MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రెండోసారి తల్లి కాబోతున్న మహేష్ బాబు లక్కీహీరోయిన్, యశ్ చెప్పిందే నిజమైందిగా?

రెండోసారి తల్లి కాబోతున్న మహేష్ బాబు లక్కీహీరోయిన్, యశ్ చెప్పిందే నిజమైందిగా?

Kiara Advani Second Pregnancy: బాలీవుడ్ స్టార్ కపుల్ సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ త్వరలో రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. స్వయంగా వారు సోషల్ మీడియాలో ఈ గుడ్ న్యూస్ చెప్పారు.ఈ పోస్ట్‌పై బాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 07 2026, 01:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
బాలీవుడ్ క్యూట్ కపుల్
Image Credit : #KiaraAdvani

బాలీవుడ్ క్యూట్ కపుల్

బాలీవుడ్ క్యూట్ కపుల్ సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వాణీ తమ ఫ్యాన్స్‌కు మరో గుడ్ న్యూస్ చెప్పారు. ఈ స్టార్ జంట త్వరలోనే రెండో బిడ్డకు స్వాగతం పలకబోతున్నారు. కియారా సోషల్ మీడియాలో ఓ క్యూట్ ఫోటోను షేర్ చేస్తూ ఈ సంతోషకరమైన విషయాన్ని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మా జీవితం ధన్యమైంది..
Image Credit : Instagram

మా జీవితం ధన్యమైంది..

కియారా షేర్ చేసిన ఆ అందమైన ఫోటోలో.. వాళ్ల మొదటి కూతురు సరాయా (Saraayah) తన చిన్న చేత్తో ఓ తెల్లటి సాక్స్‌ను పట్టుకుని ఉంది. ఆ పాప చేతికి సిద్ధార్థ్, కియారా తమ చేతులతో సపోర్ట్ ఇస్తూ కనిపించారు. కియారా ఈ ఫోటోకు ఓ ఎమోషనల్ క్యాప్షన్ కూడా ఇచ్చారు. 'మరోసారి ఈ అద్భుతమైన బహుమతితో మా జీవితం ధన్యమైంది. మా హృదయాలు ప్రేమ, కృతజ్ఞతతో నిండిపోయాయి' అని రాసుకొచ్చారు. ఈ పోస్ట్ క్షణాల్లోనే వైరల్ అయిపోయింది. ఆలియా భట్, కరీనా కపూర్ లాంటి బాలీవుడ్ స్టార్స్‌తో పాటు ఫ్యాన్స్ కూడా ఈ జంటకు శుభాకాంక్షలు వెల్లువలా కురిపిస్తున్నారు.

34
ముందే చెప్పిన యశ్
Image Credit : X

ముందే చెప్పిన యశ్

కియారా రాకింగ్ స్టార్ యశ్ పాన్-ఇండియా సినిమా 'టాక్సిక్' (Toxic)లో మెయిన్ రోల్ చేస్తోంది. ఆమె రీసెంట్‌గానే మాతృత్వం గురించి మాట్లాడారు. ఆమె రాజ్ షమానీ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. 'తల్లి అయ్యాక నేను పూర్తిగా కొత్త మనిషిగా మారిపోయాను. బిడ్డ పుట్టాక మళ్లీ పనిలోకి వచ్చినప్పుడు నాలో ఓ ఆడపులి (Tigress) లాంటి శక్తి, ధైర్యం వచ్చినట్లు అనిపిస్తోంది' అని చెప్పారు.

2025 జూలైలో ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఈ జంట, ఇప్పుడు తమ కుటుంబాన్ని మరింత పెంచుకునే సంతోషంలో ఉన్నారు. టాక్సిక్ సినిమా హీరో యశ్.. కియారా ప్రెగ్నెన్సీ గురించి ముందే అనౌన్స్ చేశారు. ఆయన ఆ టైమ్‌లో కష్టమైన సీన్స్ లేదా యాక్షన్ సీన్స్ చేయొద్దని ఆమెకు సలహా కూడా ఇచ్చారు.

44
మహేష్ బాబు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ..
Image Credit : Asianet News

మహేష్ బాబు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ..

కియారా అద్వాని సూపర్ స్టార్ మహేష్ బాబు తో భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. మహేష్ బాబు కెరీర్ కు కూడా ఈ మూవీ బూస్ట్ ఇచ్చింది. ఇక ఈసినిమా తరువాత ఆమె రామ్ చరణ్ తో చేసిన రెండు సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి. రామ్ చరణ్ తో వినయ విధేయ రామ, గేమ్ ఛేంజర్ సినిమాల్లో నటించింది కియారా. ఈమూవీస్ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్స్ గా నిలిచాయి.

సిద్ధార్థ్ - కియారా లవ్ స్టోరీ

సిద్ధార్థ్, కియారా 2021లో వచ్చిన సూపర్ హిట్ మూవీ 'షేర్షా' షూటింగ్ టైమ్‌లో ప్రేమలో పడ్డారు. వాళ్లు ఆ తర్వాత 2023 ఫిబ్రవరి 7న రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో ఉన్న సూర్యగఢ్ ప్యాలెస్‌లో చాలా గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు రీల్ లైఫ్‌లోనే కాకుండా రియల్ లైఫ్‌లో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు వీళ్ల జీవితంలోకి మరో చిన్నారి రాబోతుండటంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
మహేష్ బాబు ఘట్టమనేని
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi Songs: ఆ హీరో చిరంజీవి సాంగ్స్ చేయడం మెగా ఫ్యామిలీకి ఇష్టం లేదా ? అందుకే ఆపేశా అంటూ కామెంట్స్
Recommended image2
Nagarjuna: ఛి.. ఛి ఇదేం పని అనుకున్న నాగార్జున, బిగ్ బాస్ హోస్ట్ ఎలా అయ్యాడు, కింగ్ షాకింగ్ కామెంట్స్
Recommended image3
Master Bharath: యాక్టర్ నుంచి డాక్టర్ గా.. తల్లి చివరి కోరిక తీర్చడానికి కెరీర్ ను త్యాగం చేసిన మాస్టర్ భరత్...
Related Stories
Recommended image1
Nagarjuna: ఛి.. ఛి ఇదేం పని అనుకున్న నాగార్జున, బిగ్ బాస్ హోస్ట్ ఎలా అయ్యాడు, కింగ్ షాకింగ్ కామెంట్స్
Recommended image2
418 Movie Trailer: సెన్సార్ బోర్డును వణికించినట్రైలర్.. 418 రిలీజ్ డేట్ ఫిక్స్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved