరు కలిసి డాన్స్ చేసి చూడ్డానికి కనువిందుగానూ ఉంటుంది. రోజా.. చిరంజీవితో నటించడానికి ఎప్పుడూ ఆసక్తి చూపిస్తుంటుంది. ఇప్పుడు కూడా ఆయనతో కలిసి నటించాలని ఉందని పలు ఇంటర్వ్యూలో చెప్పింది రోజా. సినిమాలకు మించి చిరంజీవి గారితో మంచి అనుబంధం ఉందని చెప్పింది రోజా. ఈ క్రమంలో వీళ్లు మారువేషంలో చేసే దొంగపనులను వెల్లడించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బిర్యానీ కోసం చిరంజీవి, రోజా, సురేఖ మారు వేషంలో చేసిన పని
Image Credit : Asianet News

బిర్యానీ కోసం చిరంజీవి, రోజా, సురేఖ మారు వేషంలో చేసిన పని

రోజా కెరీర్‌ ప్రారంభంలో చిరంజీవి ఫ్యామిలీకి చాలా క్లోజ్‌గా ఉండేదట. ఈ క్రమంలో వీళ్లు కొన్ని చిలిపి పనులు చేసేవారట. చిరంజీవి, ఆయన భార్య సురేఖతో కలిసి వీళ్లు మారువేషంలో బయటకు వెళ్లేవారట. ఆ విషయాలను రోజా వెల్లడించింది. అప్పట్లో హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో ఓ పాతకాలపు ఫేమస్ బిర్యానీ సెంటర్ ఉండేదట. అక్కడ బిర్యానీ తినాలని చిరంజీవి, రోజా అనుకునేవారట. అయితే చిరంజీవి స్టార్‌డమ్ కారణంగా సాధారణంగా బయటకు వెళ్లడం అంత సులభం కాదు. అందుకే ఎవరికీ గుర్తుపట్టకుండా మారువేషాల్లో వెళ్లేవారట. రోజా స్కార్ఫ్‌తో ముఖాన్ని కవర్ చేసుకునేవారని, చిరంజీవి క్యాప్ పెట్టుకునేవారని ఆమె గుర్తుచేసుకున్నారు. సురేఖ కూడా వీరిద్దరితో కలిసి వెళ్లేవారని తెలిపారు.

35
బిర్యానీ తింటూ దొరికిపోయిన వైనం
Image Credit : Instagram/Roja Selvamani

బిర్యానీ తింటూ దొరికిపోయిన వైనం

ఎప్పుడు బిర్యానీ తినాలని అనిపించినా ఇదే పనిచేసేవాళ్లట. అయితే ఎంత జాగ్రత్తగా వెళ్లినా బిర్యానీ తినే సమయంలో అసలు విషయం బయటపడేదట. ముఖాలకు కప్పుకున్నవి తీసేసి తినడం మొదలుపెట్టగానే అభిమానులు గుర్తుపట్టేవారని రోజా నవ్వుతూ చెప్పారు. ఆ తర్వాత ఫొటోల కోసం అభిమానులు పోటీపడేవారని తెలిపారు. దీంతో ఎవరికీ తెలియకుండా వెళ్లిన బిర్యానీ ప్లాన్ చివరకు అభిమానులతో ఫొటోలు దిగే కార్యక్రమంగా మారిపోయేదని ఆమె చెప్పుకొచ్చారు.

45
చిరంజీవి, రోజా డాన్సులకు ఆడియెన్స్ ఫిదా
Image Credit : Asianet News

చిరంజీవి, రోజా డాన్సులకు ఆడియెన్స్ ఫిదా

చిరంజీవి, రోజా కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు కూడా అప్పట్లో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా `ముఠామేస్త్రి`లో వీరిద్దరి కెమిస్ట్రీ, పాటలు ప్రత్యేకంగా గుర్తుండిపోయాయి. 1993లో విడుదలైన ఈ చిత్రానికి ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. చిరంజీవి ముఠామేస్త్రి, మంత్రి అనే రెండు విభిన్న పాత్రల్లో కనిపించగా, రోజా మంత్రి పీఏ పాత్రలో నటించారు. ఈ సినిమాలోని పాటలు అప్పట్లో మంచి ఆదరణ పొందాయి. ఇందులో ఎంత ఘాటు ప్రేమయో` అనే పాట అప్పట్లో ఊపేసింది. బాగా పాపులర్‌ అయ్యింది.

55
చిరంజీవికి పోటీగా డాన్సు చేసిన రోజా
Image Credit : Asianet News

చిరంజీవికి పోటీగా డాన్సు చేసిన రోజా

ఆ తర్వాత `ముగ్గురు మొనగాళ్లు`లోనూ చిరంజీవి, రోజా కలిసి నటించారు. ఈ సినిమాలో చిరంజీవి ట్రిపుల్ రోల్‌లో కనిపించడం విశేషం. అనంతరం ‘బిగ్ బాస్’ సినిమాలో కూడా వీరిద్దరి కాంబినేషన్ కనిపించింది. ఇందులో `మావ మావ` పాట ఓ ఊపు ఊపేసింది. ఇందులో చిరంజీవికి పోటీగా రోజా డాన్స్ చేయడం విశేషం.

వీటితోపాటు హిందీ `జెంటిల్‌మేన్‌`లో స్పెషల్‌ సాంగ్‌ చేసింది. ఇదిలా ఉంటే `ముఠామేస్త్రి` షూటింగ్ సమయంలో తనకు నటనపై ఆసక్తి తగ్గిపోయి సినిమాలు వదిలేయాలని అనిపించేదని కూడా రోజా గత జ్ఞాపకాలను పంచుకున్నారు. అయితే చిరంజీవి తన నటనను, డ్యాన్స్‌ను ప్రశంసిస్తూ ప్రోత్సహించారని చెప్పారు. ఇక ప్రస్తుతం చిరంజీవి `కాకా` మూవీలో నటిస్తుండగా, రోజా మళ్లీ రీఎంట్రీకి ప్లాన్‌ చేసుకుంటోంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
రెండోసారి తల్లి కాబోతున్న మహేష్ బాబు లక్కీహీరోయిన్, యశ్ చెప్పిందే నిజమైందిగా?
Recommended image2
Chiranjeevi Songs: ఆ హీరో చిరంజీవి సాంగ్స్ చేయడం మెగా ఫ్యామిలీకి ఇష్టం లేదా ? అందుకే ఆపేశా అంటూ కామెంట్స్
Recommended image3
Nagarjuna: ఛి.. ఛి ఇదేం పని అనుకున్న నాగార్జున, బిగ్ బాస్ హోస్ట్ ఎలా అయ్యాడు, కింగ్ షాకింగ్ కామెంట్స్
Related Stories
Recommended image1
Chiranjeevi Remuneration: ఫస్ట్ సినిమాకి చిరంజీవి పారితోషికం ఎంతో తెలుసా? మెగాస్టార్‌ అవ్వడమంటే ఈజీనా?
Recommended image2
Highest Multistarrer Hero: తెలుగులో అత్యధిక మల్టీస్టారర్స్ చేసిన హీరో ఎవరో తెలుసా? ఏకంగా 80 సినిమాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved